Bigg Boss Telugu 7 Finale: శివాజిని ఎలిమినేట్ చేసిన డెవిల్.. కాళ్లు పట్టుకుని మరీ ఏడుస్తూ!

బుల్లితెర చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ప్రేక్షకుల మద్దతును కూడగట్టుకోవడంతో పాటు దేశంలోనే టాప్ రేటింగ్‌తో సత్తా చాటింది బిగ్ బాస్. చాలా భాషల్లో వస్తున్నా తెలుగులోనే ఇది భారీ స్పందనను అందుకుంటోంది. అందుకే నిర్వహకులు వరుసగా సీజన్లను పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే మూడు నెలల క్రితమే ఏడో సీజన్‌ను ప్రారంభించారు. ఉల్టా పుల్టా కాన్సెప్టుతో నడిచిన ఈ సీజన్ నేటి గ్రాండ్ ఫినాలేతో ముగియనుంది. ఈ నేపథ్యంలో తాజాగా దీని నుంచి శివాజి ఎలిమినేట్ అయిపోయాడు. ఆ సంగతులేంటో మీరే చూసేయండి!

ఉల్టా పుల్టా ఏడో సీజన్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ఎంతో వైభవంగా జరుగుతోంది. ఇందులో ముందుగా మాజీ కంటెస్టెంట్ల డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌లు చూపించారు. ఆ తర్వాత వాళ్లందరితో హోస్ట్ నాగార్జున మాట్లాడారు. అనంతరం కొందరు సెలెబ్రిటీలు వచ్చి ఇందులో సందడి చేసేశారు. ఈ క్రమంలోనే ఒక్కొక్కరిని వరుసగా షో నుంచి ఎలిమినేట్ చేస్తూ బయటకు పంపుతున్నారు.

Bigg Boss Telugu 7 Finale: Sivaji Eliminated from The Show.. Prashanth Gets Emotional

బిగ్ బాస్ ఏడో సీజన్ గ్రాండ్ ఫినాలేలోకి ఆరుగురు కంటెస్టెంట్లు ఫైనలిస్టుగా వచ్చారు. అందులో మొదటి రౌండ్‌లో అంబటి అర్జున్ ఎలిమినేట్ అయ్యాడు. ఆ తర్వాత ప్రియాంక జైన్ బయటకు వచ్చింది. వీళ్లిద్దరి తర్వాత ప్రిన్స్ యావర్ రూ. 15 లక్షలు తీసుకుని పోటీ నుంచి తప్పుకున్నాడు. వీళ్లు ముగ్గురు ఎలిమినేట్ అవడంతో శివాజి, ప్రశాంత్, అమర్‌దీప్ పోటీలో ఉన్నారు.

బిగ్ బాస్ ఏడో సీజన్ గ్రాండ్ ఫినాలేలో తమ సినిమా 'డెవిల్‌'ను ప్రమోట్ చేయడం కోసం నందమూరి కల్యాణ్ రామ్, హీరోయిన్ సంయుక్త మీనన్‌తో కలిసి వచ్చాడు. హోస్ట్ నాగార్జున టాప్ 3లో ఉన్న మరొకరిని ఎలిమినేట్ చేయమని అడిగాడు. దీంతో కల్యాణ్ రామ్ మూడు స్పెషల్ చైర్లలో వాళ్లను కూర్చోబెట్టి.. రెడ్ లైట్ వచ్చిన కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతాడని చెప్పాడు.

కల్యాణ్ రామ్ సెటప్ చేసిన దాని ప్రకారం అమర్‌దీప్ చౌదరి, పల్లవి ప్రశాంత్, శివాజిలలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్న దానిపై సస్పెన్స్ మెయింటైన్ చేశారు. ఆ తర్వాత కాసేపటికి ఇందులో శివాజి ఎలిమినేట్ అయ్యాడు. ఈ విషయాన్ని హోస్ట్ నాగార్జున ప్రకటించాడు. దీంతో అతడు అందరి కంటే ముందుగానే ఆ చైర్‌లో నుంచి లేచి వెళ్లిపోయాడు.

శివాజి ఎలిమినేషన్‌ తర్వాత బయటకు వెళ్లే ముందు పల్లవి ప్రశాంత్ అతడి కాళ్లు పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చేశాడు. శివాజి ఎంత ఆపినా కూడా రైతు బిడ్డ కంట్రోల్ చేసుకోలేకపోయాడు. మొత్తానికి శివాజి స్టేజ్ మీదకు వచ్చిన తర్వాత కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఆ సమయంలో అతడి చిన్న కొడుకు రిక్కీ కూడా వచ్చి శివాజిని పట్టుకుని ఏడ్చేశాడు. ఇదంతా ఎంతో ఎమోషనల్‌గా సాగింది.

అనంతరం పై చదువుల కోసం ఫారెన్ వెళ్తున్న శివాజి కొడుకుకు హోస్ట్ నాగార్జున ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఆ తర్వాత ఏడుస్తున్న చిన్న కొడుకు రిక్కీని కూడా ఆయన ఓదార్చాడు. అనంతరం శివాజి తన కొడుకులను తీసుకుని వెళ్లిపోయాడు. అతడికి ప్రిన్స్ యావర్, నయనీ పావని గ్రాండ్ వెల్‌కం చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X