Bigg Boss 7 Voting: 5వ వారం సెన్సేషనల్ ఓటింగ్.. అతడు రికార్డు.. డేంజర్ జోన్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్

తెలుగు బుల్లితెరపైకి ఎన్నో అనుమానాల నడుమ వచ్చినా.. అనూహ్యంగా అందరి ఆదరాభిమానాలను సొంతం చేసుకుని నెంబర్ వన్ షోగా ఎదిగింది బిగ్ బాస్. కొత్త కాన్సెప్టుతో ప్రసారం అయ్యేదే అయినా దీనికి ప్రేక్షకులు భారీ స్థాయిలో రెస్పాన్స్‌ను ఇస్తున్నారు. ఫలితంగా ఇది భారీ స్థాయిలో టీఆర్పీ రేటింగ్‌ను సొంతం చేసుకుంటూ రికార్డులు సాధిస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రసారం అవుతోన్న ఏడో సీజన్ కూడా ఆసక్తికరంగానే సాగుతోంది. ఈ నేపథ్యంలో 5వ వారానికి సంబంధించిన ఓటింగ్‌ సరళి బయటకు వచ్చింది. ఆ సంగతులు మీకోసం!

కొత్త కాన్సెప్టు.. ఆసక్తికరంగా:బిగ్ బాస్ షో తెలుగులో ఎప్పుడు ప్రసారం అయినా ఊహించని రీతిలో స్పందన దక్కుతోంది. అందుకు అనుగుణంగానే ఏడో సీజన్‌కు మాత్రం ఆరంభం నుంచి ఆదరణ భారీ స్థాయిలో లభిస్తోంది. ముఖ్యంగా ఊహించని సీన్స్, సర్‌ప్రైజులు, కొత్త ట్విస్టులతో ప్రేక్షకులకు మజాను పంచుతోంది. దీంతో ఈ సీజన్‌కు రేటింగ్ అనుకున్న దానికంటే ఎక్కువగానే వస్తోంది.

 Bigg Boss Telugu 7 Elimination: Tasty Teja And Gautham Entered into Danger Zone 5th Week

ఎవరెవరు వెళ్లిపోయారంటే:బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి నటి షకీలా, కొరియోగ్రాఫర్ సందీప్, శోభా శెట్టి, టేస్టీ తేజ, నటి రతికా రోజ్, ప్రియాంక జైన్, శివాజి, సింగర్ దామిని, నటుడు ప్రిన్స్ యావర్, శుభ శ్రీ, నటుడు గౌతమ్ కృష్ణ, నటి కిరణ్ రాథోడ్, రైతు పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్‌లు ఎంటర్ అయ్యారు. వీరి నుంచి ఫస్ట్ వీక్ కిరణ్ రాథోడ్, రెండో వారంలో షకీలా, మూడో వారంలో దామిని, నాలుగో వారం రతికా వెళ్లిపోయారు.

ఈ వారం 7గురు నామినేట్:ఏడో సీజన్ ఐదో వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ ప్రక్రియ పాత కాన్సెప్టుతోనే ఎన్నో గొడవలతో రంజుగానే సాగింది. ఇందులో మొత్తం ఏడుగురు కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు.
ముఖ్యంగా టేస్టీ తేజను నాగార్జునే డైరెక్ట్ నామినేట్ చేశాడు. అలాగే, ప్రిన్స్ యావర్, ప్రియాంక, శివాజి, శుభశ్రీ రాయగురు, గౌతమ్ కృష్ణ, అమర్‌దీప్‌లను కంటెస్టెంట్లు నామినేట్ చేశారు.

 Bigg Boss Telugu 7 Elimination: Tasty Teja And Gautham Entered into Danger Zone 5th Week

సెన్సేషనల్ ఓటింగ్‌తోనే:ఐదో వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ ఆరంభం నుంచే ఏకపక్షంగా సాగుతున్నట్లు తెలిసింది. ముఖ్యంగా ఇందులో అనూహ్యంగా పవర్ అస్త్రను పోగొట్టుకుని నామినేషన్స్‌లోకి వచ్చేసిన శివాజికి ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. దీంతో అతడి ఒక్కడికే రికార్డు స్థాయిలో 48 శాతం వరకూ పోలింగ్ నమోదు అయినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వారం అతడే టాప్‌లో కొనసాగుతోన్నాడు.

 Bigg Boss Telugu 7 Elimination: Tasty Teja And Gautham Entered into Danger Zone 5th Week

ఎవరు ఏ స్థానంలో అంటే:ఏడో సీజన్ ఐదో వారంలో జరుగుతున్న ఓటింగ్‌లో శివాజి తర్వాత ప్రిన్స్ యావర్ రెండో స్థానంలో కొనసాగుతున్నట్లు కూడా తెలిసింది. అయితే వీళ్లిద్దరి తర్వాతి స్థానాల్లో మాత్రం ఎన్నో రకాల మార్పులు మాత్రం కనిపిస్తున్నాయి. ఇప్పుడు మూడో స్థానంలో అమర్‌దీప్, నాలుగో స్థానంలో ప్రియాంక జైన్‌లు, ఐదో స్థానంలో శుభశ్రీ రాయగురులు ఉన్నారని విశ్వసనీయంగా తెలిసింది.

 Bigg Boss Telugu 7 Elimination: Tasty Teja And Gautham Entered into Danger Zone 5th Week

డేంజర్‌ జోన్‌లో ఎవరంటే?:ఐదో వారానికి సంబంధించిన ఓటింగ్‌లో అనూహ్యంగా గౌతమ్ కృష్ణ ఆరో స్థానానికి పడిపోయాడని తెలిసింది. ఇక, ముందు నుంచీ అనుకున్నట్లుగానే ఈ వారంలో అందరి కంటే తక్కువ ఓట్లతో టేస్టీ తేజ చివరి స్థానంలో కొనసాగుతున్నాడు. ఏడో స్థానంలో ఇతడే ఉన్నా.. అంతకు ముందు స్థానాల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఓటింగ్‌కు ఇంకా సమయం ఉంది కాబట్టి ఏదైనా జరగొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X