Bigg Boss Telugu Finale: ప్రియాంక సెన్సేషనల్ రికార్డు.. రెమ్యూనరేషన్‌లో టాప్.. ఎంత సంపాదించిందంటే!

బిగ్ బాస్... బుల్లితెర ప్రియులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా ఈ కార్యక్రమం ఇండియా వ్యాప్తంగా ప్రభావాన్ని చూపిస్తోంది. ముఖ్యంగా తెలుగులో ఈ షో రికార్డు స్థాయిలో రేటింగ్‌తో దూసుకుపోతోంది. దీంతో నిర్వహకులు వరుసగా సీజన్లను తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో దాన్ని ఉల్టా పుల్టా అనే కాన్సెప్టుతో నడిపారు. ఇది ప్రేక్షఖులకు మజాను అందించి ముగింపు దశకు వచ్చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఇందులో ఫైనలిస్టుగా ఉన్న ప్రియాంక జైన్ రెమ్యూనరేషన్ వివరాలు లీక్ అయ్యాయి. అది మీరే చూసేయండి మరి!

ఎంతో గ్రాండ్‌గా ఫినాలే:ఉల్టా పుల్టా కాన్సెప్టుతో మొదలై 105 రోజుల పాటు తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని అందించిన బిగ్ బాస్ ఏడో సీజన్ ముగింపు దశకు చేరుకుంది. దీంతో ఇప్పుడు ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌ను ఎంతో వైభవంగా జరుగుతోంది. ఇది ఈ సీజన్‌లో మాజీ కంటెస్టెంట్ల ఆటపాటలతో ప్రారంభం అయింది. అప్పటి నుంచి ఎంతో సందడిగా సాగుతూ మజాను అందిస్తోంది.

Bigg Boss Telugu 7 Finale: Priyanka Jain Bigg Boss Season 7 Remuneration Details

విన్నర్ ఆ ఇద్దరిలోనే:బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి మొత్తంగా 19 మంది కంటెస్టెంట్లు వచ్చారు. వీరిలో 14 వారాలకు 13 మంది ఎలిమినేట్ అయిపోయారు. దీంతో అంబటి అర్జున్, ప్రియాంక జైన్, ప్రిన్స్ యావర్, ప్రియాంక జైన్, పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ చౌదరిలు ఫైనలిస్టులుగా నిలిచారు. వీరిలో ప్రశాంత్ లేదా అమర్‌దీప్‌లో ఒకరు విజయం సాధించే అవకాశం ఉందన్న విషయం తెలిసిందే.

రవితేజ చేతిలో ఔట్:బిగ్ బాస్ ఏడో సీజన్‌ గ్రాండ్ ఫినాలేలో భాగంగా ముందుగా అంబటి అర్జున్ ఎలిమినేట్ అయ్యాడు. ఆ తర్వాత 'ఈగల్' ప్రమోషన్ కోసం రవితేజ ఎంట్రీ ఇచ్చాడు. హోస్ట్ నాగార్జున టాప్ 5లో ఉన్న మరొకరిని ఎలిమినేట్ చేయమని అడిగాడు. దీంతో ఓ పౌడర్ చల్లడంతో ప్రియాంక ముఖం కనిపించింది. దీంతో ఆమె షో నుంచి ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించాడు.

Bigg Boss Telugu 7 Finale: Priyanka Jain Bigg Boss Season 7 Remuneration Details

ప్రియాంకకు భారీగానే:బిగ్ బాస్ హౌస్‌లోకి భారీ అంచనాలతో వచ్చి అందుకు తగ్గట్లుగానే సత్తా చాటిన ప్రియాంక జైన్ 15 వారంలో ఎలిమినేట్ అయింది. దీంతో ఆమెకు బిగ్ బాస్ నిర్వహకులు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారన్న దానిపై అప్పుడే పలు రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ప్రియాంక జైన్ ఒక్కో వారానికి రూ. 2.50 లక్షలు రెమ్యూనరేషన్‌గా తీసుకుందని తెలిసింది.

మొత్తం అన్ని లక్షలా:బిగ్ బాస్ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం.. ప్రియాంక జైన్ బిగ్ బాస్ ఏడో సీజన్ కోసం రోజుకు రూ. 35 వేలకు పైగానే చార్జ్ చేసినట్లు తెలిసింది. అలా ఆమె ఒక్క వారానికి గానూ రూ. 2.50 లక్షలు రెమ్యూనరేషన్‌గా అందుకుందని సమాచారం. ఇక, 15 వారాల పాటు ఉన్న ప్రియాంక జైన్ మొత్తంగా రూ. 37.50 లక్షలు రెమ్యూనరేషన్‌గా తీసుకుందని టాక్ వినిపిస్తోంది.

ఈ సీజన్‌లోనే రికార్డు:బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి చాలా మంది లేడీస్ వచ్చారు. అయితే, వారిలో కొందరు మాత్రమే ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకున్నారు. వాళ్లు అందరి కంటే చివరి వరకూ ఉన్న ప్రియాంక జైన్‌కే ఎక్కువ మొత్తం ఖాతాలోకి వచ్చింది. అంటే ఈ సీజన్‌లో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న లేడీ కంటెస్టెంట్‌గా ప్రియాంక జైన్ రికార్డును సొంతం చేసుకుందని చెప్పుకోవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X