BiggBoss Telugu 7 Finale Voting టైటిల్‌కు అడుగు దూరంలో టాప్ కంటెస్టెంట్.. 2, 3 స్థానాల్లో ఎవరంటే?
బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ షో ముగింపుకు కొద్ది రోజులే ఉంది. ఆదివారం డిసెంబర్ 17వ తేదీన జరిగే గ్రాండ్ ఫినాలేకు అంతా సిద్దమవుతున్నారు. ఇక శోభాశెట్టి చివరి ఎలిమినేషన్ తర్వాత ఇంటిలో టాప్ 6 కంటెస్టెంట్లు టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో లేటేస్ట్ సీజన్ విజేత ఎవరనే విషయం అందరిలోను ఆసక్తిని రేపుతున్నది. టైటిల్ విజేత ఎవరనే నిర్ధారించే ఓటింగ్ వివరాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్ గత సీజన్లతో పోల్చితే భిన్నంగా సాగింది. కంటెస్టెంట్ల పోరాట పటిమ, విజేతను కావాలనే పట్టుదలతో ఆడిన టాస్క్‌లు ప్రేక్షకులను ఈ షోకు మరింత కనెక్ట్ చేశాయి. ఇక ఉల్టాపుల్టా అంటూ సరికొత్త అనుభూతిని పంచే ప్రయత్నించిన తీరు మరింత ఆకట్టుకొన్నది. అలా 14వ వారాల గేమ్ ప్రేక్షకులకు ఫిదా చేసింది.

ఇక బిగ్‌బాస్ తెలుగు 7 టైటిల్‌కు మొత్తం ఆరుగురు అర్హత సాధించారు. అందులో శివాజీ, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్, అంబటి అర్జున్, అమర్ దీప్, ప్రియాంక జైన్ టైటిల్‌పై కన్నేశారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ షోకు భారీగా ఎవరూ ఊహించని ఓటింగ్ నమోదు అవుతున్నది.
అయితే గతంలో ఏ సీజన్‌లోని లేని విధంగా తమ అభిమాన కంటెస్టెంట్లను గెలిపించేకొనేందుకు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికా, ఇతర దేశాల్లోని ప్రవాస భారతీయులు భారీగా ఓటింగ్‌లో పాల్గొంటున్నట్టు తెలిసింది. అమెరికాలో ఓ కంటెస్టెంట్ కోసం భారీగా ఖర్చు చేస్తూ పీఆర్ యాక్టివిటీని చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది.

అయితే బిగ్ బాస్ 7 షోలో గురించి ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సీజన్‌లో రెండు, మూడో స్థానం కోసం భారీగా పోటీ జరుగుతున్నది. గ్రాండ్ ఫినాలే ఓటింగ్‌లో శివాజీ మూడో స్థానానికి పడిపోయాడు. కానీ గత రెండు రోజుల్లో పుంజుకొని రెండోస్థానాన్ని పదిలం చేసుకొనే పనిలో పడ్డారు. ఇక మూడో స్థానం కోసం అమర్, యావర్ మధ్య తీవ్ర పోటీ నెలకొన్నట్టు తెలుస్తున్నది.

ఇక బిగ్‌బాస్ తెలుగు 7 టైటిల్ విజేతగా నిలిచేందుకు పల్లవి ప్రశాంత్ సిద్దమయ్యాడనేది తాజా ఓటింగ్‌ను బట్టి తెలుస్తున్నది. తాజా ఓటింగ్ ప్రకారం పల్లవి ప్రశాంత్ టైటిల్‌కు ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం పోలైన ఓట్లలో ఆయనకు 45 శాతం ఓట్లు పడినట్టు తెలుస్తున్నది. శివాజీ 25 శాతం ఓట్లు, అమర్, యావర్ 20 శాతం ఓట్లతో రేసులో ఉన్నారు. అంబటి అర్జున్ 15 శాతం, ప్రియాంక జైన్ 10 శాతం ఓట్లు సాధించినట్టు తెలుస్తున్నది.


Click it and Unblock the Notifications











