Bigg Boss Telugu 7: బిగ్ బాస్ స్టేజీపై భగవంత్ కేసరి టీం.. ఆ కంటెస్టెంట్ ను చూసి సిగ్గుపడిన శ్రీలీల
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ తెలుగు 7.. ఏ సీజన్ లోనూ లేని సరికొత్త ఆలోచనలతో ప్రేక్షకుల్ని తెగ అలరిస్తున్నారు. ముఖ్యంగా 2.0 మొదలయినప్పటి నుంచి షో మరింత రంజుగా సాగుతోంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ ఇంట్లోకి కంటెస్టెంట్లు వచ్చిన తర్వాత తొలి సండే ఇది. ఈక్రమంలోనే సన్ డే విత్ ఫన్ డేతో బిగ్ బాస్ కంటెస్టెంట్లతో మాట్లాడడం, అలరించడంతో పాటు ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించేందుకు రాబోతున్నారు నాగార్జున. అయితే ఈరోజు షోలో ఆయనతో పాటు భగవంత్ కేసరి మూవీం టీం కూడా కనిపించి సందడి చేయబోతున్నారు. ముఖ్యంగా క్యూట్ హీరోయిన్ శ్రీలీల, డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈరోజు తెగ కామెడీ చేయనున్నారు.
బిగ్ బాస్ తెలుగు 7 తాజా ప్రోమో చూస్తుంటే ఈ విషయం అర్థం అయిపోతుంది. అయితే ప్రోమోలో ముందుగా అనిల్ రావిపూడి కనిపించారు. ఈక్రమంలోనే కింగ్ నాగార్జున... బిగ్ బాస్ సీజన్ 7 చూస్తున్నావా, ఉల్టా పుల్టా సీజన్ ఎలా ఉందని అడిగారు. ఇందుకు అనిల్ రావిపూడి.. బిగ్ బాస్ అన్నింటిలోనూ ఈ సీజన్ చాలా బాగుందని అన్నాడు. సీజన్ సీజన్ కి టీఆర్పీ పెరుగుతుందని.. అలాగే మీ గ్లామర్ కూడా పెరుగుతుందంటూ నాగార్జునతో చెప్పాడు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న కంటెస్టెంట్ల అందరికీ గురించి తన అభిప్రాయాన్ని చెప్పాడు.

కాఫీ కాఫీ అంటూ బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి ఎక్కవ రచ్చ చేస్తున్న శివాజీ గురించి మాట్లాడుతూ... శివాజీ అన్నను రోజూ చూస్తున్నానంటూ అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత తేజ గురించి చెబుతూ వాడు నా జూనియర్ అని అన్నాడు. వెంటనే తేజ.. అనిల్ అన్న మా సీనియర్ అని చెప్పుకొచ్చాడు. మధ్యలో కల్గజేసుకున్న నాగార్జున ఈయన సీనియర్ అనగానే నీవు జూనియర్ అని చెప్పాల్సిందేనా అంటూ అడిగాడు. అందుకు టేస్టీ తేజ తల మొత్తం తిప్పేస్తూ అయ్యో అన్నా అంటాడు. ఇక ఆ తర్వాత శోభా శెట్టి క్రాకర్ అని చెబితే... నాగ్ ఏంటీ క్రాక్ హా అని అడుగుతాడు. దీనికి అంతా నవ్వగా.. సార్ అంటూ శోభా వయ్యారాలు పోతుంది.

అప్పటికే ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ శ్రీలీల.. అమర్ దీప్ ను చూస్తూ తెగ సిగ్గుపడిపోతుంది. అలా చూస్తూనే అమర్ దీప్ మీరు చాలా బాగున్నారని చెబుతుంది. దీనికి మనోడు ఓకే అనగా.. నాగ్ మధ్యలో వచ్చి నీవు చాలా బాగున్నావని చెబుతోందయ్యా అంటాడు. అందుకు అమర్ దీప్ తెగ సంబరపడిపోతూ మెలికలు తిరిగేశాడు. ఇక ఆ తర్వాత యావర్ కు గత ఎపిసోడ్ లో తెలుగు క్లాసులు తీసుకున్నారు. అది ఎంత వరకు పని చేసిందో అంటూ అనిల్ రావిపూడి టెస్ట్ చేశాడు. ఈక్రమంలోనే ఓ తెలుగు డైలాగ్ చెప్పమనగా.. యావర్ మాస్ సినిమా డైలాగ్ చెప్పాడు.

యావర్ మాటలు విని.. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్లు అనిపిస్తుందే అని నాగార్జున అనగా... మాస్ సినిమా అని అనిల్ రావిపూడి గుర్తు చేశాడు. అవును నా సినిమానే కదా అంటూ నాగ్ ఆశ్చర్యపోయాడు. యావర్ చెప్పిన భాష వల్లే నాగ్ కాస్త కన్ ఫ్యూజ్ అయినట్లు అనిపిస్తోంది. మరి ఈరోజు ఫుల్ ఎపిసోడ్ చూస్తే ఇంకా ఏమేం జరిగిందో మొత్తం తెలుస్తుంది. ఇంకెందుకు ఆలస్యం... ఓ లుక్కేసి ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











