Bigg Boss Telugu 7: బిగ్ బాస్ ఇంట్లోకి హీరో సిద్గార్థ్, స్టేజీపైకి మాస్ మహారాజ - జోరు మామూలుగా లేదుగా!
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ రియాల్టీ షో పై ప్రేక్షకుల్లో ఆసక్తి విపరీతంగా పెరిగిపోతుంది. ముఖ్యంగా ఈ సీజన్ లో ఉల్టా పుల్టాతో సరికొత్త రీతిలో రాబోతుండగా.. నేడు మరింత హైప్ క్రియేట్ అయింది. ఈరోజు ముగ్గురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవుతారంటూ ఓ వైపు వార్తలు జోరందుకోగా.. మరో ఐదుగురు కొత్త కంటెస్టెంట్లు ఇంట్లో అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అందుకే అంతా ఆరోజుటి ఎపిసోడ్ కోసం తెగ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈరోజు రిలీజ్ అవుతున్న ప్రోమోలు కూడా తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా విడుదల అయిన ప్రోమోలో.. బిగ్ బాస్ స్టేజీపై స్టార్ హీరోలు కనిపిస్తున్నారు.
ముందుగా హీరో సిద్దార్థ ఇంట్లోకి వెళ్లినట్లు చూపించారు. ఇంట్లోని కంటెస్టెంట్లు అందరూ హీరో సిద్ధార్థకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. తెగ ఎగ్జైట్ అయిపోతూ ఆనంద పడిపోయారు. ముఖ్యంగా ప్రియాంక అయితే గేట్ ఓపెన్ అయి సిద్దార్థ కనిపించగానే పరుగున వచ్చింది. అంతా తెగ సంబురపడిపోతూ సిద్దార్థతో ముచ్చటించారు. ఈక్రమంలోనే సిద్దార్థ్ కిస్ గేమ్.. కిస్ గేమ్ అంటూ చెప్పగా... టేస్టీ తేజ ముద్దులాట, ముద్దులాట అంటూ పాడాడు. ఇది చూస్తుంటే సిద్దార్థతో ఏదో ఫన్నీ టాస్క్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. చిన్నా సినిమా ప్రమోషన్ లో భాగంగానే సిద్దార్థ్ ఇంట్లోకి వచ్చినట్లు సమాచారం.

ఇక ఆ తర్వాత మాస్ మహారాజ రవితేజ స్టేజీపైకి ఎంట్రీ ఇవ్వడం.. అందరిలోనూ ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసింది. రవితేజ బిగ్ బాస్ స్టేజీ మీదకు రాగానే ప్రేక్షకులు ఓ రేంజ్ లో కేకలు పెట్టారు. అదిరిపోయే ఎంట్రీకి తోడు డ్యాన్స్ గర్ల్స్ సందడి మరింత జోష్ నింపింది. ఈ సాలిడ్ ఎపిసోడ్ లో రవితేజ బ్లాక్ టీషర్ట్ విత్ బ్లూ టోన్ జీన్స్ లో అదిరిపోయారు. ఆయన లుక్ తో పాటు ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ అందిరనీ తెగ అలరిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రోమో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఒక్క రవితేజనే కాదండోయ్ టైగర్ నాగేశ్వరరావు సినిమాలోని కథానాయికలు నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ కూడా బిగ్ బాస్ షోకు వచ్చారు. అక్కడే నాగార్జునతో కలిసి ఫొటోలు దిగారు. ఈ ఫొటోలు కూడా నెట్టింట వైరల్ గా మారాయి.

ఈసారి మొత్తం 14 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ ఇంట్లోకి అడుగు పెట్టగా.. ఇప్పటి నలుగుగు ఎలిమినేట్ అయిపోయారు. మొదటి వారం కిరణ్ రాథోడ్, రెండో వారం షకీలా, మూడో వారం సింగర్ దామిని, నాలుగో వారం రతిక రోజ్ ఇంటి నుంటి బయటకు వెళ్లిపోయారు. అయితే ఐదో వారం ముగ్గురు ఎలిమినేట్ కాబోతున్నారని సమాచారం. కానీ చూడాలి ఏం జరగనుందో. ప్రస్తుతం నామినేషన్లలో శివాజీ, ప్రియాంక, యావర్, గౌతమ్, శోభా శెట్టి, అమర్ దీప్, టేస్టీ తేజ ఉన్నారు. వీరిలో శివాజీకి ఎక్కువ ఓట్లు ఉన్నాయి. కాబట్టి శివాజీ ఎలిమినేట్ అయ్యే ఛాన్సే లేదు.
యావర్, అమర్ దీప్, గౌతమ్, ప్రియాంక, తేజ, శుభ శ్రీలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ముఖ్యంగా శుభ శ్రీ ఐదో వారం ఎలిమినేట్ అవుతున్నట్లు టాక్ నడుస్తోంది. ఇక ఈరోజుటి ఎపిసోడ్ డబుల్ ఎంటర్ టైన్ మెంట్ తో పాటు ఎగ్జైటింగ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండనున్నాయి.


Click it and Unblock the Notifications











