Bigg Boss Telugu 7 Finale: బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌కు నాగార్జున అవార్డులు.. ఎవరికి ఏం ఇచ్చారో తెలుసా?

బిగ్ బాస్ తెలుగు 7 గ్రాండ్ ఫినాలే ముగిసింది. సెప్టెంబర్ 3న ప్రారంభం అయిన ఈ షో.. షాక్ లు, ట్విస్టులు మధ్య మొదటి నుంచి ఆసక్తిగా సాగింది. ఇక ఈ సీజన్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్ నిలువగా.. అమర్ దీప్ రన్నరప్ గా నిలిచాడు. అయితే ఈ సీజన్ గ్రాండ్ ఫినాలేలో ఆరుగురు ఫైనల్ కంటెస్టెంట్స్ తో పాటు.. పాత కంటెస్టెంట్స్ కూడా వచ్చారు. ఇక నాగార్జున పాత కంటెస్టెంట్స్ కు అవార్డులు ఇచ్చాడు. ఎవరికి ఏ అవార్డు వచ్చిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బిగ్ బాస్ తెలుగు 7 సెప్టెంబర్ 3న ప్రారంభం అయింది. ఆ రోజన గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ షో.. ఎట్టేకలకు 105 రోజుల తర్వాత గ్రాండ్ ఫినాలేతో ముగిసింది. ఇక ఈ ఫినాలేలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అంతా పాల్గొన్నారు. ఆరుగురు ఫైనల్ కంటెస్టెంట్స్ తో పాటు.. హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయిన వారంతా ఈ షోలో పాల్గొని సందడి చేశారు. అంతే కాదు.. డాన్స్ ఫెర్మెమెన్స్ లు కూడా ఇచ్చారు.

Bigg Boss Telugu 7 Finale: Nagarjuna awards to contestants.. who knows what? Full Details Here

ఇక బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేలో పాత కంటెస్టెంట్స్.. షకీలా, కిరణ్ రాథోడ్ తప్ప.. హౌస్ లోకి అందరూ కంటెస్టెంట్స్ వచ్చారు. ఇక వారు ఏం చేస్తున్నారు.. వారికి ఎలాంటి ఆఫర్లు వచ్చాయి అని చెప్పుకువచ్చారు. ఒక్కొక్కరు ఒక్కో ఫెర్మెమెన్స్ ఇస్తూ.. ప్రేక్షకులను అలరించారు. నాగార్జునతో కలిసి సందడి చేశారు. ఇక ఆరుగురు ఫైనాలిస్టులుగా పల్లవి ప్రశాంత్, అర్జున్, ప్రియాంక, శివాజీ, యావర్ నిలిచిన సంగతి తెలిసిందే.

ఇక నాగార్జున పాత కంటెస్టెంట్స్ కోసం అవార్డులు ఇచ్చారు. నాగార్జున పిడకలు అవార్డు దామినికి ఇచ్చాడు. ఇక ఇన్‌ స్టంట్ న్యూడిల్స్ నయని పావనికి ఇవ్వగా... వాటర్ బాటిల్ - పూజామూర్తికి ఇచ్చాడు. రెడ్ లిప్‌ స్టిక్ - శుభశ్రీకి ఇచ్చిన నాగార్జున లిప్ స్టిక్ పై ఆట సందీప్ ఫన్నీగా స్పందించాడు. ఇక ఉడుత - రతిక అంటూ ఆమెకు ఉడుత బహుమతిని అందించారు.

ఇక సంచాలక్ ఆఫ్ సీజన్ - సందీప్ మాస్టర్ కి అవార్డు దక్కగా... గోల్డెన్ మైక్ - భోలె షావళికి ఇచ్చాడు నాగ్. టిష్యూ - అశ్వినికి ఇవ్వగా.. డంబెల్ - గౌతమ్ కృష్ణ అందుకున్నాడు. చివరగా.. ఫైర్ బ్రాండ్ - శోభాశెట్టికి దక్కింది. ఇక ఈ సీజన్ లో వారు చేసిన అల్లరి, సందడిని బట్టి వారికి ఏవి సూట్ అవుతాయో వాటిని అవార్డులుగా నాగార్జున అందించాడు. ఇక ఇలాంటి అవార్డుల కార్యక్రమం ఏ సీజన్ లో జరగలేదని తెలుస్తోంది.

ఇక ఈ సీజన్ ఎట్టేకేలకు ముగిసింది. బిగ్ బాస్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్ నిలిచాడు. ఇక టాప్2లో రన్నరప్ గా అమర్ దీప్ నిలిచాడు. విన్నర్ కు రూ. 35 లక్షల చెక్ ను ప్రైజ్ మనీని అందజేశారు. అనంతరం బ్రీజా కారు, సుమారు 15 లక్షల జోయాలుకాస్ చెక్ సైతం అందజేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X