Bigg Boss Elimination: 9వ వారం సంచలన ఎలిమినేషన్.. ఆ కంటెస్టెంటే ఔట్.. లీకైన బిగ్ బాస్ కుట్ర
కొందరు సెలెబ్రిటీలను ఒక ఇంట్లో ఉంచి.. వాళ్లకు చిత్ర విచిత్రమైన టాస్కులను ఇచ్చి.. ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా విజేతను నిర్ణయించే షోనే బిగ్ బాస్. అసలేమాత్రం అంచనాలు లేకుండానే తెలుగులోకి పరిచయం అయిన ఈ కార్యక్రమం.. ఎవరూ ఊహించని రీతిలో రెస్పాన్స్‌ను సొంతం చేసుకుని సూపర్ సక్సెస్ అయింది. దీంతో నిర్వహకులు కొత్త సీజన్లతో వస్తున్నారు. ఇలా ఇప్పుడు ఏడో దాన్ని దిగ్విజయంగా నడుపుతున్నారు. ఇందులో తొమ్మిదో వారానికి సంబంధించిన ఎలిమినేషన్‌పై తాజాగా ఓ సంచలన విషయం లీక్ అయింది. ఆ సంగతులేంటో చూసేయండి!
ఇది కదా అసలైన వినోదం:బిగ్ బాస్ ఇప్పటి వరకూ తెలుగులో ఆరు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్లను పూర్తి చేసుకుంది. కానీ, వీటన్నింటిలోనూ చూపించని కొత్త కొత్త కంటెంట్‌ను ఏడో సీజన్‌లో ప్రసారం చేస్తున్నారు. దీంతో గత సీజన్ల కంటే దీనికి భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. ఫలితంగా ఈ షో రేటింగ్‌ను కూడా భారీగా రాబడుతోంది. దీంతో నిర్వహకులు మరింత ఉత్సాహంతో కొత్త కొత్త టాస్కులు తెస్తున్నారు.

ఎవరెవరు వెళ్లిపోయారు?:తాజాగా ప్రసారం అవుతోన్న బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి మొదట 14 మంది, వైల్డ్ కార్డు ద్వారా మరో ఐదుగురు కంటెస్టెంట్లు వచ్చారు. వీళ్లలో నుంచి మొదటి వీక్ కిరణ్ రాథోడ్, రెండో వారంలో షకీలా, మూడో వారంలో దామిని, నాలుగో వారం రతికా రోజ్, ఐదో వారంలో శుభశ్రీ, ఆరో వారం నయనీ, ఏడో వారం పూజా, ఎనిమిదో వారం సందీప్‌లు షో నుంచి బయటకు వెళ్లిపోయారు.
9వ వారంలో 8 మందితో:ఏడో సీజన్‌లో నామినేషన్లు అన్నీ కంటెస్టెంట్ల మధ్య వాదోపవాదనలతో ఎంతో రచ్చ రచ్చగా సాగుతున్నాయి. అందుకు తగ్గట్లే తొమ్మిదో వారం ప్రక్రియ కూడా కంటెసెంట్ల మధ్య గొడవలతో రంజుగా సాగిపోయింది. ఇందులో ఎనిమిది మంది కంటెస్టెంట్లు అంటే భోలే షావలి, ప్రిన్స్ యావర్, రతికా రోజ్, అమర్‌దీప్, శోభా శెట్టి, ప్రియాంక జైన్, టేస్టీ తేజ, అర్జున్‌లు నామినేట్ అయ్యారు.

టాప్ పొజిషన్‌లో మార్పు:తొమ్మిదో వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ మొదలైన వెంటనే మొదటి రెండు రోజులు ప్రిన్స్ యావర్‌కు అత్యధిక ఓట్లు లభించడంతో టాప్‌లో కొనసాగాడు. కానీ, ఆ తర్వాత ఈ వారం టాస్కుల్లో అదరగొట్టేసిన అమర్‌దీప్ చౌదరికి పోలింగ్ పెరిగిపోయింది. దీంతో అతడే టాప్ ప్లేస్‌లోకి వచ్చాడు. అలా ఈ వారం ఓటింగ్ పూర్తయ్యే వరకూ హవాను చూపించినట్లు తెలిసింది.
వాళ్లంతా సేఫ్ అయినట్లే:ఏడో సీజన్‌లో తొమ్మిదో వారానికి సంబంధించిన ఓటింగ్‌లో అమర్‌దీప్ చౌదరి టాప్ పొజిషన్ తెచ్చుకోగా.. ప్రిన్స్ యావర్ రెండో స్థానంలో ఉన్నాడని తెలిసింది. ఇక, వీళ్లిద్దరి తర్వాతి స్థానాల్లో రకరకాల మార్పులు వచ్చాయి. అయితే, ఓటింగ్ ముగిసే సమయానికి అంబటి అర్జున్ మూడో స్థానంలో, భోలే షావలి నాలుగో స్థానంలో, ఐదో స్థానంలో ప్రియాంక ఉండి సేఫ్ అయ్యారని టాక్.

ముగ్గురు డేంజర్ జోన్‌లో:ఈ వారానికి గానూ జరిగిన ఓటింగ్‌లో టేస్టీ తేజ మొదటి నుంచీ ఆరో స్థానంలోనే కొనసాగుతున్నాడు. అయితే, ఊహించని విధంగా ఓటింగ్ ముగిసే సమయానికి అతడు ఏడో స్థానానికి పడిపోయాడట. దీంతో రతికా రోజ్ ఆరో స్థానానికి చేరిందని తెలిసింది. ఇక, మొదటి నుంచీ ఈ వారంలో శోభా శెట్టినే చివరి స్థానంలో ఉందని బుల్లితెర వర్గాల ద్వారా న్యూస్ లీక్ అయింది.
పంపేది ఆ కంటెస్టెంట్‌నే:తొమ్మిదో వారంలో శోభా శెట్టికి తక్కువ ఓట్లు ఉన్నాయి. కాబట్టి ఆమెనే ఎక్కువ శాతం ఎలిమినేట్ అవుతుంది. కానీ, టేస్టీ తేజను ఎలిమినేట్ చేసేలా కుట్ర జరుగుతుందని తాజాగా ఓ న్యూస్ లీకైంది. శోభా ఉంటే టీఆర్పీ వస్తుంది అని భావిస్తున్న బిగ్ బాస్ టీమ్.. ఆమెను అప్పుడే పంపించకపోవచ్చు అంటున్నారు. మొత్తానికి తేజ వెళ్లినా, మోనిత వెళ్లినా సంచలనమే అవుతుంది.


Click it and Unblock the Notifications











