Bigg Boss Telugu 7: అర్జున్ కు నాగార్జున హింట్, టాప్ 5 లో ఉంచేందుకు విశ్వప్రయత్నాలు - ఏం జరుగుతుందంటే?
బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు అద్భుతమైన టీఆర్పీని సొంతం చేసుకుంటూ అందరినీ అలరిస్తూ ముందుకు వెళ్తుంది. ముఖ్యంగా ఈసారి సీజన్ లో రెండు గ్రూపులుగా ఏర్పడిన కంటెస్టెంట్లు తమకు నచ్చినట్లుగా ఆట ఆడుతున్నారు. ముఖ్యంగా సీరియల్ బ్యాచ్ చేసే రచ్చ అయితే మామూలుగా లేదు. అమర్ దీప్, శోభా సెట్టి, ప్రియాంక్ జైన్, సందీప్ మాస్టర్... వీరికి సాయంగా టేస్టీ తేజ అలాగే అంబటి అర్జున్ ఓ టీంగా ఏర్పడి గ్రూపు గేమ్ ఆడుతున్నారు. ఈ విషయం చూసే ప్రతీ ఒక్కరికీ బాగా అర్థం అవుతుంది.
మరోవైపు శివాజి, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్, రతిక, భోలె షవాళి ఓవైపు ఉన్నారు. వీరు అంతా కలిసే ఉన్నప్పటికీ... గేమ్ మాత్రం ఇండివిజ్యువల్ గానే ఆడుతున్నారు. అందుకే వీరిపై ప్రేక్షకుల అందరికీ సాఫ్ట్ కార్నర్ ఉంది. ముఖ్యంగా రైతు బిడ్డను అని చెప్పుకొని వెళ్లిన పల్లవి ప్రశాంత్ కు ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ అప్పటి నుంచే ప్రేక్షకుల్లో సింపతీ ఏర్పడింది. ముఖ్యంగా అమర్ దీప్ చేసిన ఓవర్ యాక్షన్... ఇంట్లోని సభ్యులు అంతా ఆయనకు వత్తాసు పలకడంతో రచ్చ రచ్చ అయింది. ఈక్రమంలో శివాజి పల్లవి ప్రశాంత్ పక్కన నిలబడి అండగా ఉండడంతో.. అందరిలోనూ వీరి బాండింగ్ పై మంచి ఒపీనియన్ క్రియేట్ అయింది.

అమర్ దీప్.. కావాలనని, అనవసరంగా పల్లవి ప్రశాంత్ పై కోపం పెంచుకొని.. అతడిని గెలవనీయకుండా చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూ తన గేమ్ ను నాశనం చేసుకుంటున్నాడు. విన్నర్ గా నిలిచే సత్తా ఉందని అందరూ భావించిన అమర్ దీప్ ఆట తుస్సు మనడంతో... అంతా పల్లవి ప్రశాంత్, శివాజీల్లో ఎవరో ఒకరు విన్నర్ అవుతారని అనుకున్నారు. కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అంబటి అర్జున్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కాస్త మార్పు వచ్చింది. ఆయన కూడా టాప్ 5 లో నిలిచే స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కనిపిస్తున్నాడు. కానీ ఈయన కూడా సీరియల్ నటుడు కావడం, అందులోనూ అమర్ దీప్, ప్రియాంక, శోభా శెట్టిల సైడ్ ఉండడంతో అంతా అప్సెట్ అవుతున్నారు.
వీరంతా కలిసే గేమ్ ఆడుతున్నారనంటూ నెట్టింట పెద్ద రచ్చ సాగుతోంది. అంబటి అర్జున్ కూడా సీరియల్ బ్యాచ్ తో చేరి కన్నింగ్ గేమ్ ఆడుతున్నాడనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే విన్నర్ అయ్యే ఛాన్స్ ఉన్న అతడిని ఇప్పట్లో ఎలిమినేట్ చేయడం ఇష్టం లేని బిగ్ బాస్... నాగార్జున చేత ఓ హింట్ ఇప్పించాడని కూడా చాలా మంది భావిస్తున్నారు. అయితే శనివారం ఎపిసోడ్ లో.. నాగార్జున అంబటి అర్జున్ తో మాట్లాడుతున్నప్పుడు చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఎవరు తప్పు చేసినా చెప్పే నువ్వు.. అమర్ దీప్ తప్పు చేస్తే కూడా చెప్పు అంటూ వివరించాడు.
అలా చేయకపోవడం వల్ల బయటి జనాలు అందరూ గ్రూపు గేమ్ ఆడుతున్నారని అనుకుంటున్నట్లు హింట్ ఇచ్చాడు. నీవు గ్రూపు గేమ్ ఆడుతున్నావని ఎవరూ అనుకోవద్దు, అలా జరగాలంటే... అమర్ దీప్ తప్పు చేసినప్పుడు కూడా చెప్పు అంటూ నాగార్జున సూచించాడు. దీంతో నాగార్జున.. అర్జున్ పై ఫేవరిజం చూపిస్తున్నాడని కూడా పలువురు భావిస్తున్నారు. శివాజీ ఏం అనకపోయినా సింక్, ఫ్లోట్ గేమ్ లో శివాజి తేజకు ఆన్సర్ చెప్పాడని గౌతమ్ కు చెప్పి, శివాజి వద్దకు వచ్చి నేనలా అనలేదని చెప్పినా... నామినేషన్లలో అమర్ దీప్ విషయంలో తల ఊపి కూడా, నేను ఊపానా, నువ్వు చూశావా అంటూ పల్లవి ప్రశాంత్ పై ఫైర్ అయ్యాడు. వీటిపై నాగార్జున స్పందించకపోవడం, అర్జున్ జెండాను పాతడంతో ఫేవరిజం చూపిస్తున్నారని, టాప్ 5 లో అతడిని నిలబెట్టేందుకే ఇలాంటి హింట్లు ఇస్తున్నారని ఫీలవుతున్నారు. చూడాలి మరి ఏం జరగనుందో.


Click it and Unblock the Notifications











