Bigg Boss Telugu 7 Finale Live బిగ్‌బాస్ విజేత పల్లవి ప్రశాంత్.. నీవల్లే అంటూ వేదికపై నుంచే..

బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ షో గ్రాండ్ ఫినాలే రంజుగా సాగుతున్నది. మంచి రొమాంటిక్ సాంగ్‌‌తో వేదికపైకి వచ్చిన నాగార్జున ఫుల్ ఫన్‌తో షోను కొనసాగించారు. ఇంటిలోకి వచ్చిన ఎలిమినేటెడ్ కంటెస్టెంట్లతో మాట్లాడుతూ ఫన్ క్రియేట్ చేశారు. ఫినాలేలో జరిగిన ముఖ్యమైన విషయాలు మీ కోసం..

OG మూవీలో ఆఫర్

బిగ్‌బాస్ తెలుగు 7 ఫినాలే సందర్భంగా ఈ సీజన్ కంటెస్టెంట్లతో నాగార్జున మాట్లాడారు. శుభశ్రీ మాట్లాడుతూ.. బిగ్‌బాస్ షోలో పాల్గొన్న తర్వాత నా లైఫ్ మారిపోయింది. పవన్ కల్యాణ్, సుజిత్ కాంబినేషన్‌లో వస్తున్న OG మూవీలో నాకు అవకాశం ఇచ్చారు. నాకు చాలా హ్యాపీగా ఉంది అని అన్నారు.

Bigg Boss Telugu 7 Finale live: Who is the Bigg Boss Telugu Winner?

వచ్చే జన్మలో నాగార్జునకు భార్యగా

ఇక అశ్వినీ మాట్లాడుతూ.. మీరు గురించి ఒక మాట చెప్పడానికి భయమేసింది. కానీ ఇప్పుడు చెప్పాలని అనుకొంటున్నాను. మీరు చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నారు. మరో జన్మ ఉంటే మీరు నాకు భర్తగా కావాలని కోరుకొంటాను. మీరు దొరకడం అమలకు నిజంగా లక్కీ. మీరు చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నారు అని అశ్వినీ అంటే.. ఈ జన్మకు అమలతోనే చాలూ.. అని నాగ్ అన్నారు.

జోర్ణించుకోలేకపోతున్నా: శోభాశెట్టి

బిగ్‌బాస్ నుంచి బయటకు వెళ్లడం ఇంకా జీర్ణించుకోలేపోతున్నాను. ఆ బాధ నుంచి నేను బయటకు రాలేకపోతున్నాను అని శోభాశెట్టి అన్నారు. వేదికపైన శోభాశెట్టి కొంత అసంతృప్తితో కనిపించింది.

భోలే అంటే హీరో.. హీరో అంటే భోలే

భోలే మాట్లాడుతూ.. బిగ్‌బాస్ నాకు మంచి లైఫ్‌ను ఇచ్చారు. బయటకు వచ్చిన తర్వాత రెండు పాటలు చేశాను. శుభశ్రీతో కలిసి ఓ పాట చేశాను. ఇంటిలో ఉన్నప్పుడు శ్రీలీల గురించి పాడిన పాటనే మ్యూజిక్ ఆల్బమ్‌గా మలిచాను. భోలే అంటే హీరో అని అంటున్నారు అంటూ కొన్ని పాటలు పాడి వినిపించారు.

Bigg Boss Telugu 7 Finale live: Who is the Bigg Boss Telugu Winner?

ఇంటిలో ఇష్టమైన ప్లేస్ ఏమిటంటే?

బిగ్‌బాస్ ఇంటిలో ఉన్న ఆరుగురు కంటెస్టెంట్లతో ఫన్ గేమ్స్ ఆడించారు. అనంతరం ఇంటిలోనే ఫేవరేట్ ప్లేస్‌ ఏమిటో అడిగి తెలుసుకొన్నారు. ఒక్కొక్కరు తమకు నచ్చిన ప్లేస్‌ను చెప్పారు. పల్లవి ప్రశాంత్ మాత్రం నాగార్జున ఇచ్చిన మిర్చి మొక్క ఉన్న ప్రదేశం అని చెప్పారు. శివాజీ జోయ్ అలుకాస్ గది ఇష్టమని చెప్పారు.

బిగ్‌బాస్ ట్రోఫి ఆవిష్కరణ

ఆ తర్వాత ఆరుగురు కంటెస్టెంట్లకు ట్రోఫిని చూపించారు. గ్రాండ్‌గా బిగ్ బాస్ ట్రోఫిని ఆవిష్కరించారు. ఇన్నాళ్లు వేచి చూసిన శ్రమకు ఇదే మీ లక్ష్యం. మీలో ఒకరు మాత్రమే ఈ ట్రోఫిని అందుకొంటారు అని నాగార్జున చెప్పారు.

Bigg Boss Telugu 7 Finale live: Who is the Bigg Boss Telugu Winner?

అంబటి అర్జున్ ఎలిమినేషన్

బిగ్‌‌బాస్ తెలుగు 7 ఇంటిలోని 6 గురు టాప్ కంటెస్టెంట్ల నుంచి తొలి కంటెస్టెంట్‌గా అంబటి అర్జున్ ఎలిమినేట్ అయ్యారు. దాంతో ట్రోఫి కోసం ప్రియాంక, శివాజీ, యావర్, ప్రశాంత్ పల్లవి, అమర్ దీప్ మిగిలారు.

