శివాజి రెమ్యూనరేషన్ అన్ని లక్షలా: విన్నర్ కంటే ఎక్కువ జాక్‌పాట్.. షో వల్ల ఎంత సంపాదించాడంటే!

ఇండియాలోని చాలా భాషల్లో ప్రసారం అవుతున్నా.. తెలుగులో మాత్రమే భారీ స్థాయిలో రెస్పాన్స్‌ను అందుకుని నెంబర్ వన్ రియాలిటీ షోగా హవాను చూపిస్తోంది బిగ్ బాస్. అందుకే ఏకధాటిగా సీజన్లను జరుపుకుంటూ ముందుకు సాగుతోంది. ఇలా ఇప్పుడే నిర్వహకులు ఏడో దాన్ని ఉల్టా పుల్టా కాన్సెప్టుతో ప్రసారం చేస్తున్నారు. దీనికి ఎవరూ ఊహించని రీతిలో స్పందన వచ్చింది. ఫలితంగా ఈరోజు జరిగే ఫినాలేతో సీజన్‌ను ముగించనుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇందులో ఫైనలిస్టుగా ఉన్న శివాజి రెమ్యూనరేషన్ వివరాలు లీక్ అయ్యాయి. అవేంటో మీరే చూసేయండి!

ఉల్టా పుల్టా సీజన్ ఫినాలే : బిగ్ బాస్ షో ఎప్పుడు వచ్చినా తెలుగులో సూపర్ డూపర్ సక్సెస్ అవుతుంది. అందుకు అనుగుణంగానే ఇప్పుడు ఉల్లా పుల్టా కాన్సెప్టుతో నడుస్తోన్న ఏడో సీజన్ మరింత విజయవంతంగా ప్రదర్శితం అవుతోంది. ఇలా పదిహేను వారాల పాటు ప్రేక్షకులకు వినోదాన్ని పంచిన ఈ సీజన్ నేడు (డిసెంబర్ 17) జరిగే గ్రాండ్ ఫినాలేతో ముగియనున్న విషయం తెలిసిందే.

Bigg Boss Telugu 7 Finale: Sivaji Bigg Boss Season 7 Remuneration Details Leaked

మహేశ్ చేతుల మీదుగా : బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి మొత్తంగా 19 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. వీరిలో 14 వారాలకు 13 మంది ఎలిమినేట్ అయిపోయారు. దీంతో అంబటి అర్జున్, ప్రియాంక జైన్, ప్రిన్స్ యావర్, శివాజి, పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ చౌదరిలు ఫైనలిస్టులుగా నిలిచారు. వీరిలో ఒక్కరు మాత్రమే విజయం సాధించబోతున్నారు. ఆ విన్నర్‌కు మహేశ్ బాబు ట్రోఫీని అందించబోతున్నాడు.

నలుగురు ఎలిమినేషన్ : బిగ్ బాస్ ఏడో సీజన్‌ గ్రాండ్ ఫినాలేకు సంబంధించిన షూటింగ్ శనివారమే చాలా వరకూ జరిగింది. ఇందులో ఏకంగా నలుగురు కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేశారు. వీరిలో ముందుగా అంబటి అర్జున్ ఆరో స్థానంతో బిగ్ బాస్ హౌస్‌ను వీడాడు. ఆ తర్వాత స్థానాల్లో నిలిచిన ప్రియాంక జైన్, ప్రిన్స్ యావర్ (15 లక్షలు తీసుకున్నాడు), శివాజీలు కూడా ఎలిమినేట్ అయిపోయారు.

Bigg Boss Telugu 7 Finale: Sivaji Bigg Boss Season 7 Remuneration Details Leaked

విన్నర్ అనుకుంటే 3నే : బిగ్ బాస్ ఏడో సీజన్‌లో ఎక్కువగా షాకింగ్ ఎలిమినేషన్స్ కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈ సీజన్‌లో విజేతగా నిలుస్తాడని భావించిన శివాజి కూడా గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌లో ఎలిమినేట్ అయిపోయాడు. వాస్తవానికి అతడు రన్నరప్‌గా అయినా నిలుస్తాడని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని ఇప్పటికే బయటకు వచ్చేశాడు. ఇది ఆదివారం ప్రసారం కాబోతుంది.

శివాజి రెమ్యూనరేషన్ లీక్ : బిగ్ బాస్ హౌస్‌లోకి భారీ అంచనాలతో వచ్చి అందుకు తగ్గట్లుగానే సత్తా చాటిన శివాజి 15 వారంలో ఎలిమినేట్ అయ్యాడు. దీంతో అతడికి బిగ్ బాస్ నిర్వహకులు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారన్న దానిపై అప్పుడే పలు రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. శివాజి ఒక్కో వారానికి రూ. 4.25 లక్షలు రెమ్యూనరేషన్‌గా తీసుకున్నాడని తెలిసింది.

Bigg Boss Telugu 7 Finale: Sivaji Bigg Boss Season 7 Remuneration Details Leaked

అన్ని లక్షలతో జాక్‌పాట్ : బిగ్ బాస్ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం.. శివాజి బిగ్ బాస్ ఏడో సీజన్ కోసం రోజుకు రూ. 60 వేలకు పైగానే వారానికి రూ. 4.25 లక్షలు చార్జ్ చేశాడట. అలా 15 వారాల పాటు ఉన్న శివాజి మొత్తంగా రూ. 63.75 లక్షలు రెమ్యూనరేషన్‌గా తీసుకున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ సీజన్‌లోని కంటెస్టెంట్లు అందరితో పోల్చుకుంటే ఇదే ఎక్కువ మొత్తం అని తెలిసింది.

విన్నర్ కంటే ఎక్కువగా : బిగ్ బాస్ ఏడో సీజన్‌లో విన్నర్‌కు రూ. 50 లక్షలు ప్రకటించారు. కానీ, యావర్ రూ. 15 లక్షలు తీసుకోవడంతో ఇప్పుడు రూ. 35 లక్షలే రాబోతున్నాయి. దీనికితోడు రూ. 15 లక్షలు గోల్డ్, రూ. 12 లక్షలు విలువైన కార్ రాబోతున్నాయి. వీటితో కలిపి విజేతకు రూ. 62 లక్షలు ప్రైజ్‌మనీగా వస్తున్నాయి. కానీ, శివాజి మాత్రం రూ. 63.75 లక్షలు అందుకుని జాక్‌పాట్ కొట్టాడని చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X