Bigg Boss Telugu 7 Finale: అర్జున్‌‌కు నాగార్జున స్పెషల్ గిఫ్ట్.. బిగ్ బాస్‌ చరిత్రలోనే తొలిసారిగా!

తెలుగు బుల్లితెరపైకి వచ్చిన చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రభావాన్ని చూపించిన షోనే బిగ్ బాస్. అంతేకాదు, ఇది దేశంలోనే ఏ కార్యక్రమానికీ దక్కని స్పందనను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అందుకే వరుసగా సీజన్లను కంప్లీట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో సీజన్‌ను ఉల్టా పుల్టాగా తీసుకు వచ్చి విజయవంతంగా నడిపారు. ఇప్పుడు ఈ సీజన్ గ్రాండ్ ఫినాలేను జరుపుకుంటోంది. ఇందులో మొదటి ఎలిమినేషన్ తాజాగా జరిగిపోయింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలను మీరే చూసేయండి!

బిగ్ బాస్ ఏడో సీజన్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ఎంతో వైభవంగా జరుగుతోంది. ఇందులో ముందుగా మాజీ కంటెస్టెంట్ల డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌లు చూపించారు. ఆ తర్వాత వాళ్లందరితో హోస్ట్ నాగార్జున మాట్లాడారు. బిగ్ బాస్ షో నుంచి బయటకు వెళ్లిపోయిన తర్వాత వాళ్ల లైఫ్ ఎలా ఉందో అందరూ చెప్పుకొచ్చారు. అనంతరం ఫైనలిస్టులు కూడా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు.

Bigg Boss Telugu 7 Finale: Ambati Arjun Eliminated and Nagarjuna Gives Special Gift To Him

బిగ్ బాస్ ఏడో సీజన్‌లో ఫినాలేలో 'బబుల్‌గమ్' మూవీని ప్రమోట్ చేయడం కోసం తన కొడుకు రోషన్‌ కనకాలతో కలిసి యాంకర్ సుమ స్టేజ్ మీదకు ఎంట్రీ ఇచ్చింది. ముందుగా ఆ సినిమా ట్రైలర్‌ను బిగ్ స్క్రీన్ మీద ప్రసారం చేశారు. ఆ తర్వాత ఆరుగురు కంటెస్టెంట్లలో ఒకరిని ఎలిమినేట్ చేసేందుకు సుమను హోస్ట్ నాగార్జున హౌస్‌ లోపలకు పంపించాడు.

భయం భయంగానే హౌస్‌ లోపలికి వెళ్లిన యాంకర్ సుమ ఎలిమినేట్ చేయడం తన వల్ల కాదని చెప్పింది. దీంతో షో చరిత్రలోనే తొలిసారి ఆమె ఓ చిట్టి రోబోను యాక్టివిటీ ఏరియా నుంచి పిలిచింది. అది వచ్చిన తర్వాత హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లలో ఎవరి వైపు చూసి మెషీన్ గన్‌ను ఫైర్ చేస్తుందో వాళ్లు ఎలిమినేట్ అవుతారని చెప్పారు. అది చాలా సేపు సస్పెన్స్‌లో ఉంచి అర్జున్ వైపు ఫైర్ చేసేసింది.

రోబో చూపించడంతో అంబటి అర్జున్ షో నుంచి ఎలిమినేట్ అయ్యాడని హోస్ట్ అక్కినేని నాగార్జున ప్రకటించాడు. ఆ తర్వాత సుమ అతడిని స్టేజ్ మీదకు తీసుకుని వచ్చింది. అప్పుడు అర్జున్ కోరిక మేరకు అతడి భార్యను కూడా స్టేజ్ మీదకు పిలిచిన నాగార్జున.. వాళ్లతో ఓ ఫొటో తీసుకున్నాడు. అనంతరం అర్జున్ ఎమోషనల్ అవుతూ మాట్లాడాడు.

ఎలిమినేషన్ అయిన తర్వాత అంబటి అర్జున్ 'సార్.. లోపల ఉన్నప్పుడు అంతా బాగానే ఉంది కానీ.. తన గురించి లోలోపల చాలా బాధేసింది' అని చెప్పాడు. అనంతరం వాళ్లిద్దరూ కలిసి తమకు పుట్టబోయే బిడ్డ పేరును ప్రకటించారు. అప్పుడు అర్జున్ 'సార్ మా బిడ్డకు 'ఆర్కా' అనే పేరు పెడదాం అనుకున్నాం. అది మా ఇద్దరి పేరుతో వస్తుంది' అని ప్రకటించాడు.

హోస్ట్ అక్కినేని నాగార్జున ఆ తర్వాత మాజీ కంటెస్టెంట్లు అందరికీ కొన్ని గిఫ్టులను అందించాడు. అందులో అంబటి అర్జున్‌కు స్పెషల్‌గా డిజైన్ చేసిన ఓ టీషర్ట్‌ను బహుమతిగా ఇచ్చాడు. దాని మీద అర్జున్‌ దంపతులకు పుట్టబోయే బిడ్డ స్కానింగ్‌ను ఫొటోగా వేశారు. మొత్తానికి ఎలిమినేట్ అయినా అర్జున్‌ను మాత్రం నాగార్జున ఫుల్ హ్యాపీనే చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X