ఈగిల్‌తో రవితేజ

బిగ్‌బాస్ ఇంటి వేదికపైకి మాస్ మహారాజా రవితేజ వచ్చారు. ఇలా బిగ్‌బాస్‌లోకి రావడం ఇది రెండోసారి. వేదికపైన నుంచి ఈగిల్ టీజర్‌ను ఆవిష్కరించారు. అయితే టాప్ 5 కంటెస్టెంట్స్ నుంచి ఒకరి ఎలిమినేట్ చేయడానికి ముందు.. రవితేజ సినిమా ఆఫర్ ఇస్తే బయటకు వస్తావా? అంటూ నాగార్జున చెబితే.. మరోమారు ఆలోచించకుండా వెంటనే గేట్స్ వద్దకు పరిగెత్తాడు. అయితే మళ్లీ వెనుకకు పిలిపించారు.

Bigg Boss Telugu 7 Finale live: Who is the Bigg Boss Telugu Winner?

ప్రియాంక ఎలిమినేషన్

అయితే బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్ నుంచి ఐదో కంటెస్టెంట్‌గా ప్రియాంక జైన్ ఎలిమినేట్ అయ్యారు. రవితేజ చేతులు మీదుగా ఎలిమినేషన్‌ను నిర్వహించారు. అలా హౌస్‌లో ప్రియాంక జర్నీ ముగిసింది. ఇంటి నుంచి నేరుగా వేదికపైకి వచ్చారు.

Bigg Boss Telugu 7 Finale live: Who is the Bigg Boss Telugu Winner?

యావర్ సెల్ఫ్ ఎలిమినేషన్

ఆ తర్వాత నాగార్జున నటించిన నా సామిరంగ సినిమా ప్రమోషన్స్ కోసం అషికా రంగనాథ్, అల్లరి నరేష్, రాజ్ తరుణ్, దర్శకుడు విజయ్ వేదికపైకి వచ్చారు. అల్లరి నరేష్, రాజ్ తరుణ్‌ను ఇంటిలోకి సూట్‌కేస్‌లోకి పంపారు. 15 లక్షలు ఆఫర్ చేయగా.. తన సోదరులు చెప్పిన మాటలు విని యావర్ సెల్ఫ్ ఎలిమినేషన్‌తో బయటకు వచ్చారు.

Bigg Boss Telugu 7 Finale live: Who is the Bigg Boss Telugu Winner?

శివాజీ షాకింగ్ ఎలిమినేషన్

బిగ్‌బాస్ తెలుగు 7 ఎలిమినేషన్‌లో శివాజీ ఎలిమినేషన్ షాకింగ్ అని చెప్పవచ్చు. దాదాపు టైటిల్ ఆయనదే అనుకొన్నవారికి టాప్ 3 కంటెస్టెంట్‌గా బయటకు రావడం కొంత దిగ్బ్రాంతికి గురిచేసింది. మైడ్ గేమ్‌తో ఆటను రక్తి కట్టించిన ఆయన టైటిల్ పోటీలో రెండెడుగుల దూరంలో ఆగిపోవడం ఆయన అభిమానులకు షాకింగ్‌గా మారింది.

నాగార్జునకు షాకిచ్చిన బిగ్‌బాస్

శివాజీ ఎలిమినేషన్ తర్వాత ఇంటిలో పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ ఇంటిలో మిగిలారు. వారిని వేదికపైకి తీసుకొచ్చేందుకు నాగార్జున ఇంటిలోకి వెళ్లారు. ఇంటిలో కొన్ని ప్రదేశాల్లో తిరుగుతూ వారిని బయటకు తీసుకొచ్చారు. విజేతను ప్రకటించడానికి సిద్దమవుతుండగా.. మీ జర్నీ చూడండి అంటూ నాగ్‌కు బిగ్‌బాస్ షాకిచ్చాడు. దాంతో నా జర్నీ చూస్తే నేను ఎలిమినేట్ అయినట్టా? అని నాగ్ అడిగితే సమాధానం రాలేదు. దాంతో నేను ఏమీ అడిగినా సమాధానం చెప్పడు. తనకు ఇష్టం ఉంటే తప్పా మాట్లాడడు అని నాగ్ అన్నాడు.

ఎమోషనల్‌గా జర్నీని చూసిన నాగ్

ఆతర్వాత సీజన్ 7లో తన జర్నీని చూశాడు. స్క్రీన్ ప్లే తన ప్రయాణాన్ని చూస్తూ నాగార్జున ఎమోషనల్ అయ్యారు. నవ్వుతూ, తీక్షణంగా చూస్తూ ఎంజాయ్ చేశాడు. ఆతర్వాత బిగ్‌బాస్ తెలుగు 7 విన్నర్ ఎవరు అనే ఉత్కంఠకు తెరలేపేందుకు రెడీ అయ్యారు.

Bigg Boss Telugu 7 Winner

బిగ్‌బాస్ తెలుగు 7 విజేత పల్లవి ప్రశాంత్

తన జర్నీ అనంతరం వేదికపైన ఉన్న పల్లవి ప్రశాంత్, అమర్ దీప్‌ చేతులను తన చేతిలోకి తీసుకొని కిందకు పైకి లేపుతూ చివరకు అమర్ దీప్ చేతిని వదిలేశాడు. ప్రశాంత్ చేతిని పైకెత్తి.. రైతుబిడ్డ బిగ్ బాస్ తెలుగు 7 విజేత అంటూ ప్రకటించారు. దాంతో ప్రశాంత్, ఆయన తల్లిదండ్రులు, కంటెస్టెంట్లందరూ సంతోషంలో మునిగిపోాయారు. వేదికపైన ఉన్న ప్రశాంత్.. తనకు అండగా నిలిచిన శివాజీని చూస్తూ.. నీవల్లే అంటూ సైగలు చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X