పల్లవి ప్రశాంత్ బెయిల్ వెనుక ఒకే ఒక్కడు: చక్రం తిప్పిన కంటెస్టెంట్.. ఏకంగా రేవంత్ రెడ్డితోనే!

బిగ్ బాస్ ఏడో సీజన్ మొదలైన తర్వాత నుంచి ప్రతి రోజూ వార్తల్లో నిలుస్తూ సెన్సేషన్ అవుతోన్న ఏకైక కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్. కామన్ మ్యాన్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అతడు.. అసాధారణ ఆటతీరుతో విజేతగా నిలిచాడు. అక్కడే అసలైన రచ్చ మొదలైంది.

Recommended Video

Pallavi Prashanth కోసం ప్రజావాణి లో దరఖాస్తు ..భళా భోలే .. | Filmibeat Telugu

అన్నపూర్ణ స్టూడియో దగ్గర జరిగిన న్యూసెన్స్ కేసులో ప్రశాంత్‌ను ప్రధాన నిందితుడిని చేసి అరెస్ట్ చేశారు. అలా జైలు పాలైన రైతు బిడ్డకు శుక్రవారం బెయిల్ వచ్చింది. మరి దీనికి కారణం ఎవరు? లాయర్లతో కలిసి చక్రం తిప్పిన కంటెస్టెంట్ ఎవరు? అనే వివరాలను చూద్దాం పదండి!

Bigg Boss Telugu 7 Fame Bhole Shavali Was Main Reason for Pallavi Prashanth Gets Bail

జైలులో బిగ్ బాస్ విన్నర్: బిగ్ బాస్ ఏడో సీజన్ గ్రాండ్ ఫినాలే తర్వాత జరిగిన గొడవలు, అల్లర్లకు బాధ్యుడిని చేస్తూ పల్లవి ప్రశాంత్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు 9 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రెండు రోజుల తర్వాత అంటే బుధవారం సాయంత్రం పల్లవి ప్రశాంత్ నివాసానికి చేరుకుని అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం చంచల్‌గూడ జైలులో ఉంచారు.

ప్రశాంత్ కోసం లాయర్లు: బిగ్ బాస్ ఏడో సీజన్ విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం.. ఆ తర్వాత జైలుకు పంపించడం దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అయింది. ఈ నేపథ్యంలో అతడికి మద్దతుగా చాలా మంది ముందుకు వచ్చారు. అదే సమయంలో కొందరు హైకోర్టుకు చెందిన లాయర్లు సైతం ప్రశాంత్ తరపున వాదించేందుకు స్వయంగా వచ్చిన విషయం తెలిసిందే.

Bigg Boss Telugu 7 Fame Bhole Shavali Was Main Reason for Pallavi Prashanth Gets Bail

ప్రశాంత్‌కు బెయిల్ జారీ: అన్నపూర్ణ స్టూడియో బయట జరిగిన న్యూసెన్స్ కేసులో అరెస్ట్ అయి జైలు పాలైన పల్లవి ప్రశాంత్‌కు బెయిల్ కోరుతూ జరిగిన విచారణలో నాంపల్లి కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది. శుక్రవారం దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం షరతులతో కూడిన బెయిల్‌ను ఇచ్చింది. దీంతో పల్లవి ప్రశాంత్ శనివారం చంచల్‌గూడ జైలు నుంచి విడుదల కాబోతున్నాడు.

రంగంలోకి భోలే షావలి: పల్లవి ప్రశాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేసినప్పటి నుంచి ఒకే ఒక్క బిగ్ బాస్ కంటెస్టెంట్ స్వయంగా రంగంలోకి దిగాడు. ఆయనే పాట బిడ్డగా ఫేమస్ అయిన భోలే షావలి. ఎప్పుడైతే రైతు బిడ్డ మీద పోలీసులు కేసు నమోదు చేశాడో అప్పటి నుంచి భోలే బయటకు వచ్చాడు. అతడు అరెస్ట్ కాకుండా తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు జరిపాడు. కానీ, ఫలితం లేకుండానే పోయింది.

Bigg Boss Telugu 7 Fame Bhole Shavali Was Main Reason for Pallavi Prashanth Gets Bail

బెయిల్ వెనుక ఆ ఒక్కడే: పల్లవి ప్రశాంత్‌ను జైలుకు తరలించిన తర్వాత భోలే షావలి మీడియా ముందుకు వచ్చాడు. అతడు ఇచ్చిన పిలుపు మేరకే లాయర్లు వచ్చి ఈ కేసును స్వచ్చందంగా వాదించారు. అలా ఎన్నో కష్టనష్టాలను అనుభవించిన తర్వాత లాయర్ల సహాయంతో పల్లవి ప్రశాంత్‌కు భోలే షావలి బెయిల్ తెప్పించాడు. దీంతో రైతు బిడ్డ అభిమానులు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Bigg Boss Telugu 7 Fame Bhole Shavali Was Main Reason for Pallavi Prashanth Gets Bail

సీఎం రేవంత్ రెడ్డితోనూ: వాస్తవానికి ప్రశాంత్ జైలుకు వెళ్లిన తర్వాత భోలే షావలి డీసీపీతో చర్చలు జరిపాడు. అయినా ఉపయోగం లేకపోవడంతో ప్రజావాణి ద్వారా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకు వెళ్లాలని కూడా భోలే షావలి డిసైడ్ అయ్యాడట. ఇందులో భాగంగానే ప్రజావాణిలో దీనిపై దరఖాస్తు ఇచ్చినట్లు తెలిసింది. మొత్తానికి అతడి కృషి ఫలితంగా ప్రశాంత్ రిలీజ్ అవుతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X