Bigg Boss Telugu 7: SPY బ్యాచ్‌లో చిచ్చు పెట్టి వెళ్లిన గౌతమ్... శివాజీని కొట్టి పైకి రా అంటూ సంచలన కామెంట్స్

బిగ్ బాస్ తెలుగు 7 ఇక మరో రెండు వారాల్లో ముగియనుంది. ఇక బిగ్ బాస్ లవర్స్.. ఈ సీజన్ అయిపోతుందని బాధపడుతున్నారు. ఇక ఆ విషయం పక్కన పెడితే.. నిన్న బిగ్ బాస్ హౌస్ నుంచి గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక పోతు పోతూ.. గౌతమ్ స్పై బ్యాచ్ లో పెద్ద చిచ్చు పెట్టి పోయాడు. ప్రశాంత్ కు షాకింగ్ అడ్వాజ్ ఇచ్చాడు. ఇప్పుడు గౌతమ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బిగ్ బాస్ తెలుగు 7 ఆసక్తిగా సాగుతోంది. ఇక ఈ సీజన్ గత సీజన్స్ కంటే భిన్నంగా ఉల్టా పుల్టాగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సీజన్ లో 19మంది ఎంటర్ అవ్వగా.. ఇప్పటి వరకు 12మంది ఎలిమినేట్ అయ్యారు. నిన్నటి ఎపిసోడ్ గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక హౌస్ లో ఉన్నది కేవలం 7మంది కంటెస్టెంట్స్ మాత్రమే.

Bigg Boss Telugu 7 Gautham Krishna Comments on House Mates Viral Full Details Here

హౌస్ లో ప్రస్తుతం శివాజీ, యావర్, ప్రశాంత్, అమర్ దీప్, ప్రియాంక జైన్, శోభా శెట్టి ఉన్నారు. ఇక గౌతమ్ ఎలిమినేట్ అవుతూ.. గౌతమ్ కృష్ణ స్పై బ్యాచ్ లో పెద్ద చిచ్చు పెట్టి వెళ్లారు. ఇక హౌస్ లో స్పై, స్పా బ్యాచ్ లు ఉన్న సంగతి తెలిసిందే. స్పై అనంగా శివాజీ, ప్రశాంత్, యావర్ కాగా.. స్పా బ్యా అనగా శోభా శెట్టి, ప్రియాంక జైన్, అమర్ దీప్ ఉన్నారు.

ఇక బిగ్‌ బాస్‌ హౌస్‌ నుంచి బయటకు వెళ్లేటప్పుడు హౌస్‌లో ఎవరికి మాస్క్‌ ఉంది... ఎవరికి మాస్క్‌ లేదనేది చెప్పాలని గౌతమ్‌ ను నాగార్జున అడిగాడు. ఈ క్రమంలో హౌస్ మేట్స్ గురించి గౌతమ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. యావర్‌ గురించి మాట్లాడుతూ... బాగా ఆడు. నీకు మాస్క్‌ లేదని చెప్పాడు. ఇక ప్రశాంత్‌ గురించి మాట్లాడుతూ.. నువ్వు శివాజీ అన్నను కొట్టి నువ్వు పైకి రావాలని అడ్వైజ్ ఇచ్చాడు.

శోభాశెట్టి గురించి గేమ్‌ పై పోకస్‌ చేయి... అప్పుడప్పుడు మాస్క్‌ వస్తుందని చెప్పాడు. ఇక శివాజీ గురించి మాట్లాడుతూ.. మీకు చిన్న మాస్క్‌ ఉందని అన్నాడు. అర్జున్‌ గురించి మాస్క్‌ లేదని చెప్పాడు. అమర్‌ గురించి మాట్లాడుతూ.. మాస్క్‌ వచ్చి పోతుంటుంది. ఫన్నీగా ఉండని సూచించాడు. ప్రియాంక గురించి నో మాస్క్‌ అని చెప్పాడు. ప్రియాంకను ఫైనల్‌లో చూడాలి అంటూ చెప్పాడు.

అయితే, ప్రశాంత్‌ తో శివాజీ అన్నను కొట్టి నువ్వు పైకి రావాలని చెప్పడం పై విమర్శలు వస్తున్నాయి. దీనితో స్పై బ్యాచ్ లో చిచ్చు పెట్టి వెళ్లాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇక బిగ్‌ బాస్‌ సీజన్‌-7 ఫైనల్‌ విజేత రూ.50 లక్షలు, ఒక బ్రెజా కారు, రూ.15 లక్షల విలువైన ఆభరణాలు గెలుపొందుతారని నాగార్జున ప్రకటించాడు. చూడాలి మరి ఎవరు విజేత కానున్నారో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X