Bigg Boss Telugu 7 Finale: బిగ్ బాస్ తెలుగు చరిత్రలో మైండ్ గేమర్ ఎవరు? నాగార్జునతోపాటు అందరూ ఓటేసింది ఎవరికి?
బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక ఈరోజుతో బిగ్ బాస్ షోకి ఎండ్ కార్డ్ పడనుంది. ఇక హౌస్ నుంచి ఇప్పటికే అర్జున్ అంబటి, ప్రియాంక జైన్ ఎలిమినేట్ అయిపోయారు. ఇక హౌస్ లో ఫన్నీ క్వశ్చన్స్, ఫన్నీ గేమ్స్ పెడుతూ.. ప్రేక్షకులను ఎంటర్ టైన్మెంట్ చేస్తున్నాడు. ఇక తాజాగా నాగార్జున ఓ కంటెస్టెంట్ గురించి మాట్లాడుతూ.. ఆయనే బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో మైండ్ గేమర్ అంటూ చెప్పుకువచ్చారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బిగ్ బాస్ తెలుగు 7 సెప్టెంబర్ 3న ప్రారంభం అయింది. ఇక ఆరోజున 14మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టగా.. ఐదో వారంలో మరో ఐదుగురు కంటెస్టెంట్స్ ఎంటర్ అయ్యారు. ప్రస్తుతం హౌస్ లో ఆరుగురు ఫైనాల్ కంటెస్టెంట్స్ ఉండగా.. వారిలో అర్జున్ అంబటి, ప్రియాంక జైన్, యావర్ ఎలిమినేట్ అయ్యారు. అర్జున్ అంబటిని సుమ ఎలిమినేట్ చేయగా.. ప్రియాంక జైన్ ను మాస్ మహారాజ్ రవితేజ ఎలిమినేట్ చేస్తాడు.

ఇక ఆ యావర్.. ఎలిమినేట్ కాకపోయినప్పటికీ.. గోల్డెన్ సూట్ కేసుతో బయటకు వచ్చేస్తాడు. అయితే ఈ గేమ్స్ లో భాగంగా పాత కంటెస్టెంట్స్ తో నాగార్జున మాట్లాడుతూ.. శివాజీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తాడు. బిగ్ బాస్ తెలుగు హిస్టరీలోనే మైండ్ గేమర్ ఎవరు అంటే.. శివాజీ అని ఒప్పుకోవాల్సిందే అంటాడు. దీనికి హౌస్ లోని కంటెస్టెంట్స్ అంతా అవును అంటూ సమర్థిస్తారు.
'బిగ్ బాస్ చరిత్రలోనే శివాజీ అంత మైండ్ గేమర్ లేడు' అనేదానికి హౌజ్ మేట్స్ నుంచి ఎస్, నో అని ఆన్సర్ చెప్పాల్సిందిగా నాగార్జున అడగ్గా.... దానికి అంతా అవును అని బోర్డ్ ఎత్తుతారు. దీంతో నీకు ఊరికే చాణక్య అని పేరు పెట్టలేదని నాగార్జున... శివాజీతో చెప్తాడు. అసలు బిగ్ బాస్ సీజన్ 7లో చాలా వరకు అందరూ యంగ్ పర్సన్స్ ఉన్నారు. ఒక్క శివాజీ తప్ప. హీరోగా ఆయన ఎన్నో సినిమాలు చేసినప్పటికీ... బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి తన మైండ్ గేమ్ తో అందరినీ ఓ ఆట ఆడించారనే చెప్పాలి.
నిజానికి బిగ్ బాస్ హౌస్ లో శివాజీ మైండ్ గేమర్ అనాల్సిందే. ఫిజికల్ గా అన్ని గేముల్లో పాల్గొనలేకపోయినా... తన మైండ్ గేమ్ తో ఆట ఆడుతూ.. ఫినాలే వరకు చేరుకున్నాడు. అయితే శివాజీ కప్ కొట్టాల్సి ఉండగా.. టాప్ 3లో నిలిచాడు. దానికి కారణం అమర్ మీద చూపించిన కుల్లు అని తెలుస్తోంది. మొత్తానికి శివాజీ బిగ్ బాస్ తెలుగు చరిత్రలోనే మైండ్ గేమర్ గా నిలిచిపోయాడు.
అయితే శివాజీ ఈ సీజన్ విన్నర్ కావాల్సిన వ్యక్తి.. టాప్ 3లో నిలవడానికి కారణం ఆయన అమర్ దీప్ పై చూపించిన వెటకారం, కుల్లు అని నెటిజన్స్ అంటున్నారు. ఒకవేళ శివాజీ అమర్ దీప్ ను కూడా పాజిటివ్ గా చూసి ఉంటే.. ఆయన సీజన్ విన్నర్ అయ్యే వాడని కామెంట్స్ పెడుతున్నారు. ఇక శివాజీ ఎలిమినేట్ అయిపోయినప్పటికీ.. బిగ్ బాస్ ద్వారా బాగానే వెనకేసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన వారానికి 4న్నర లక్షల చొప్పున 15 వారాలకు 67.50 లక్షల రూపాయలు సంపాదించినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











