Bigg Boss 7 Voting: 5వ వారం ఓటింగ్‌లో ట్విస్ట్.. శివాజికి తగ్గిన ఓట్లు.. ఈ ముగ్గురిలోనే ఒకరు ఔట్
తెలుగు టెలివిజన్‌పై సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తూ.. దేశంలోనే టాప్ రేటింగ్‌ను రాబడుతూ.. నెంబర్ వన్ షోగా సత్తా చాటుతోంది బిగ్ బాస్. అంతేకాదు, ఎప్పటికప్పుడూ భారీ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంటూ దేశంలోనే టాప్ ప్లేస్ షోగా వెలుగొందుతోంది. దీంతో నిర్వహకులు రెట్టించిన ఉత్సాహంతో కొత్త సీజన్లను తీసుకు వస్తున్నారు. ఇలా ఇప్పుడు ఏడో సీజన్‌ను ఉల్టా పుల్టా కాన్సెప్టుతో విజయవంతంగా నడుపుతున్నారు. ఇందులో 5 వారంలో జరుగుతున్న ఓటింగ్ డీటేల్స్ తాజాగా బయటకు వచ్చాయి? ఆ పూర్తి వివరాలేంటో మీరే చూసేయండి!
వాటిని తలదన్నే విధంగా:మిగిలిన భాషల కంటే తెలుగులోనే బిగ్ బాస్ షో సూపర్ సక్సెస్ అయింది. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే ఇప్పుడు ఏడో సీజన్ మరింత రంజుగా సాగుతోంది. పైగా ఇది ఉల్టా పుల్టా అనే కాన్సెప్టుతో నడుస్తుంది కావడంతో మరింత ఎక్కువ మజా పంచుతోంది. ఫలితంగా రెండు రెండు సీజన్లతో పోలిస్తే ఎక్కువగానే రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంటూ రేటింగ్‌ను రాబడుతోంది.

తొలిసారిగా ఎలిమినేషన్స్:బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి షకీలా, సందీప్, శోభా శెట్టి, టేస్టీ తేజ, నటి రతికా రోజ్, ప్రియాంక జైన్, శివాజి, దామిని, ప్రిన్స్ యావర్, శుభ శ్రీ, గౌతమ్ కృష్ణ, కిరణ్ రాథోడ్, రైతు పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్‌లు ఎంటర్ అయ్యారు. వీరి నుంచి గతంలో ఎప్పుడూ జరగని విధంగా నాలుగు వారాల్లోనూ ఆడవాళ్లే కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతికా రోజ్‌లు ఎలిమినేట్ అయిపోయారు.
వాళ్లంతా నామినేషన్‌లో:బిగ్ బాస్ ఏడో సీజన్ ఐదో వారంలో జరిగిన నామినేషన్స్ ప్రక్రియ గతంలో మాదిరిగా కత్తితో పొడిచేలా జరిగింది. ఎన్నో గొడవలతో సాగిన ఈ టాస్కులో మొత్తం ఏడుగురు కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు. వీరిలో టేస్టీ తేజను నాగార్జునే డైరెక్ట్ నామినేట్ చేశాడు. ఇక, ప్రిన్స్ యావర్, ప్రియాంక, శివాజి, శుభశ్రీ రాయగురు, గౌతమ్ కృష్ణ, అమర్‌దీప్‌లను కంటెస్టెంట్లు నామినేట్ చేశారు.

శివాజికి తగ్గిన ఓటింగ్:ఏడో సీజన్‌లో ఐదో వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ ఆరంభం నుంచే ఏకపక్షంగా సాగుతున్నట్లు మొదటి నుంచీ చెబుతూనే ఉన్నాం. ముఖ్యంగా ఇందులో శివాజికి ప్రేక్షకులు జై కొడుతున్నారు. దీంతో అతడి ఒక్కడికే రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు అవుతూ వచ్చింది. అయితే బుధవారం ముగిసే సమయానికి ఓట్లు తగ్గి 40 శాతం లోపే పొందుతున్నాడని సమాచారం.

ఎవరు ఏ స్థానంలో అంటే:తాజాగా జరుగుతోన్న ఓటింగ్‌లో శివాజి తర్వాత ప్రిన్స్ యావర్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆరంభం నుంచీ వీళ్లిద్దరి స్థానాల్లో మార్పులు కనిపించడం లేదు. అయితే వీళ్ల తర్వాతి స్థానాలు మాత్రం తారుమారు అవుతున్నాయి. ఇప్పుడు మూడో స్థానంలో అమర్‌దీప్, నాలుగో స్థానంలో గౌతమ్ కృష్ణ, ఐదో స్థానంలో ప్రియాంక జైన్ ఉన్నారని విశ్వసనీయంగా తెలిసింది.

ముగ్గురూ ప్రమాదంలోనే:ఐదో వారానికి సంబంధించిన ఓటింగ్‌లో అనుకోకుండా శుభశ్రీ రాయగురు ఆరో స్థానానికి పడిపోయిందని తెలిసింది. అయితే, అందరి కంటే తక్కువ ఓట్లతో టేస్టీ తేజ చివరి స్థానంలో కొనసాగుతున్నాడు. వీళ్లిద్దరితో పాటు ప్రియాంక జైన్‌కు కూడా తక్కువగానే ఓట్లు పోల్ అవుతున్నాయి. దీంతో ఈ వారంలో ఈ ముగ్గురూ ఎలిమినేషన్ ప్రమాదంలోనే ఉన్నారని చెప్పొచ్చు.


Click it and Unblock the Notifications











