Bigg Boss Telugu 7: అమర్‌దీప్ బర్త్ డే.. బిగ్‌బాస్‌ భారీ సర్‌ప్రైజ్ ప్లానింగ్.. ఇది కదా ఉల్టాపుల్టా!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 మొదటి నుంచి ఉల్టా పుల్టా అంటూ షాకులు, ట్విస్టులు ఇస్తునే ఉంది. ఇక హౌజులో ప్రస్తుతం 11 మంది మాత్రమే ఉన్నారు. ఇక ఇప్పటికే ఈ షో 60 రోజులు పూర్తి చేసుకుంది. ఇక షోను మరింత రక్తి కట్టించేందుకు బిగ్ బాస్ భారీ ట్విస్టును ప్లాన్ చేశాడు. అది కూడా కంటెస్టెంట్ గా ఉన్న అమర్ దీప్ బర్త్ డే సందర్భంగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఆ రోజున సెలబ్రేషన్స్ తో పాటు.. ట్విస్టులు, షాకులు ఉండబోతున్నాయి. అసలు అమర్ దీప్ బర్త్ డే సందర్భంగా బిగ్ బాస్ ఏం ప్లాన్ చేశాడు.. ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఉల్టా పుల్టా అంటూ మొదటి నుంచి నిర్వాహకులు చెప్పుకువచ్చారు. అందుకు తగ్గట్లుగానే ఈ ఆట కొనసాగుతోంది. డిఫరెంటు టాస్కులు, ఎలిమినేషన్ ఊహకు అందకుండా ఉంటుంది. ఇక ఐదో వారంలో ఇచ్చిన వైల్డ్ కార్డు ఎంట్రీస్ మాత్రం మరింత ఉల్టా పుల్టాగా అనిపించింది. ఇక ప్రస్తుతం హౌస్లో 11 మంది ఆటగాళ్లు ఉన్నారు. అందులో శివాజీ, యావర్, ప్రశాంత్, టేస్టీ తేజ, శోభా శెట్టి, గౌతమ్, బోలే షవాలి, అశ్విని శ్రీ, అమర్ దీప్, ప్రియాంక, రతికా రోజ్ ఉన్నారు.

Bigg Boss Telugu 7 has planned a big surprise for Amardeeps birthday on 8th November

ఇక అమర్ దీప్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సీరియల్స్ లో ఎంతో అమాయకంగా ఉండే అమర్ దీప్.. ఇక హౌస్ లోకి వెళ్లాక చాలా విచిత్రంగా ప్రవర్తించాడు. కొద్ది వారాల పాటు ఈయనపై నెగిటివిటీ వచ్చింది. ఇక ఎప్పుడైతే అర్జున్ అంబటి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చి నామినేట్ చేస్తూ చెప్పిన విషయాలు అమర్ తన తప్పులు తెలుసుకునేలా చేశాయి. ఇక ప్రతి వారం ఆయన ఆట తీరులో మార్పు వస్తుంది.

ఇక ఆఖరికి శివాజీ కూడా మెచ్చుకున్నాడు. ఎప్పుడు అమర్ దీప్ ను విమర్శించే శివాజీ... ఆటలో గెలిచావ్ సాధించావ్ అంటూ ప్రశంసలు ఇచ్చాడు. ఇక నవంబర్ 8వ తేదీన అమర్ దీప్ బర్త్డే. ఈ సందర్భంగా బిగ్ బాస్ భారీ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ ఇది కదా అసలైన ఉల్టా పుల్టా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అసలు బిగ్ బాస్ ప్లాన్ ఏంటంటే.. అమర్ దీప్ బర్త్ డే సందర్భంగా ఆయన పుట్టిన రోజులు వేడుకలు జరుపనుంది.

Bigg Boss Telugu 7 has planned a big surprise for Amardeeps birthday on 8th November

అంతే కాకుండా ఫ్యామిలీ మీట్ ఏర్పాటు చేయనున్నారట. ఇక ఫ్యామిలీతో పాటు.. పలువురు సెలబ్రేటీలు కూడా వచ్చి సపోర్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక అమర్ దీప్ కోసం... వాళ్ల వైఫ్ తేజును బిగ్ బాస్ హౌస్ లోకి పంపనున్నట్లు తెలుస్తోంది. అక్కడే సెలబ్రేషన్స్ కూడా జరగనుందట. ఇక అమర్ కోసం సపోర్ట్ చేయడానికి బ్రహ్మముడి సీరియల్ యాక్టర్ మానస్ రానున్నాడు. ఈయన బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్.

అర్జున్ అంబటి కోసం ఆయన భార్య సురేఖ, గౌతమ్ కోసం వాళ్ల బ్రదర్ జగదీశ్ లేదా ఫాదర్ రావొచ్చని అంటున్నారు. ప్రశాంత్ కోసం వాళ్ల బ్రదర్, శివాజీ కోసం.. చిన్న కొడుకు రిక్కి, యావర్ కోసం వాళ్ల బ్రదర్ వాసీమ్ రానున్నారని తెలుస్తోంది. ఈ లెక్కన ఫ్యామిలీ మెంబర్స్ ని పిలిస్తే.. కంటెస్టెంట్స్ ఇక ఎమోషనల్ అవుతారు. చూడాలి మరి బిగ్ బాస్ ఇంకా ఏం ప్లాన్ చేయనున్నాడో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X