Bigg Boss Telugu 7 Finale: ఫినాలేలో ఫస్ట్ ఎలిమినేషన్ లీక్.. 6వ స్థానంతో ఆ కంటెస్టెంట్ ఔట్
ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చినా.. తెలుగు బుల్లితెరపై తీవ్ర స్థాయిలో ప్రభావాన్ని చూపిస్తూ.. సుదీర్ఘ కాలంగా నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. దీంతో నిర్వహకులు ప్రతి ఏడాది ఒక సీజన్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఇప్పుడు ఏడో దాన్ని ఉల్టా పుల్టా అనే కాన్సెప్టుతో తీసుకు వచ్చారు. పదిహేను వారాల పాటు ప్రేక్షకులను అలరించిన ఇది.. ఇప్పుడు ఫినాలే స్టేజ్‌కు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఈ సీజన్ నుంచి ఓ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యారు. ఇంతకీ ఎవరు వెళ్లిపోయారు? ఆ పూర్తి వివరాలను మీరే చూసేయండి మరి!
భారీ అంచనాల నడుమ మొదలైన బిగ్ బాస్ ఏడో సీజన్ ఉల్టా పుల్టా కాన్సెప్టుతో రసవత్తరంగా సాగింది. అందుకు తగ్గట్లుగానే చాలా మంది కంటెస్టెంట్లు మంచి ఆటతీరుతో మెప్పించారు. ఇలా ఈ సీజన్‌లోకి వచ్చిన మొత్తం 19 మంది కంటెస్టెంట్లలో ప్రియాంక జైన్, అమర్‌దీప్ చౌదరి, శివాజి, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్, అర్జున్‌లు ఫినాలేలోకి అడుగు పెట్టి టైటిల్ రేసులో ఉన్నారు.

బిగ్ బాస్ ఏడో సీజన్‌లో ఇప్పుడు ఆరుగురు కంటెస్టెంట్లు మాత్రమే మిగిలారు. వీరి నుంచి ఒకరు మాత్రమే విన్నర్ అవబోతున్నారు. దీంతో ప్రేక్షకులంతా తమకు నచ్చిన కంటెస్టెంట్లను గెలిపించేందుకు విపరీతంగా ప్రచారం చేస్తూ ఓట్లు కూడా వేశారు. దీంతో గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా ఓటింగ్ జరుగుతుందని తెలిసింది. ఇప్పుడు రిజల్ట్ కోసం అంతా ఆసక్తిగా ఉన్నారు.

పదిహేను వారాల పాటు ప్రేక్షకులకు వినోదాన్ని అందించిన బిగ్ బాస్ ఏడో సీజన్ ఆఖరి అంకానికి చేరుకుంది. దీనికి సంబంధించిన గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ డిసెంబర్ 17వ తేదీ ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి ప్రసారం కాబోతుంది. ఇప్పటికే షూటింగ్ కూడా ప్రారంభం అయింది. శుక్రవారం ఈ సీజన్‌లోని మాజీ కంటెస్టెంట్ల డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌లను చిత్రీకరించారు.
బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే కోసం ఎప్పుడో ఏర్పాట్లు కంప్లీట్ అయిపోయాయి. ఇప్పటికే డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌లు పూర్తి అవగా.. ఇప్పుడు అసలైన ఎపిసోడ్‌లోని ముఖ్యమైన అంశాలను షూట్ చేస్తున్నారు. ఇప్పటికే గ్రాండ్ ఫినాలే షూట్ చాలా వరకూ కూడా పూర్తి అయింది. ఓటింగ్‌లో చివరి మూడు స్థానాల్లో నిలిచిన ముగ్గురు కంటెస్టెంట్లను ఈరోజే ఎలిమినేట్ చేయబోతున్నారు.

ముందుగా చెప్పుకున్నట్లుగానే బిగ్ బాస్ ఏడో సీజన్ గ్రాండ్ ఫినాలేలో మొదటి ఎలిమినేషన్ జరిగిపోయింది. ఇందులో అంబటి అర్జున్ బయటకు వచ్చేసినట్లు తాజాగా న్యూస్ లీకైంది. తద్వారా ఈ సీజన్‌లో అతడు ఆరో స్థానంతోనే సరిపెట్టుకున్నట్లు అయింది. ఇదిలా ఉండగా.. అర్జున్ వైల్డ్ కార్డు ద్వారా ఐదో వారంలో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











