Bigg Boss 7 Telugu Finale: అర్జున్ భార్యకు యావర్ ఐ లవ్ యూ... నీ కోసమే గెలిచా అంటూ..!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గ్రాండ్ ఫినాలే అంగరంగ వైభవంగా ప్రారంభం అయింది. ఇక నాగార్జున స్టైలిష్ ఎంట్రీ తర్వాత పాత కంటెస్టెంట్స్ పాటలతో ఎంట్రీ ఇచ్చారు. ఇక బిగ్ బాస్ ఇంట్లో 6 మంది ఫైనల్ కంటెస్టెంట్స్ ఉన్నారు. అయితే ఇదంతా బాగానే ఉండగా... యావర్.. అర్జున్ అంబటి భార్య సురేఖ(పప్పీ)కు ఐ లవ్ యూ చెప్పాడు. ఐ లవ్ యూ పప్పీ అంటూ చెప్పుకువచ్చాడు. ఇంతకీ యావర్ అర్జున్ భార్యకు ప్రపోజల్ పెట్టాడు అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బిగ్ బాస్ తెలుగు 7 గ్రాండ్ ఫినాలే వైభవంగా సాగుతోంది. ఇక ఈ సీజన్ ఉల్టా పుల్టా అంటూ 105 రోజులు ఆసక్తిగా సాగింది. ఇక ఈ సీజన్ లో 19 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టారు. ఇక ఆరుగురు ఫైనాలిస్టులుగా మిగిలారు. వారిలో అర్జున్ అంబటి, ప్రియాంక జైన్, యావర్, పల్లవి ప్రశాంత్, శివాజీ, అమర్ దీప్ ప్రస్తుతం హౌస్ లో ఫైనాలిస్టుగా ఉన్నారు.

ఇక గ్రాండ్ ఫినాలే స్టార్ అవ్వగానే నాగార్జున.. హౌస్ లోని ఆరుగురు ఫైనాలిస్టులకు ఓ ఫన్నీ టాస్క్ ఇచ్చాడు. ఆరుగురు ఫైనల్ కంటెస్టెంట్స్ లో యావర్ విన్ అయితే ఎలా బిహేవ్ చేస్తాడు అని శివాజీని అడిగాడు. ఇక శివాజీ.. యావర్ లాగా నటించి అదరగొట్టాడు. ఇక ఆ తర్వాత ప్రియాంక.. అమర్ దీప్ లాగా.. అర్జున్ అంబటి - శివాజీ లాగా, ఇక యావర్.. అర్జున్ అంబటిలా నటించారు.
అందులో భాగంగానే.. యావర్.. అర్జున్ లాగా మాట్లాడుతూ... జనాలు థ్యాంక్యూ సో మచ్. మీరు నాకు సపోర్ట్ ఇచ్చారు. థ్యాంక్యూ సో మచ్ బిగ్ బాస్, నాగ్ సార్ అని చెప్తాడు. ఇక నాగార్జున.. అర్జున్ భార్య పప్పీ మీ అభిప్రాయం ఏంటి అని అడుగుతాడు. ఆమె ఇంకా బాగా చెయొచ్చు సార్ అని చెప్తుంది. దీంతో యావర్ రెచ్చిపోయి పప్పీ ఐ లవ్ యూ పప్పీ అంటాడు. చూశావా నేను విన్ అయ్యాను.. నీ కోసమే అంటూ చెప్తాడు.

ఇక పప్పీ కూడా ఇప్పుడు అర్జున్ లా వచ్చిందని చెప్తుంది. ఇక హౌస్ మేట్స్, నాగార్జునతో సహా అందరిలో నవ్వులు పూస్తాయి. ఇక ప్రియాంకలాగా... ప్రశాంత్ యాక్ట్ చేస్తాడు. ప్రశాంత్ మాట్లాడిన మాటలకు అందరూ నవ్వుతారు. ఇక అమర్ దీప్.. ప్రశాంత్ లాగా స్పీచ్ ఇస్తాడు. బాపూ గెలిచినాను బాపూ అంటూ నవ్వులు పూయిస్తాడు అమర్ దీప్. మళ్లీ వచ్చినాను అంటే తగ్గేదేలే అంటూ చెప్తాడు అమర్దీప్.
ఇక హౌస్ నుంచి అర్జున్ అంబటి ఎలిమినేట్ అయ్యాడు. ఈ షోకు గెస్టుగా వచ్చిన సుమ అర్జున్ అంబటిని ఎలిమినేట్ చేస్తుంది. ఇక అర్జున్ అంబటి సురేఖ స్టేజ్ మీదకు వచ్చి నాగార్జునను కలుస్తారు. ఆయనతో కలిసి ఫోటో దిగి మాట్లాడుతాడు. ఇక సురేఖకు పుట్టబోయే బిడ్డ పేరు అర్కా పెట్టబోతున్నట్లు వెల్లడించారు.


Click it and Unblock the Notifications











