Bigg Boss Elimination: 5వ వారం సంచలనం.. చివర్లో పుంజుకున్న తేజ.. ఆ టైటిల్ ఫేవరెట్‌ ఎలిమినేట్!

మిగిలిన భాషలతో పోలిస్తే తెలుగులో ప్రసారం అవుతోన్న బిగ్ బాస్ షోకు మరింత ఎక్కువగా ఆదరణ లభిస్తోందన్న విషయం తెలిసిందే. అందుకే ఇండియాలో మరే షోకూ రానంత ఎక్కువ రేటింగ్ మన దగ్గర వస్తోంది. అందుకే తెలుగులో ఈ రియాలిటీ షో ఏకంగా ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్లను కూడా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో దాన్ని కూడా నిర్వహకులు మొదలు పెట్టారు. ఇందులో ఎన్నో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఐదో వారంలో కూడా సంచలన ఎలిమినేషన్ జరగబోతుందని తెలిసింది. ఆ వివరాలు మీకోసం!

కంటెంట్‌కు తగ్గ స్పందన:గత రెండు సీజన్లు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో ఏడో దానిపై నిర్వహకులు బాగా శ్రద్ద పెట్టారు. ఇందులో భాగంగానే దీన్ని ఉల్టా పుల్టా కాన్సెప్టుతో నడుపుతున్నారు. ఇందులో ఎవరూ ఊహించని టాస్కులు, సర్‌ప్రైజ్‌లు, ట్విస్టులు, ఎలిమినేషన్స్ కనిపిస్తున్నాయి. దీంతో ఆరంభం నుంచే దీనికి మంచి స్పందన దక్కుతోంది. ఫలితంగా ఈ సీజన్ సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది.

Bigg Boss Telugu 7 Elimination: Tasty Teja Or Priyanka Jain Will Eliminate in 5th Week

ఆ నలుగురు ఎలిమినేట్:తాజాగా జరుగుతున్న సీజన్‌లోకి షకీలా, కొరియోగ్రాఫర్ సందీప్, శోభా శెట్టి, టేస్టీ తేజ, నటి రతికా రోజ్, ప్రియాంక జైన్, శివాజి, సింగర్ దామిని, నటుడు ప్రిన్స్ యావర్, శుభ శ్రీ, నటుడు గౌతమ్ కృష్ణ, నటి కిరణ్ రాథోడ్, రైతు పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్‌లు ఎంటర్ అయ్యారు. వీరి నుంచి తొలి వారంలో కిరణ్ రాథోడ్, 2వ వారంలో షకీలా, 3వ వారంలో దామిని, 4వ వారం రతికాలు వెళ్లిపోయారు.

5వ వారం వీళ్లే నామినేట్:బిగ్ బాస్ ఏడో సీజన్ ఐదో వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ ప్రక్రియ కత్తులతో గుచ్చే కాన్సెప్టుతో నిర్వహించారు. ఇందులో ఎన్నో గొడవల తర్వాత ఏడుగురు కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు. వారిలో టేస్టీ తేజను నాగార్జునే డైరెక్ట్ నామినేట్ చేశాడు. మిగిలిన ప్రిన్స్ యావర్, ప్రియాంక, శివాజి, శుభశ్రీ రాయగురు, గౌతమ్ కృష్ణ, అమర్‌దీప్‌లను కంటెస్టెంట్లు ఎంపిక చేశారు.

Bigg Boss Telugu 7 Elimination: Tasty Teja Or Priyanka Jain Will Eliminate in 5th Week

ఏకపక్షం.. అతడికే సగం:ఐదో వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ ఆరంభం నుంచే ఏకపక్షంగా సాగినట్లు తెలిసింది. కంటెస్టెంట్ల పక్షపాతం వల్ల పవర్ అస్త్ర కోల్పోయి నామినేషన్స్‌లోకి వచ్చిన శివాజికి ప్రేక్షకులు జై కొట్టారు. దీంతో అతడి ఒక్కడికే రికార్డు స్థాయిలో 45 శాతం వరకూ పోలింగ్ నమోదు అయినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వారం అతడే అందరి కంటే ముందుగానే సేఫ్ అయ్యాడు.

వాళ్లంతా సేఫ్ అయ్యారు:ఏడో సీజన్ ఐదో వారంలో పూర్తైన ఓటింగ్‌లో శివాజి తర్వాత అమర్‌దీప్ చౌదరి రెండో స్థానంలో నిలిచినట్లు కూడా తెలిసింది. అయితే వీళ్లిద్దరి తర్వాతి స్థానాల్లో మాత్రం చాలా రకాల మార్పులు మాత్రం కనిపించాయి. ఇలా ఓటింగ్ పూర్తయ్యే సరికి మూడో స్థానంలో ప్రిన్స్ యావర్, నాలుగో స్థానంలో గౌతమ్, ఐదో స్థానంలో శుభశ్రీ రాయగురులు ఉన్నారని విశ్వసనీయంగా తెలిసింది.

Bigg Boss Telugu 7 Elimination: Tasty Teja Or Priyanka Jain Will Eliminate in 5th Week

టైటిల్ ఫేవరెట్‌కే ఛాన్స్:ఐదో వారానికి సంబంధించిన ఓటింగ్‌లో మొదటి నుంచీ తేజనే చివరి స్థానంలో ఉన్నాడు. దీంతో అతడే ఎలిమినేట్ అవుతాడని అంతా అనుకున్నారు. కానీ, అనూహ్యంగా ప్రియాంక జైన్ ఏడో స్థానానికి పడిపోయిందని తెలిసింది. దీంతో తేజ ఆరో స్థానానికి చేరుకున్నాడని అంటున్నారు. ఫలితంగా ఈ సారి ప్రియాంకానే ఎక్కువ శాతం ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని టాక్.

Bigg Boss Telugu 7 Elimination: Tasty Teja Or Priyanka Jain Will Eliminate in 5th Week

అలా కూడా జరగొచ్చట:బిగ్ బాస్ ఏడో సీజన్‌లో ఐదో వారానికి సంబంధించిన ఎలిమినేషన్ విషయంలో మరో వార్త కూడా వైరల్ అవుతోంది. వచ్చే ఆదివారం ఈ సీజన్ రీలాంచ్ కాబోతుంది. దీంతో షోలోకి మరో ఆరు లేదా ఏడుగురు కంటెస్టెంట్లు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ వారం ఎలిమినేషన్ తీసేసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఒకవేళ జరిగినా వాళ్లను సీక్రెట్ రూమ్‌లోకి పంపుతారని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X