Bigg Boss Telugu 7 ‌బిగ్‌బాస్ చరిత్రలో సంచలనం.. కంటెస్టెంట్‌కు రెడ్ కార్డ్.. డబుల్ ఎలిమినేషన్‌కు రంగం సిద్దం!

బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్ నాలుగో వారంలోకి ప్రవేశించింది. ఇంటిలో రకరకాల టాస్క్‌లు, గొడవలు, అలకలతో రంజుగా సాగుతున్నది. ఇంటిలోకి ప్రవేశించిన 14 మందిలోఇప్పటికే ఇంటి నుంచి ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు. అయితే కొందరు ఇంకా హౌస్‌మేట్స్ కావడానికి పవర్ అస్త్ర టాస్కులు ఆడుతుండగా.. ఆట సందీప్, శివాజీ, శోభా శెట్టి పవర్ అస్త్ర టాస్క్‌లు గెలిచి హౌస్‌మేట్స్ అయ్యారు. ఇలాంటి పరిణామాలు, పరిస్థితుల మధ్య నాలుగోవారం ఎలిమినేషన్‌కు రంగం సిద్దమైంది. ఈ వారం ఎలిమినేషన్‌కు సంబంధించిన ఓటింగ్ వివరాల్లోకి వెళితే..

బిగ్‌బాస్ తెలుగు ఇంటి నుంచి గత నాలుగు వారాల్లో ముగ్గురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. సినీ నటులు కిరణ్ రాథోడ్, షకీలా తొలి రెండు వారాల్లో ఎలిమినేట్ అయితే.. మూడో వారం సింగర్ దామిని ఇంటి నుంచి బయటకు వెళ్లడం షాకింగ్‌ కలిగించింది. అయితే సింగర్ దామిని ఎలిమినేషన్‌పై కొందరు తమ నిరాశను ఇప్పటికే ప్రకటించారు. ఆమెను మళ్లీ షోలోకి రీ ఎంట్రీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

Bigg Boss Telugu 7

ఇక ముగ్గురు ఎలిమినేషన్ తర్వాత నాలుగో వారం ఎలిమినేషన్ కోసం ఆరుగురు నామినేట్ అయ్యారు. ప్రియాంక జైన్, రతిక రోజ్, ప్రిన్స్ యావర్, శుభశ్రీ, గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజ నామినేషన్‌లో ఉన్నారు. అయితే ఈ ఆరుగురిలో అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్లే.. కానీ ఇందులో కొందరికి సోషల్ మీడియాలో పెద్దగా పాపులారిటీ లేకపోవడం వల్ల డేంజర్ జోన్‌లోకి జారుకొన్నారు.

బిగ్‌బాస్ తెలుగు 7 షోలో నాలుగో వారం ఎలిమినేషన్ కోసం నామినేట్ అయిన వారిలో ప్రిన్స్ యావర్ అత్యధిక ఓట్లు అంటే 30 శాతం ఓటింగ్ సాధించి.. టాప్ స్థానంలో ఉన్నాడు. ఇక శుభ శ్రీ 19 శాతం ఓటింగ్‌తో రెండో స్థానంలో, ప్రియాక 15 శాతం ఓటింగ్‌తో మూడో స్థానంలో ఉన్నారు. గౌతమ్ కూడా దాదాపు 15 శాతం ఓటింగ్‌తో నాలుగో స్థానంలో ఉన్నారు. చివరి రెండు స్థానాల్లో రతిక రోజ్, టేస్టీ తేజ నిలిచారు.

అయితే ఓటింగ్, ఎలిమినేషన్ సంగతులు పక్కన పెడితే.. బిగ్‌బాస్ చరిత్రలో తొలిసారి రెడ్ కార్డు చూపించి టేస్టీ తేజకు శిక్ష విధించనున్నట్టు సమాచారం. స్మైల్ టాస్క్‌లో డాక్టర్ గౌతమ్ కృష్ణతో టేస్టీ తేజ వ్యవహరించిన తీరుపై తీవ్ర అభ్యంతరం, నిరసన వ్యక్తం అవుతున్నాయి. శారీరక హింసకు పాల్పడిన టేస్టీ తేజకు బిగ్‌బాస్ రెడ్ కార్డు షో చేసే అవకాశం ఉందని తెలుస్తున్నది.

Tasty Teja

ఇక ఎలిమినేషన్ విషయానికి వస్తే... నాలుగో వారం షాకింగ్ ఎలిమినేషన్స్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాలుగో వారంలో డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగితే.. ఇంటి నుంచి రితిక రోజ్, టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. సింగిల్ ఎలిమినేషన్ అయితే.. టేస్టీ తేజ ఎలిమినేట్ కావడం తథ్యంగా కనిపిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X