Bigg Boss Telugu 7 తేలు కుట్టిన దొంగలా అమర్ దీప్.. ప్రశాంత్‌ను దొంగ ముఖం అంటూ అడ్డంగా బుక్కైన టీవీ యాక్టర్
బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ షోలో హోస్ట్‌గా నాగార్జున అక్కినేని తడాఖా చూపిస్తున్నారు. ఇప్పటి వరకు గతంలో ఎన్నడూ ప్రదర్శించని విధంగా నాగ్ కంటెస్టెంట్లపై కొరడా ఝులిపిస్తున్నారు. అయితే ఐదోవారాంతంలో నాగార్జున స్టేజ్‌పై వ్యవహరించిన తీరు అభిమానులను ఆకట్టుకొన్నది. కంటెస్టెంట్లను ఇంటరాగేట్ చేసిన తీరు ఆయన అనుభవానికి అద్దం పట్టింది. అమర్ దీప్‌ను బుక్ చేసిన విధానం వివరాల్లోకి వెళితే..
గత కొద్దికాలంగా సీరియల్ గ్యాంగ్‌లో ఒకరైన అమర్ దీప్.. ఇంటిలో కొందరిని టార్గెట్ చేస్తున్నాడనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. తాజాగా దొంగతనం టాస్క్‌లో అమర్ దీప్..పల్లవి ప్రశాంత్ ముఖం దొంగలా ఉంటుందని టార్గెట్ చేసిన విధానంపై అభ్యంతరం వ్యక్తమైంది. అదే విషయాన్ని అమర్ దీప్‌ను నాగార్జున అడిగితే తప్పించుకొనేందుకు చూశాడు. దాంతో వీడియోను ప్రదర్శించి అమర్ దీప్ బండారాన్ని బయటపెట్టాడు.

నాగార్జున ప్రదర్శించిన వీడియోలో.. అమర్ దీప్‌తో ఆట సందీప్ మాట్లాడితూ.. ఏదో కామెంట్ చేస్తే.. దానికి రెస్పాండ్ అవుతూ.. దొంగ టాస్క్ మేకప్ వేసుకొన్నా.. వేసుకోకపోయినా గానీ పల్లవి ప్రశాంత్ ముఖం దొంగలానే ఉంటుంది అని అన్నాడు. వీడియోలో విషయాన్ని చూడగానే అమర్ దీప్ ముఖాన్ని దాచుకొనే ప్రయత్నం చేశారు.
వీడియో ప్రదర్శించిన తర్వాత అమర్ దీప్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఒకరిని అలా కించపరిచేలా మాట్లాడకూడదు. అలా మాట్లాడి కూడా అబద్దం ఆడుతావా? అనే విధంగా నాగ్ ప్రశ్నించాడు. దాంతో అమర్ దీప్ తేలు కుట్టిన దొంగలా దొరికిపోయాడు. అబద్దం ఆడి మరోసారి అమర్ దీప్ బుక్కైపోయాడు. పక్కనే ఉన్న ప్రశాంత్‌కు సారీ చెప్పాడు.
అనంతరం పల్లవి ప్రశాంత్‌ను నాగార్జున అభినందించాడు. కెప్టెన్ కావడంతో ప్రశాంత్‌ను ఇంటి దొంగలను శిక్షించమని నాగార్జున సూచించాడు. దొంగలను శిక్షించే బాధ్యత నీదే అంటే.. పల్లవి ప్రశాంత్ సరే అంటూ తలూపాడు. కెప్టెన్సీ సాధించడంతో పాటు ఇంటి వ్యవహారాలను చూసే బాధ్యత రావడంతో ప్రశాంత్ పొంగిపోయాడు.
ఇదిలా ఉండగా, ఇక ముందు ఇలాంటి తప్పులు చేయను అంటూ నాగార్జున అక్కినేనితో అమర్ దీప్ అన్నాడు. దాంతో ప్రతీ వారం ఇలానే చెబుతున్నావు. కానీ అదే మాదిరిగా తప్పు మీద తప్పు చేస్తున్నావు అని నాగార్జున మందలించాడు. దాంతో ఇక నుంచి నేను మంచి గేమ్ ఆడుతాను.. ఇక నుంచి తప్పు చేయను అంటూ ప్రామిస్ చేశాడు.


Click it and Unblock the Notifications











