Bigg Boss Telugu 7: గ్రాండ్ ఫినాలేలో బిగ్ ట్విస్ట్.. ఈరోజే ఆ ముగ్గురు కంటెస్టెంట్లు ఎలిమినేట్
బుల్లితెరపైకి ఎన్నో షోలు వస్తున్నాయి. కానీ, అందులో ఒకటి రెండు మాత్రమే చరిత్రను సృష్టించేవిగా మారుతున్నాయి. అలాంటి వాటిలో రియాలిటీ ఆధారంగా నడుస్తోన్న బిగ్ బాస్ ఒకటి. హిందీలో చాలా ఏళ్ల క్రితమే మొదలైన ఇది.. ఆ తర్వాత చాలా భాషల్లోకి వచ్చింది.
ఈ క్రమంలోనే ఏడేళ్ల క్రితమే తెలుగులోకి వచ్చి సంచలనం సృష్టించింది. దీంతో క్రమం తప్పకుండా సీజన్లను ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఇప్పుడు ఏడో దాన్ని కంప్లీట్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సీజన్ గ్రాండ్ ఫినాలేలోని ట్విస్టు బయటకు వచ్చింది. అదేంటో మీరే చూసేయండి మరి!

టైటిల్ బరిలో ఆరుగురు: బిగ్ బాస్ ఏడో సీజన్ ఉల్టా పుల్టా కాన్సెప్టుతో ఎంతో రసవత్తరంగా సాగింది. మొదటి నుంచీ పెట్టుకున్న అంచనాలను తారుమారు చేస్తూ ఎంతో మంది చక్కని ఆటతీరుతో మెప్పించారు. ఇలా ఈ సీజన్‌లోకి వచ్చిన మొత్తం 19 మంది కంటెస్టెంట్లలో ప్రియాంక జైన్, అమర్‌దీప్ చౌదరి, శివాజి, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్, అర్జున్‌లు ఫినాలేలోకి అడుగు పెట్టి టైటిల్ బరిలో నిలిచారు.
ఓటింగ్ ప్రక్రియ కంప్లీట్: సాధారణంగా ఏ బిగ్ బాస్ సీజన్‌లో అయినా విజేతను నిర్ణయించే ఫినాలే ఓటింగ్ చివరి వారంలోనే జరుగుతుంది. కానీ, ఉల్టా పుల్టా సీజన్ కావడంతో ఏడో దానిలో మాత్రం ఈ ఓటింగ్ 14వ వారంలోనే ప్రారంభం అయింది. అప్పటి నుంచి కంటెస్టెంట్లకు ఓట్లు భారీగా పోల్ అవుతూనే ఉన్నాయి. ఇలా గత శుక్రవారం రాత్రికి ఈ పోలింగ్ ప్రక్రియ పూర్తైన విషయం తెలిసిందే.
ఫుల్ ఓటింగ్.. ట్విస్టులు: బిగ్ బాస్ ఏడో సీజన్‌లో ఇప్పుడు ఆరుగురు కంటెస్టెంట్లు మాత్రమే మిగిలారు. అందులో ఒకరు మాత్రమే విజేతగా నిలవబోతున్నారు. దీంతో ప్రేక్షకులంతా తమకు నచ్చిన కంటెస్టెంట్లను గెలిపించేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. దీంతో గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా ఓటింగ్ జరుగుతుందని తెలిసింది. ఫలితంగా విజేత ఎవరన్న దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది.
ఫినాలేకు రంగం సిద్ధం: 15 వారాల పాటు ప్రేక్షకులకు మజాను పంచిన బిగ్ బాస్ ఏడో సీజన్ చివరి అంకానికి చేరుకుంది. దీనికి సంబంధించిన గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ డిసెంబర్ 17వ తేదీ ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి ప్రసారం కాబోతుంది. ఇప్పటికే షూటింగ్ కూడా ప్రారంభం అయింది. శుక్రవారం ఈ సీజన్‌లోని మాజీ కంటెస్టెంట్ల డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌లను షూట్ చేశారు.

వాళ్లిద్దరిలో ఒకరు విన్: బిగ్ బాస్ ఏడో సీజన్‌లో శివాజి, ప్రియాంక జైన్, పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ చౌదరి, ప్రిన్స్ యావర్, అంబటి అర్జున్‌లు టైటిల్ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఇందులో పల్లవి ప్రశాంత్ లేదా శివాజిలలో ఒకరు విజయం సాధించే అవకాశం ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే, అమర్‌దీప్ చౌదరి మూడో స్థానంలో నిలిచే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి.

అసలైన షూట్‌కు రెడీ: బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌లు కంప్లీట్ అవగా.. ఇప్పుడు అసలైన ఎపిసోడ్‌లోని ముఖ్యమైన అంశాలను షూట్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి శనివారం చిత్రీకరణ జరగనుంది. ఇందులోనే పలువురు సినీ సెలెబ్రిటీలు కూడా హాజరు కాబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఈరోజు ముగ్గురు ఔట్: ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న ఆరుగురు ఫైనలిస్టులలో చివరి స్థానాల్లో ఉన్న ముగ్గురు సభ్యులను శనివారం జరిగే ఎపిసోడ్‌లోనే ఎలిమినేట్ చేయబోతున్నారని తాజాగా న్యూస్ లీకైంది. ఇందులో ప్రియాంక జైన్, అంబటి అర్జున్, ప్రిన్స్ యావర్‌లు ఎలిమినేట్ అయ్యే చాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఈరోజు అప్‌డేట్స్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











