Bigg Boss Telugu 7 Finale: ఫినాలేలో సెకండ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి టాప్ 5 కంటెస్టెంట్ ఔట్!
100 రోజులుగా బుల్లితెర ఆడియెన్స్‌ను అలరిస్తోన్న బిగ్ బాస్ రియాలిటీ షోకి రేపటితో ముగింపు పడనుంది. ఈ సెలబ్రిటీ గేమ్ షోకు ఆదివారం సాయంత్రం 7 గంటలకు శుభం కార్డు పడనుంది. డిసెంబర్ 17న జరిగే ఈ గ్రాండ్ ఫినాలేలో బిగ్ బాస్ ఏడో సీజన్ టైటిల్ విజేత ఎవరు అనేది క్లారిటీగా తేలనుంది. ప్రస్తుతం టాప్ 6 కంటెస్టెంట్స్ ఫినాలేకి చేరుకోగా.. అర్జున్ అంబటి ఎలిమినేట్ అవ్వగా.. తాజాగా మరో కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బిగ్ బాస్ తెలుగు 7 సెప్టెంబర్ 3న ప్రారంభం అయి.. ఉల్టా పుల్టా అంటూ సాగింది. ఇక హౌస్ లో మొత్తంగా 19మంది కంటెస్టెంట్స్ ఎంటర్ అవ్వగా... ప్రస్తుతం ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరు ఫైనాలిస్టుగా బిగ్ బాస్ ఫైనల్ చేశాడు. ప్రియాంక, అర్జున్ అంబటి, అమర్ దీప్, యావర్, ప్రశాంత్, శివాజీ హౌస్ లో ఉన్నారు. వీరి జర్నీ వీడియోలు కూడా బిగ్ బాస్ భారీ రేంజులో ఎలివేషన్ ఇస్తూ ప్రజెంట్ చేశాడు.

అయితే తాజా సమాచారం మేరకు ఆ టాప్ 6 కంటెస్టెంట్స్ నుంచి అర్జున్ అంబటి ఎలిమినేట్ ఇంతకు ముందే ఎలిమినేట్ అయ్యారు. ఆయన్నీ డైరెక్టుగా ఎలిమినేట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక అర్జున్ అంబటి తర్వాత మిగిలిన ఐదుగురు కంటెస్టెంట్స్ మరొక కంటెస్టెంట్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. అది ఎవరో కాదు.. బీబీ వంటలక్క ప్రియాంక జైన్. ఈ బ్యూటీ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయినట్లు తాజా సమాచారం.
ప్రియాంక జైన్.. మొదటి నుంచి తన దైన శైలిలో ఆటను ఆడుతూ ఆడియెన్స్ ను మెప్పించింది. బిగ్ బాస్ షో ప్రారంభం అయిన రోజు.. మొదటి కంటెస్టెంట్ గా హౌస్ లో అడుగుపెట్టింది. అప్పటి వరకు జానకీ కలగనలేదు, మౌనరాగం అనే సీరియల్స్ తో బుల్లితెర ఆడియెన్స్ ను మెప్పించిన ఈ బ్యూటీ.. హౌస్ లోకి అడుగుపెట్టింది. అప్పటి వరకు అమాయకంగా సీరియల్స్ లో మెప్పించిన ప్రియాంక.. బిగ్ బాస్ ఇంట్లో శివంగిలా ఆటను ఆడింది.
టాప్ 6 ఫైనాలిస్టు కంటెస్టెంట్స్ లో ప్రియాంక జైన్ ఒకరు. ఇప్పుడు ఈ బ్యూటీ టాప్ 5 స్థానాన్ని కైవసం చేసుకుంది. బిగ్ బాస్ తెలుగు 7 గ్రాండ్ ఫినాలేకి రవితేజ గెస్టుగా వచ్చారట. ఆయన ఈగల్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ ఇంట్లో సందడి చేశారు. ఈ సందర్భంగా రవితేజ ప్రియాంకను ఎలిమినేట్ చేసినట్లు తెలుస్తోంది.

ఇక ప్రియాంకజైన్ బిగ్ బాస్ టాప్ 5 కంటెస్టెంట్స్ ఐదో స్థానాన్ని కొట్టేసింది. ఈ బిగ్ బాస్ తర్వాత ఆమెకు స్టార్ మా టీవీలో మంచి సీరియల్ ఆఫర్ ఉందని టాక్. ఆ సీరియల్ లో మెయిన్ లీడ్ లో ప్రియాంక నటించనుందట. ఈ సీరియల్ కోసమే ఆమెను బిగ్ బాస్ టాప్ 5లో పెట్టారని టాక్ వచ్చింది. ఈసారి సీజన్ 7లో ఫీమెల్ కంటెస్టెంట్స్ లో ప్రియాంక బంపర్ ఆఫర్ కొట్టేసిందనే చెప్పాలి. చూడాలి ఏం జరగనుందో..!


Click it and Unblock the Notifications











