Bigg Boss Voting: 2వ వారం షాకింగ్ ఓటింగ్.. అతడికే ఎక్కువ ఓట్లు.. డేంజర్ జోన్‌లో బెస్ట్ కంటెస్టెంట్

కాన్సెప్టు కొత్తగానే ఉన్నా.. ప్రేక్షకుల నుంచి భారీ ఆదరణను అందుకుని నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్‌బాస్. కంటెంట్ ఎలాంటిదైనా ప్రేక్షకుల మద్దతు దొరికిన ఏ షో అయినా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని ఇది నిరూపించింది. చాలా భాషల్లో వస్తున్నా.. మన దగ్గర మాత్రమే ఎక్కువ రేటింగ్‌ను అందుకుంటోంది. ఇప్పుడు ఏడో సీజన్ కూడా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇక, రెండో వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్‌లో ఎలిమినేషన్ జోన్‌లోకి వెళ్లిన వారిలో ఎవరికి ఎక్కువ ఓట్లు పడుతున్నాయి? డేంజర్ జోన్‌లో ఎవరున్నారు? చూద్దామా!

ఆసక్తిని రేకెత్తించే కాన్సెప్టుతో:అనతి కాలంలోనే తెలుగులో విశేషమైన రెస్పాన్స్‌ను దక్కించుకుని హిట్టైన ఏకైక షో బిగ్ బాస్. అందుకే ఇది ఇప్పటికే భారీ స్థాయి టీఆర్పీ రేటింగ్‌తో పలు సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే నిర్వహకులు ఇటీవలే ఏడో దాన్ని కూడా స్టార్ట్ చేశారు. ఉల్టా పుల్టా అనే కాన్సెప్టుతో వస్తున్న ఈ సీజన్‌లో ఎన్నడూ చూడని సరికొత్త ప్రయోగాలు, ట్విస్టులతో రక్తి కట్టిస్తున్నారు.

Bigg Boss Telugu 7 Elimination: Tasty Teja and Shakeela Entered into Danger Zone 2nd Week

14 మంది.. ఆమె ఎలిమినేట్:ఏడో సీజన్‌లోకి సీరియల్ నటి ప్రియాంక జైన్, హీరో శివాజి, సింగర్ దామిని, నటుడు ప్రిన్స్ యావర్, యంగ్ హీరోయిన్ శుభ శ్రీ, నటి షకీలా, కొరియోగ్రాఫర్ సందీప్, సీరియల్ నటి శోభా శెట్టి, యూట్యూబర్ టేస్టీ తేజ, నటి రతికా రోజ్, నటుడు గౌతమ్ కృష్ణ, నటి కిరణ్ రాథోడ్, రైతు పల్లవి ప్రశాంత్, సీరియల్ హీరో అమరదీప్‌లు వచ్చారు. వీరిలో కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయింది.

Bigg Boss Telugu 7 Elimination: Tasty Teja and Shakeela Entered into Danger Zone 2nd Week

ఈ వారం 9 మంది నామినేట్:తాజా సీజన్‌లో రెండో వారానికి గానూ జరిగిన నామినేషన్స్ ప్రక్రియలో మొత్తం ఎన్నో గొడవలతో రచ్చ రచ్చగా సాగింది. చివరికి ఇందులో 9 మంది సభ్యులు నామినేట్ అయిపోయారు. వారిలో పల్లవి ప్రశాంత్, టేస్టీ తేజ, శోభా శెట్టి, షకీలా, రతికా రోజ్, గౌతమ్ కృష్ణ, శివాజి, అమర్‌దీప్‌లు కంటెస్టెంట్ల ద్వారా నామినేట్ అయ్యారు. ప్రిన్స్ యావర్‌ను మాత్రం సందీప్ నామినేట్ చేశాడు.

Bigg Boss Telugu 7 Elimination: Tasty Teja and Shakeela Entered into Danger Zone 2nd Week

మొదటి రోజే షాకింగ్ ఓటింగ్:బిగ్ బాస్ ఏడో సీజన్ రెండో వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ మంగళవారం రాత్రి 10:30 గంటల నుంచి మొదలైంది. ఇది ఎంతో ఆసక్తికరంగా, షాకింగ్‌గా సాగుతున్నట్లు తెలిసింది. బిగ్ బాస్ వర్గాల సమాచారం ప్రకారం.. ఇందులో ఆరంభం నుంచీ పల్లవి ప్రశాంత్ టాప్‌లో కొనసాగుతున్నాడు. అతడు ఒక్కడికే దాదాపు 42 శాతం పైగా ఓట్లు నమోదు అవుతున్నాయని సమాచారం.

Bigg Boss Telugu 7 Elimination: Tasty Teja and Shakeela Entered into Danger Zone 2nd Week

మిగిలిన స్థానాల్లో ఎవరంటే:బిగ్ బాస్ ఏడో సీజన్ రెండో వారంలో జరుగుతున్న ఓటింగ్‌లో పల్లవి ప్రశాంత్ తర్వాత శివాజి రెండో స్థానంలో ఉన్నాడు. వీళ్లిద్దరి తర్వాత స్థానాల్లో మాత్రం ఎటువంటి తేడా లేకుండా ఓటింగ్ కొనసాగుతునట్లు తెలిసింది. బిగ్ బాస్ వర్గాల సమాచారం ప్రకారం అమర్ మూడో స్థానంలో, రతిక నాలుగో స్థానంలో, గౌతమ్ ఐదో స్థానంలో, ప్రిన్స్ ఆరో స్థానంలో ఉన్నట్లు తెలిసింది.

Bigg Boss Telugu 7 Elimination: Tasty Teja and Shakeela Entered into Danger Zone 2nd Week

డేంజర్‌ జోన్‌లో ఎవరంటే?:రెండో వారానికి సంబంధించి జరుగుతున్న ఓటింగ్‌లో ఊహించని విధంగా శోభా శెట్టి ఏడో స్థానంలో కొనసాగుతుండగా.. షకీలా ఎనిమిదో స్థానంలో ఉన్నారు. ఇక, ఈ సీజన్‌లో కామెడీని పండిస్తూ బెస్ట్ ఎంటర్‌టైనర్‌ అనిపించుకుంటోన్న టేస్టీ తేజ అందరి కంటే చివర్లో 9వ స్థానంలో ఉన్నాడు. అయితే రాను రానూ ఆటను బట్టి ఈ ఓటింగ్‌లో మార్పులు వచ్చే అవకాశం కూడా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X