Bigg Boss Telugu 7: పల్లవి ప్రశాంత్ కు నాగార్జున స్పెషల్ గిఫ్ట్.. టాప్ 5కి చేరేందుకు ఇదే బూస్టింగా!

Bigg Boss Telugu 7: బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ చాలా అద్భుతంగా సాగుతోంది. అత్యధిక టీఆర్పీతో ఎలాంటి అడ్డంకులు లేకుండా దూసుకెళ్తున్న ఈ షోలో ఎవరూ ఊహించనివి జరుగుతున్నాయి. ముందుగా 14 మంది కంటెస్టెంట్లను మాత్రమే ఇంట్లోకి పంపిన బిగ్ బాస్.. బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా అంటూ 2.0 పేరుతో మరో ఐదుగురు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లను ఇంట్లోకి పంపాడు. ఇఖ ఆ తర్వాత గౌతమ్ కృష్ణను సీక్రెట్ రూంలో పెట్టిన బిగ్ బాస్.. సడెన్ గా అతడిని బయటకు తీసుకొచ్చి అందరికీ షాక్ ఇచ్చారు.

ఇక ఆ తర్వాత గతంలో ఇంట్లోనుంచి వెళ్లిపోయిన దామిని, శుభశ్రీ, రతికలను ఇంట్లోకి తీసుకువచ్చాడు. వీరి ముగ్గురిలో మీ ఓటంగ్ ద్వారా ఒకరు లోపలికి వస్తారంటూ చెప్పాడు. దీంతో అంతా తమకు నచ్చిన వారికి ఓటు వేయగా.. తక్కువ వచ్చిన వారే ఇంట్లోకి వస్తారని చెప్పి మరో షాకిచ్చారు. ఈక్రమంలోనే రతిక ఈరోజు బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. అలాగే తాజా ఎపిసోడ్ లో పూజా మూర్తి ఎలిమినేట్ అయిపోయింది. అయితే రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కు నాగార్జున స్పెషల్ గిఫ్టు ఇచ్చారు.

Bigg Boss Telugu 7 Nagarjuna Special Gift to Pallavi prashanth in Sunday Episode

అది చూస్తే ఎవరికైనా సరే.. ఆయన టాప్ -5లోకి వచ్చేందుకు బూస్టింగ్ ఇచ్చినట్లు అనిపిస్తోంది. ఎందుకు అంటారా... నామినేషన్స్ నుంచి సేఫ్ చేయడంలో భాగంగా.. పల్లవి ప్రశాంత్ కోసం వాళ్ల నాన్న చేత ఓ వీడియో చేయించారు. కొడుకా నువ్వు సేఫ్ అయ్యావ్ అంటూ అందులో వాళ్ల నాన్న చెప్పడం ఈరోజు షోలో హైలెట్ గా నిలిచింది. ముఖ్యంగా కొడుకా మేము బాగున్నం, మంచిగ ఆడుతున్నవ్.. అందరూ నిన్ను మెచ్చుకుంటున్నరు. అంటూ చెబుతున్న వీడియో నిజంగా అదిరిపోయింది.

Bigg Boss Telugu 7 Nagarjuna Special Gift to Pallavi prashanth in Sunday Episode

మొన్న ఓ ఎపిసోడ్ లో పల్లవి ప్రశాంత్.. తల్లిదండ్రులు పంపిన లేఖను చదివాడు. ఆ తర్వాత చాలా స్ట్రాంగ్ గా కనిపించాడు. ఈక్రమంలోనే తాజాగా ఈయన వీడియో పంపడంతో.. పల్లవి ప్రశాంత్ మరింత హ్యాపీగా ఫీలయ్యాడు. తెగ మురిసిపోతూ బాపు, బాపు అంటూ ఆనంద భాష్పాలు కార్చాడు. ఈ ఊపు చూస్తుంటే పల్లవి ప్రశాంత్ కచ్చితంగా టాప్ - 5లోకి వస్తాడని అంతా అనుకుంటున్నారు. సీరియల్ గ్రూప్ కాస్త వేరు చేసి చూస్తున్నా... నాగార్జున ఇచ్చిన ఈ స్పెషల్ గిఫ్టుతో గేమ్ లో మరింత దూసుకెళ్తాడని అనపిస్తోంది.

Bigg Boss Telugu 7 Nagarjuna Special Gift to Pallavi prashanth in Sunday Episode

చూడాలి మరి రైతు బిడ్డు, ఊరోడు.. పల్లవి ప్రశాంత్ టాప్ - 5వరకు వస్తాడా.. లేక మధ్యలోనే వెళ్లిపోతాడా. వాస్తవానికి ప్రశాంత్ ఆట చూస్తుంటే, ఆయనకు బయట నుంచి వస్తున్న సపోర్ట్ చూస్తుంటే ఫైనల్స్ వరకు కచ్చితంగా వస్తాడని అర్థం అవుతోంది. చూడాలా మరి ఏం జరగనుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X