Bigg Boss Elimination: ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. ఆ ముగ్గురిలో ఇద్దరు బయటకు.. ఒక టాప్ లేడీ కూడా ఔట్
అంతకు ముందెప్పుడూ చూడని కంటెంట్.. సరికొత్త టాస్కులు.. కంటెస్టెంట్ల మధ్య గొడవలు.. గ్రూపు తగాదాలు.. ప్రేమ కహానీలు.. అప్పుడప్పుడూ రొమాన్స్ వీటన్నింటి కలయికే బిగ్ బాస్ షో. తెలుగు టెలివిజన్ హిస్టరీలోనే భారీ స్థాయిలో ప్రేక్షకాదరణను అందుకున్న కార్యక్రమంగా రికార్డులు క్రియేట్ చేసిందీ షో.
ఇలా ఒకటి కాదు రెండు చాలా సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడోది కూడా ఆసక్తికరంగా సాగుతోంది. ఇక, ఇందులో రెండో వారంలోనే డబుల్ ఎలిమినేషన్ జరగబోతున్నట్లు తెలిసింది. ఆ వివరాలను మీరే చూడండి!

మజాను పంచుతోన్న సీజన్: తెలుగులో బిగ్ బాస్ షో ఇప్పటికే ఆరు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో దాన్ని గతంలో ఎన్నడూ చూడని కొత్త కంటెంట్‌తో ప్రసారం చేస్తున్నారు. దీంతో ఇది మరింత కొత్తగా, ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగుతోంది. అందుకు తగ్గట్లుగానే ఈ సీజన్‌కు గతంలో వాటికి మాదిరిగా రేటింగ్ మాత్రం స్పందన దక్కుతున్నాయని చెప్పాలి.
ఫస్ట్ వీక్ కిరణ్ ఎలిమినేట్: ఏడో సీజన్‌లోకి 14 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. అందులో ప్రియాంక జైన్, హీరో శివాజి, సింగర్ దామిని, నటుడు ప్రిన్స్ యావర్, శుభ శ్రీ, నటి షకీలా, కొరియోగ్రాఫర్ సందీప్, నటి శోభా శెట్టి, టేస్టీ తేజ, నటి రతికా రోజ్, గౌతమ్ కృష్ణ, కిరణ్ రాథోడ్, పల్లవి ప్రశాంత్, అమరదీప్‌లు వచ్చారు. వీరిలో మొదటి వారం జరిగిన ఎలిమినేషన్‌లో కిరణ్ రాథోడ్ బయటకు వెళ్లిపోయింది.
రెండో వారంలో 9 మంది: తాజా సీజన్‌లోని రెండో వారానికి గానూ జరిగిన నామినేషన్స్ ప్రక్రియలో గతంలో కంటే భిన్నంగా కొన్ని గొడవలతో సాగింది. చివరికి ఇందులో 9 మంది సభ్యులు నామినేట్ అయ్యారు. అందులో పల్లవి ప్రశాంత్, టేస్టీ తేజ, శోభా శెట్టి, షకీలా, రతికా రోజ్, గౌతమ్ కృష్ణ, శివాజి, అమర్‌దీప్‌లు నామినేట్ అయ్యారు. అయితే, ప్రిన్స్ యావర్‌ను మాత్రం సందీప్ నేరుగా నామినేట్ చేసేశాడు.
రైతు బిడ్డకే భారీ పోలింగ్: బిగ్ బాస్ రెండో వారానికి సంబంధించి జరిగిన ఓటింగ్ ప్రక్రియ చాలా మార్పులతో సాగినట్లు తెలిసింది. కానీ, ఇందులో మొదటి స్థానంలో మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకూ కొనసాగాడు. ఈ వారంలో తొమ్మిది మంది ఉన్నా అతడికి మాత్రం ఏకంగా 40 శాతం వరకూ ఓటింగ్ నమోదు అయింది. దీంతో మళ్లీ సేఫ్ అయ్యాడు.
మిగిలిన స్థానాల్లో ఎవరు: బిగ్ బాస్ ఏడో సీజన్ రెండో వారంలో జరిగిన ఓటింగ్‌లో పల్లవి ప్రశాంత్ తర్వాత శివాజి రెండో స్థానంలో ఉన్నాడని తెలిసింది. అయితే, ఆ తర్వాత స్థానాల్లో మాత్రం మార్పులు కనిపిస్తూనే ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం.. అమర్ మూడో స్థానంలో, రతిక నాలుగో స్థానంలో ఉన్నారు. నిన్నటి ఎపిసోడ్‌లో జరిగిన అవమానంతో ప్రిన్స్ యావర్ ఓటింగ్ పెరిగి ఐదుకు చేరుకున్నాడు.

డేంజర్ జోన్‌లో వాళ్లంతా: రెండో వారానికి సంబంధించిన ఓటింగ్‌లో ఊహించని విధంగా టేస్టీ తేజ ఆరో స్థానంలో, గౌతమ్ కృష్ణ ఏడో స్థానంలో నిలిచారు. ఇక, ఈ సీజన్‌లో టాప్ కంటెస్టెంట్లలో ఒకరిగా ఉన్న శోభా శెట్టి మాత్రం ఎనిమిదో స్థానానికి పడిపోయింది. ఫలితంగా షకీలా అందరి కంటే చివర్లో 9వ స్థానంలో ఉంది. వీరిలో చివర్లో ఉన్న ఇద్దరు కంటెస్టెంట్లు డేంజర్ జోన్‌లో ఉన్నారని చెప్పాలి.

ఈ వారం డబుల్ ట్రబుల్: బిగ్ బాస్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం.. రెండో వారంలో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందట. అదే జరిగితే చివరి రెండు స్థానాల్లో ఉన్న షకీలా, శోభా శెట్టి ఎలిమినేట్ అవుతారని అంటున్నారు. లేదంటే శోభాను ఆపి గౌతమ్‌ను పంపే చాన్స్ కూడా ఉంది. మరోవైపు, ఒకరిని ఎలిమినేట్ చేసి మరొకరిని సీక్రెట్ రూమ్‌లోకి పంపే ట్విస్టును కూడా రెడీ చేస్తున్నారని సమాచారం.


Click it and Unblock the Notifications











