Bigg Boss Telugu 7 చరిత్ర సృష్టించిన బిగ్‌బాస్ తెలుగు షో..ఉల్టాపుల్టా రేటింగ్..నాగార్జున ఆల్‌టైమ్ రికార్డ్
ఇండియాలోనే బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు మరోసారి రికార్డు సృష్టించింది. గత మూడు నెలలుగా తెలుగు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని, వివాదాలను పంచిన ఈ షో దేశంలోనే అత్యధిక రేటింగ్‌ను సాధించిన షోగా ఘనతను సాధించింది. అయితే డిసెంబర్ 17న అట్టహాసంగా జరిగిన బిగ్‌బాస్ తెలుగు 7 ఫినాలే టాప్ రేటింగ్‌ను సాధించింది. ఫినాలేకు ఏ రేంజ్ రేటింగ్ సాధించింది? అనే వివరాల్లోకి వెళితే..
ఉల్టాపుల్టా కాన్సెప్ట్‌తో బిగ్‌బాస్ తెలుగు 7 షోను ఎండెమాల్ షైన్ ఇండియా నిర్వాహకులు విభిన్నంగా ప్లాన్ చేశారు. నిర్వాహకులు ప్లాన్‌కు అనుగుణంగానే కంటెస్టెంట్లు కూడా ఉల్టాపుల్టాగా వ్యవహరించారు. దాంతో ఇంటిలో జరిగిన గొడవలు, గ్రూపిజం కారణంగా క్రియేట్ అయిన కంటెంట్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచింది.

ఇక తాజా సీజన్ చూస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా బిగ్‌బాస్ తెలుగు షోలో బలంగా కంటెస్టెంట్లు కనిపించారు. పల్లవి ప్రశాంత్, శివాజీ, యావర్, అమర్ దీప్, శోభాశెట్టి, ప్రియాంక జైన్, అంబటి అర్జున్ లాంటి టాప్ కంటెస్టెంట్లు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యారు. దాంతో ఈ షోకు ప్రతీవారం భారీ రేటింగ్ నమోదు అయింది.
ఇంటిలో శివాజీ, ప్రశాంత్, యావర్ కలిసి స్పై గ్రూప్‌గా, శోభాశెట్టి, ప్రియాంక జైన్, అమర్ దీప్ కలిసి స్పా గ్రూప్‌గా ఏర్పడటంతో ప్రేక్షకులు కూడా గ్రూపులుగా ఏర్పడ్డారు. దీనికి తోడు భారీగా పీఆర్ ప్రమోషన్స్ జరగడం, సోషల్ మీడియాలో ట్రోల్స్, డిబేట్స్ సాగడంతో ఈ సినిమాపై భారీగా ప్రభావం చూపించింది.

గత 6 సీజన్లలో ఎన్నడూ లేని విధంగా పోటాపోటీగా సాగిన బిగ్‌బాస్ తెలుగు 7లో విజేతగా పల్లవి ప్రశాంత్ నిలిచిన విషయం తెలిసిందే. కామన్ మ్యాన్‌గా తొలి రోజు నుంచి పల్లవి ప్రశాంత్ తనదైన శైలిలో ఆటను కొనసాగించడంతో రూరల్, అర్బన్ అనే తేడా లేకుండా షోకు భారీగా ఓటింగ్ నమోదు కావడంతోపాటు రేటింగ్ కూడా ఆటోమేటిక్‌గా పెరిగింది.
ఇక డిసెంబర్ 3వ వారాంతంలో జరిగిన బిగ్‌బాస్ తెలుగు 7 ఫినాలేకు భారీ రేటింగ్ నమోదైంది. అంగరంగ వైభవంగా మూడు గంటలకుపైగా సుదీర్ఘంగా సాగిన మారథాన్ షోకు భారీ రేటింగ్ నమోదైంది.కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన షో ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది అని స్టార్ మా అధికారికంగా ప్రకటించింది.

అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్‌బాస్ తెలుగు 7 షో రికార్డు క్రియేట్ చేసింది. మొదటి రోజు నుంచి బ్రేకింగ్ రికార్డులతో సంచలనం రేపింది. కింగ్ హోస్ట్ చేసిన బిగ్‌బాస్ తెలుగు ఫినాలే ఆల్ టైమ్ హయ్యెస్ట్ టెలివిజన్ వ్యూయింగ్ రేటింగ్ (TVR) 21.7 రేటింగ్ నమోదైంది అని ఓ ప్రకటనలో వెల్లడించారు.


Click it and Unblock the Notifications











