Bigg Boss Telugu 7: అందరినీ గట్టిగా వేసుకున్న నాగ్ మామ.. "ఊరోడు" పల్లవి ప్రశాంత్ కు మాత్రం..!

Bigg Boss Telugu 7: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గురించి అందరికీ తెలిసిందే. ఉల్టా పుల్టా కాన్సెప్ట్ తో ఈసారి అందరినీ ఉర్రూతలూగిస్తున్న ఈ రియాల్టీ ప్రతిరోజూ అద్భుతంగా సాగుతోంది. అందరికీ చూడాలనే ఉత్సాహం వస్తోంది. నిన్నటి ఎపిసోడ్ వరకూ నెక్స్ట్ కాప్టెన్ ఎవరనే దానిపై అద్భుతమైన టాస్కులు పెట్టగా.. శివాజి ఏడుపు, ఇతర కంటెస్టెంట్ల ఎమోషన్స్ చూసి తెగ ఎంజాయ్ చేశారు ప్రేక్షకులు. వారికి నచ్చిన వారు నవ్వుతుంటే ఎగ్జైట్ అవడం, ఏడుస్తుంటే బాధ పడడం వంటివి చేస్తూనే.. రోజూ షోను వీక్షిస్తున్నారు. ముఖ్యంగా నామినేషన్స్, నాగార్జున వచ్చే వీకెండ్ ఎపిసోడ్స్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తారు.

ఆ సమయం రానే వచ్చింది. వారం రోజుల పాటు హౌజ్ లో ఉంటి కంటెస్టెంట్లు చేసిన తప్పొప్పుల గురించి నాగార్జున చెబుతారు. ఎవరెవరు ఎలాంటి తప్పులు చేశారు, వారిలో మార్చుకోవాల్సిన పద్ధతులు ఏంటో వివరిస్తారు. ముఖ్యంగా తప్పు చేసిన వారిని గట్టిగా వేసుకుంటారు. ఇంట్లో ఉండే హౌజ్ మేట్స్ కూడా టాస్కులు ఆడుతున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు వీకెండ్ ఎపిసోడ్స్ లో నాగార్జున తిడతారనే భయం లోపల పెట్టుకొనే మెదులుతూ ఉంటారు. అయితే తాజాగా ఎపిసోడ్స్ కు సంబంధించి లేటెస్ట్ ప్రోమో విడుదల అయింది.

 Bigg Boss Telugu 7 King Nagarjuna Fires on Housemates And Support to Pallavi Prashanth

అందులో నాగార్జున.. రావడం రావడమే చాలా కోపంగా వచ్చారు. అప్పటికే స్టేజీపై కొన్ని కుండలు, కొన్ని ఫొటోలు పెట్టి ఉన్నాయి. ముందుగా అశ్వినీ శ్రీని లేపిన నాగార్జున.. ఏంటమ్మా అలా చేశావంటూ అడిగాడు. నేనేం చేశాను సార్ అంటూ అశ్విని అనగా.. ఒక్కోసారి నువ్వు మాట్లాడే పద్ధతిలో చాలా తేడా ఉంటుందని అన్నాడు. ముఖ్యంగా హేయ్ నువ్వు పోరా అనే విధానం అస్సలే బాలేదంటూ గట్టిగా వేసుకున్నాడు. ఆ తర్వాత భోళె షావళిని లేపి ఎర్రగడ్డ అనే పదం ఎందుకు తీసుకు వచ్చావని అన్నాడు. సెన్స్ లెస్ కు మెంటల్ కు చాలా తేడా ఉందని చెప్పారు. ఇంట్లోలాగే ఇక్కడ కూడా మాట్లాడితే బాగోదని చెప్పారు.

 Bigg Boss Telugu 7 King Nagarjuna Fires on Housemates And Support to Pallavi Prashanth

ఇక ఆ తర్వాత ప్రియాంక జైన్ ను లేపి తప్పు చేసిన తర్వాత క్షమాపణ అడిగితేనే దానికి మీనింగ్ ఉంటుందంటూ వెల్లడించాడు. అదయ్యాక వెంటనే శోభా శెట్టిని లేపి అమర్ దీప్ కేక్ తినగానే బిగ్ బాస్ కు ఎందుకు కంప్లెంట్ చేయలేదని ప్రశ్నించాడు. ఆలోచించకుండా కేక్ తిని నువ్వు ఎంత ప్రాబ్లంలో పడ్డావో నీకు తెలియదంటూ అమర్ దీప్ కు చెప్పాడు. ఆ తర్వాత తేజను లేపి నీ నుంచి ఇది ఎక్స్ పెక్ట్ చేయలేదని.. రెచ్చగొట్టడం అయితే శాడిజంలాగా కనిపించిందని నాగార్జున ఫుల్ ఫైర్ అయ్యాడు. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ ను లేపి సందీప్ ఒట్టేశాడు, నువ్వెందుకు వేయలేదని అడిగాడు.

 Bigg Boss Telugu 7 King Nagarjuna Fires on Housemates And Support to Pallavi Prashanth

ఆ తర్వాత నాగార్జున పల్లవి ప్రశాంత్ కుండను పగులగొట్టాడు. ఊరోడు అంటే తప్పా.. ఎందుకు అంత ఫీలయ్యావు అంటూ నాగార్జున అడిగారు. దీనికి రైతుబిడ్డ కన్నీరు పెట్టగా.. ఇవాళ్ల అందరికీ తిండి పెట్టేది ఊరే అని నాగార్జున చాలా గర్వంగా చెప్పాడు . నేను గర్వంగా చెబుతున్నాను మా నాన్న ఊరోడు అంటూ నాగార్జున చెప్పిన డైలాగ్ హైలెట్ గా నిలిచింది. దీనికి కంటెస్టెంట్లు అందరూ చప్పట్లు కొట్టారు. ఇక పూర్తి ఎపిసోడ్ చూడాలంటే మాత్రం కచ్చితంగా ఈరోజు రాత్రి వరకూ ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X