Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సంచలన నిర్ణయం.. ఫినాలేకు ముందే ఆగిపోయిన షో.. ఎందుకో తెలిస్తే!

టెలివిజన్ రంగంలో అంతకు ముందెన్నడూ చూడని కాన్సెప్టుతో వచ్చి.. ప్రేక్షకుల మన్ననలు అందుకుని సక్సెస్‌ అయిన షోనే బిగ్ బాస్. ఇండియాలో చాలా భాషల్లో ప్రసారం అవుతోన్నా.. తెలుగులో మాత్రమే దీనికి భారీ రేటింగ్ దక్కుతోంది. ఫలితంగా దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలుస్తోంది. దీంతో నిర్వహకులు వరుసగా సీజన్లను తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో దాన్ని నడుపుతున్నారు. ఇది వచ్చే ఆదివారమే గ్రాండ్ ఫినాలేను జరుపుకోనుంది. ఈ నేపథ్యంలో ఈ షోపై బిగ్ బాస్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆ వివరాలు మీకోసం!

ఫినాలే వీక్.. ఒకరు బయటకు:బిగ్ బాస్ ఏడో సీజన్‌కు సంబంధించి ప్రస్తుతం ఫినాలే వీక్ జరుగుతోంది. ఇందులో శివాజి, ప్రియాంక, ప్రశాంత్, యావర్, అర్జున్, అమర్‌దీప్‌లు టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. అయితే, వీరి నుంచి ఒకరిని మిడ్ వీక్‌లో బయటకు పంపించబోతున్నారు. కానీ, ఈ విషయం మాత్రం వాళ్లకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. అంటే గ్రాండ్ ఫినాలేలో ఐదుగురే ఎంట్రీ ఇస్తారని తెలిసింది.

Bigg Boss Telugu 7 Live Streaming Stopped From Last Night

ఓటింగ్ భారీగా... లైన్స్ బిజీగా:ప్రస్తుతం ప్రసారం అవుతోన్న ఏడో సీజన్‌లో ప్రస్తుతం ఆరుగురు కంటెస్టెంట్లు మాత్రమే మిగిలారు. అందులో ఒకరు వెళ్లిపోతారు. మిగిలిన వాళ్లలోనూ ఒకరు మాత్రమే విజేతగా నిలబోతున్నారు. దీంతో ప్రేక్షకులంతా తమకు నచ్చిన కంటెస్టెంట్లను గెలిపించేందుకు ఫుల్‌గా ఓట్లు గుద్దేస్తున్నారు. అలాగే, మిస్‌డ్ కాల్స్ కూడా భారీగా ఇస్తుండడంతో పలువురి లైన్స్ బిజీగా మారాయి.

ఆరోజే ఫినాలే.. ఆ ఇద్దరిలోనే:బిగ్ బాస్ ఏడో సీజన్‌కు సంబంధించిన గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ డిసెంబర్ 17 ఆదివారం జరగబోతుంది. ఆరోజు ఇది సాయంత్రం ఏడు గంటల నుంచి ప్రారంభమై దాదాపు మూడున్నర గంటల పాటు సాగబోతుంది. ఇక, ఈ సీజన్ విషయానికి వస్తే.. ఇందులో ప్రశాంత్ లేదా శివాజి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. దీంతో ఆసక్తి పెరిగిపోతూనే ఉంది.

Bigg Boss Telugu 7 Live Streaming Stopped From Last Night

సరికొత్తగా ప్లాన్.. వాళ్లంతోనూ:బిగ్ బాస్ షోలో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ఎంత గ్రాండ్‌గా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో భాగంగానే ఏడో సీజన్ ఫైనల్స్ కూడా అంతకు మించేలా ప్లాన్ చేసుకుంటోన్నారు. ఇందుకోసం ఈ సీజన్‌లోని మాజీ కంటెస్టెంట్లను, కొందరు సెలెబ్రిటీలను తీసుకు రాబోతున్నారు. దానికి సంబంధించిన షూటింగ్‌ను శుక్రవారం నుంచి మొదలు పెడతారని అంటున్నారు.

గెస్టుపై పుకార్లు.. మహేశ్ ఫిక్స్:ప్రతిసారి గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌కు హోస్ట్ నాగార్జునతో పాటు ఒక గెస్టు కూడా వస్తుంటారు. ఇలా ఇప్పటికే చాలా మంది స్టార్లు వచ్చారు. ఈ క్రమంలోనే ఏడో సీజన్ ఫినాలే ఎపిసోడ్‌కు వచ్చే గెస్టు గురించి ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సీజన్‌కు గెస్టుగా సూపర్ స్టార్ మహేశ్ బాబును అతిథిగా తీసుకు రాబోతున్నారని తాజాగా ఓ న్యూస్ లీకైన విషయం తెలిసిందే.

Bigg Boss Telugu 7 Live Streaming Stopped From Last Night

ఆగిపోయిన లైవ్.. అందుకే:బిగ్ బాస్ ఏడో సీజన్ టీవీలో గంట పాటు ప్రసారం అవడంతో పాటు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 24 గంటల పాటు లైవ్ స్ట్రీమింగ్ జరుగుతోంది. అయితే, దీన్ని డిసెంబర్ 14వ తేదీ రాత్రి నుంచి ఆపేశారు. ఫినాలే కోసం చేసిన సర్‌ప్రైజ్‌లు లీక్ అయ్యే ఛాన్స్ ఉండడం వల్లే నిర్వహకులు ఈ నిర్ణయం తీసుకున్నారట. కానీ, టీవీలో మాత్రం రోజువారి ఎపిసోడ్ ప్రసారం చేయబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X