Bigg Boss Telugu 7 Finale శివాజీపై రివర్స్ టెక్నాలజీ.. పంచ్‌తో అదరగొట్టిన నాగార్జున
బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ షో ఫినాలే గ్రాండ్‌గా డిజైన్ చేశారు. 100 రోజులకుపైగా సాగిన రియాలిటి షో ఎన్నో అనుభూతులు, మెమోరీస్ అటు కంటెస్టెంట్లకు, ప్రేక్షకులకు అందించింది. గ్రాండ్ ఫినాలే సందర్భంగా వేదికపైకి వచ్చిన హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్లు, వారి ఇంటి సభ్యులతో మాట్లాడారు. శివాజీ కొడుకులిద్దరితో మాట్లాడగా కెన్ని, రిక్కి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. దానికి అదిరిపోయేలా నాగ్ ఇచ్చిన కౌంటర్ ఏంటంటే?
బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటి షోలో శివాజీ తనదైన ఆటతో ఆకట్టుకొన్నారు. ఇంటిలో సీనియర్‌గా ఇంటి సభ్యులతో పరిణితి ప్రదర్శించారు. యువకులను సరదైన దారిలో నడిపిస్తూ సలహాలు ఇస్తూ ఆటను రంజింప చేశారు. ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ఆటను ముందుకు తీసుకెళ్లాడు.

ఇక టైటిల్ రేసులో ఉన్న తండ్రి గురించి కొడుకులిద్దరూ మాట్లాడుతూ.. ఇటీవల నేను అమెరికాకు వెళ్లిపోతున్నానని బెంగ పెట్టుకొన్నారు. ప్రియాంక అక్కతో వాడితో కొన్ని రోజులు గడిపితే బాగుండని అనుకొన్నారు. అందుకే నేను కొన్ని వారాలు అమెరికా ప్రయాణం వాయిదా వేసుకొన్నాను అని శివాజీ పెద్ద కొడుకు తెలిపారు.
ఇక శివాజీ చిన్న కొడుకు మాట్లాడుతూ.. బిగ్‌బాస్ ఆఫర్ వచ్చిన విషయాన్ని ముందుగా నాకే చెప్పారు. అయితే ఇంటిలో అందరూ నాన్నను బిగ్‌బాస్‌కు వెళ్లొద్దని చెప్పారు. కానీ నేను మాత్రమే వెళ్లమని చెప్పాను. అయితే ముందుగా నేను వెళ్లమని చెబితే.. వినడని.. బిగ్‌బాస్ షోలో ఆడటం నీ వల్ల కాదు అని రెచ్చగొట్టాను. దాన్ని ఛాలెంజ్‌గా తీసుకొని నాన్న గారు షోలోకి వెళ్లడానికి నిర్ణయం తీసుకొన్నారు అని చెప్పాడు.

శివాజీ చిన్న కొడుకు చెబుతుండగా.. అయితే మీ నాన్నను షోలోకి పంపడానికి రివర్స్ టెక్నాలజీ ఉపయోగించావు. రివర్స్‌గా మాట్లాడి ఉండకపోతే మీనాన్న వచ్చేవాడు కాదేమో అని నాగార్జున పంచ్ ఇచ్చారు. ఈ షోను నాగార్జున తనదైన శైలిలో ఫినాలేను నడిపిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











