Bigg Boss Telugu 7 Finale Voting: ఉల్టా పుల్టా ఓటింగ్.. డేంజర్ జోన్‌లో టైటిల్ ఫేవరేట్.. విజేత ఎవరంటే!
బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ షో తుది దశకు చేరుకొన్నది. 14 వారాల్లోనే ఫినాలేకు ఓటింగ్ లైన్స్ ఓపెన్ చేసి ఈ షోను ఉల్టాపుల్టా అని ఎందుకు అంటున్నారనే విషయానికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఫినాలే ముందు ఇంటిలోని ప్రతీ కంటెస్టెంట్‌లోను విజేతగా నిలుస్తామనే కాన్ఫిడెన్స్ కనిపిసున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రారంభమైన గ్రాండ్ ఫినాలే ఓటింగ్ ఎలా సాగుతున్నదంటే?
బిగ్‌బాస్ తెలుగు 7 షో 14వ వారంలో కూడా పోటీపోటీగా కంటెస్టెంట్లు ఆడుతున్నారు. ప్రస్తుతం ఇంటిలో పల్లవి ప్రశాంత్, శివాజీ, అమర్ దీప్, ప్రిన్స్ యావర్, ప్రియాంక జైన్, శోభాశెట్టి, అంబటి అర్జున్ ఉన్నారు. ఈ వారం అంబటి అర్జున్ తప్పా మిగితా వారాంతా 14వ వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్స్‌లో ఉన్నారు.

అయితే ఫినాలేకు రెండు వారాలు ఉండగానే ఓటింగ్ లైన్స్ తెరిచారు. అయితే ఫినాలే ఓటింగ్‌తోపాటు 14వ వారం ఎలిమినేషన్స్ కోసం ఓటింగ్ ప్రారంభించారు. ఫినాలే టికెట్‌ను గెలుచుకొన్న అంబటి అర్జున్‌ను ఎలిమినేషన్ నుంచి తప్పించి.. ఫినాలే ఓటింగ్‌లో అర్హుడు అంటూ బిగ్‌బాస్ ట్విస్ట్ ఇచ్చారు.
అయితే గ్రాండ్ ఫినాలే ఓటింగ్ ప్రారంభం కాగానే భారీగా ఓట్లు నమోదు అవుతున్నాయి. ప్రైవేట్ సర్వేలు, బిగ్‌బాస్ ఓటింగ్ ప్రకారం.. పోటాపోటీగా తమ కంటెస్టెంట్లకు అభిమానులు ఓట్లు వేస్తున్నారనే విషయం ఓటింగ్ సరళిని బట్టి తెలుస్తున్నది. అయితే ఇప్పటి వరకు టైటిల్ రేసులో ముందున్న శివాజీ మాత్రం వెనుకబడినట్టు కనిపిస్తున్నది.

ఇక గత రెండు రోజులుగా మొదలైన బిగ్‌బాస్ తెలుగు 7 గ్రాండ్ ఫినాలే ఓటింగ్‌లో పల్లవి ప్రశాంత్ టాప్‌లో కొనసాగుతున్నారు. శివాజీ రెండో స్థానంలో కొనసాగుతున్నారు. ఆ తర్వాత అమర్ దీప్ మూడో స్థానంలో, ప్రిన్స్ యావర్ 4వ స్థానంలో ఉన్నారు. ఇక ప్రియాంక 5వ స్థానంలో, శోభ 6వ స్థానంలో, అంబటి అర్జున్ 7వ స్థానంలో నిలిచారనేది సర్వేలు తెలియజేస్తున్నాయి.

అయితే ఓటింగ్ వివరాల్లోకి వెళితే.. పల్లవి ప్రశాంత్‌కు దాదాపు 40 శాతం ఓట్లు రాగా, శివాజీకి 17 శాతం, అమర్ దీప్‌కు 15 శాతం, యావర్‌కు 14 శాతం ఓట్లు నమోదయ్యాయి. ప్రియాంక జైన్, శోభాశెట్టి, అర్జున్‌కు 5 శాతం ఓట్లు కూడా పోల్ కాకపోవడం గమనార్హం. ఇంకా ఫినాలేకు చాలా రోజులు ఉన్నది కాబట్టి.. ఫలితం అటు ఇటూ అయ్యే అవకాశాలు లేకపోలేదనే సుస్పష్టంగా కనిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











