Bigg Boss Telugu 7 డబ్బు ఇచ్చి బాయ్‌ఫ్రెండ్స్‌తో.. వాళ్లు అలా చీటింగ్.. షకీలా షాకింగ్ కామెంట్స్
దక్షిణాదిలో సీనియర్ నటి షకీలా మరోసారి మరింత పాపులారిటీని సంపాదించుకోవడమే కాకుండా సినీ వర్గాల దృష్టిలో పడ్డారు. బిగ్‌బాస్ తెలుగు షోలో రెండు వారాలు మాత్రమే కొనసాగిన ఆమెకు మంచి ఆదరణ లభించింది. అయితే అనూహ్యమైన పరిస్థితుల్లో షకీలా ఎలిమినేషన్ అవ్వడం అభిమానులకు నిరాశ కలిగించింది. అయితే బిగ్‌బాస్ తర్వాత ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆమె పలు మీడియా ఛానెల్స్‌తో మాట్లాడుతున్నారు. తాజాగా ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ..
మంచి పాత్రల కోసం వెయిటింగ్: సినిమా రంగంలో గానీ, టెలివిజన్ రంగంలో గానీ మంచి పాత్రలు వస్తే చేయడానికి సిద్దంగా ఉన్నాను. ఒకప్పుడు నాకు భారీ రెమ్యునరేషన్ ఇచ్చే వాళ్లు. ఒక్కో రోజు లక్ష రూపాయల రెమ్యునరేషన్ తీసుకొన్నాను. ఒక్క షో చేస్తే దుబాయ్‌లో 20 లక్షలు ఇచ్చారు. కానీ ఇప్పుడు నా రెమ్యునరేషన్ చాలా తగ్గిపోయింది. రెమ్యునరేషన్ తక్కువైనా మంచి పాత్రలు చేయడానికి రెడీగా ఉన్నాను అని షకీలా అన్నారు.

సీరియల్స్, ఫుడ్ షోలతో: ప్రస్తుతం జీవితం గడవడానికి కొన్ని షోలు చేస్తున్నాను. తమిళంలో ఫుడ్ షోలు చేస్తున్నాను. ఇటీవల ఓ పాపులర్ షోలో రన్నరప్‌గా నిలిచాను. ఓ సీరియల్‌లో నేను నటిస్తున్నాను. అది నాకు మంచి పేరు తెచ్చే పాత్ర. సినిమా ఇండస్ట్రీలో మంచి పాత్రల కోసం వెయిట్ చేస్తున్నాను. చివరి శ్వాస వరకు నేను నటిస్తూనే ఉంటాను అని షకీలా తెలిపారు.

నా వాళ్లే నన్ను మోసగించారు: నేను విపరీతంగా డబ్బు సంపాదించేటప్పుడు నా వాళ్లను నమ్మాను. నా వాళ్లే నన్ను చీట్ చేశారు. మా అక్కయ్య నా డబ్బంతా తీసుకొని వెళ్లిపోయింది. అప్పటి నుంచి నాకు ఆర్థిక పరిస్థితుల వెంటాడాయి. నా ఫ్యామిలీ వాళ్లు ఎవరూ టచ్‌లో లేరు. నా బ్రదర్ అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు. నా అన్నయ్య కూతురు నాతో ఉంటుంది. మా అన్నయ్య చనిపోవడంతో ఆయన కూతురు పెళ్లి చేయాల్సిన బాధ్యత నాపై ఉంది అని షకీలా అన్నారు.

వేణు మాధవ్ ఒక్కడే: నేను ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పుడు ఇండస్ట్రీలో నన్ను బాగా చూసుకొన్న వ్యక్తి కమెడియన్ వేణు మాధవ్. ఓ వివాదం కారణంగా నేను హైదరాబాద్‌కు వచ్చానని తెలుసుకొన్న వేణు మాధవ్.. నా కోసం ఫిలిం చాంబర్‌కు వచ్చి తిట్టాడు. తన ఇంటికి తీసుకెళ్లి రెండు రోజులు పెట్టుకొని ఓ సిస్టర్‌లా చూసుకొన్నాడు. బట్టలు పెట్టి.. చెన్నైకి ఫ్లయిట్‌లో పంపించారు. ఇప్పటికీ వేణు మాధవ్ ఫ్యామిలీతో నా అనుబంధం కొనసాగుతుంది అని షకీలా చెప్పారు.

డబ్బు పెట్టి బాయ్‌ఫ్రెండ్స్: నా బాయ్‌ఫ్రెండ్స్ కూడా నన్ను చీట్ చేశారు. వాళ్లు చీట్ చేస్తున్నారని తెలిసి కూడా వారిని ఆదరించాను. వారికి డబ్బు లేకపోతే నేను ఇచ్చాను. నా బాయ్‌ఫ్రెండ్ నన్ను చీట్ చేసి వేరే పెళ్లి చేసుకొన్నాడు. అయినా అతడి సమస్యను నేను అర్ధం చేసుకొన్నాను. నా జీవితంలో డబ్బు పెట్టి నా బాయ్‌ఫ్రెండ్స్ కొనుకొన్నాను. వారితో లైఫ్ లీడ్ చేశాను. డబ్బు ఇచ్చి వారిని నా వద్దకు తెచ్చుకొన్నాను. నా బాయ్‌ఫ్రెండ్ చీట్ చేసినా నేను పట్టించుకొను అని షకీలా తెలిపారు.


Click it and Unblock the Notifications











