Don't Miss!
- Sports
అందుకే నా వికెట్ త్యాగం చేశా: వాషింగ్టన్ సుందర్
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- News
అటెన్షన్ అమరావతి: అందరి చూపూ అటు వైపే..!!
- Finance
household income: భారతీయ కుటుంబాలపై సర్వే.. ఆదాయం, పొదుపులు ఎంతో తెలుసా ?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Automobiles
భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ప్రైస్, వేరియంట్స్ & కలర్ ఆప్సన్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
Bigg Boss Telugu 7: బాలయ్య రావడం కష్టమే.. కానీ రెమ్యునరేషన్ తో టెంప్ట్ చేస్తున్న బిగ్ బాస్?
బిగ్బాస్ షో 6వ సీజన్ చాలా నీరసంగా కొనసాగింది. కంటెస్టెంట్స్ విషయంలోనే ప్రేక్షకులు తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక నాగార్జున వచ్చిన వీకెండ్స్ లో కూడా షో అంత ఆసక్తిగా మారకపోవడంతో రేటింగ్స్ కూడా ఈ సీజన్ చాలా వరకు తగ్గిపోయింది. అయితే ఏడవ సీజన్ అసలు ఉంటుందా లేదా అని అనుమానాలు కూడా వస్తున్నాయి.
ఈ తరుణంలో ఏడవ సీజన్ కోసం నందమూరి బాలకృష్ణను రంగంలోకి దింపే అవకాశం ఉన్నట్లు కూడా ఒక టాక్ వినిపించింది. అయితే ప్రస్తుతం బాలయ్య అన్ స్టాపబుల్ షో కోసం ఎంత తీసుకుంటున్నాడో అంతకంటే ఎక్కువ స్థాయిలో బిగ్ బాస్ కోసం డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ వాళ్ళు ఒక ఆఫర్ చెబితే మాత్రం టెంప్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఆ వివరాలలోకి వెళితే...

ఏది పట్టుకున్న బంగారమే..
నందమూరి బాలకృష్ణ ఇటీవల కాలంలో ఊహించని స్థాయిలో క్రేజ్ అయితే అందుకుంటున్నాడు. ముఖ్యంగా అఖండ సినిమా నుంచి ఆయన రేంజ్ మరింత పెరిగిపోయింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకోవడంతో ఆ తరువాత అన్ స్టాపబుల్ షో కూడా మరొక రేంజ్ కు వెళ్లింది. ఇప్పుడు బాలకృష్ణ ఏది పట్టుకున్న బంగారమే అనే తరహాలో అయితే టైం నడుస్తోంది.

బిగ్ బాస్ 7 కోసం బాలయ్య
ఇక బిగ్ బాస్ 7వ సీజన్ కోసం నందమూరి బాలకృష్ణను తీసుకురావాలి అని నిర్వాహకులు ఇటీవల ఆలోచనలకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే నాగర్జున 6వ సీజన్ కే దాదాపు గుడ్ బై చెప్పేసినట్లే అని ఒక క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే నాగర్జున ప్రతి సీజన్లో కూడా చివరి ఎపిసోడ్లో నెక్స్ట్ సీజన్ గురించి ఏదో ఒక క్లారిటీ ఇస్తూ వస్తూ ఉంటారు. కానీ ఈ సీజన్లో మాత్రం ఆయన తదుపరి సీజన్ ఎప్పుడు ఏమిటి అనే వివరాలపై ఏమి స్పందించకుండా గుడ్ బై చెప్పేసారు.

జూన్ లో మరో సీజన్
కానీ నాగార్జున మానేసిన కూడా నిర్వాహకులు మాత్రం బిగ్ బాస్ ను ఆపకూడదు అని మళ్లీ వచ్చే సీజన్ 2023 జూన్లో మొదలు పెట్టాలని ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే రేటింగ్స్ తక్కువగా వచ్చినప్పటికీ కూడా పెద్దగా నష్టపోలేదట. ఈసారి చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా తదుపరి ఎపిసోడ్ కోసం మంచి క్రేజ్ ఉన్న సెలబ్రిటీలను తీసుకురావాలి అని అనుకుంటున్నారు.

బాలకృష్ణ వస్తే..
అందుకే ఈసారి అగ్ర హీరోలలో ఎవరినైనా హోస్ట్ గా తీసుకురావాలి అని బిగ్ బాస్ నిర్వాహకులు ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే రానా పేరు కూడా కొన్నిసార్లు వినిపించింది. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హడావిడి చూస్తుంటే మాత్రం బాలకృష్ణ వస్తే చాలా బాగుంటుంది అని రెస్పాన్స్ వస్తోంది. వారి డిమాండ్ మేరకు అయినా సరే నిర్వాహకులు బాలకృష్ణపై ఫోకస్ చేయాల్సి ఉంటుంది.

ఆహా రెమ్యునరేషన్
అయితే ప్రస్తుతం బాలకృష్ణకు ఉన్న డిమాండ్ మేరకు అతనికి రెమ్యునరేషన్ కూడా ఎక్కువగానే ఇవ్వాల్సి ఉంటుంది. నాగార్జున కంటే ఎక్కువ స్థాయిలోనే బాలయ్య బాబుకు రెమ్యునరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే అన్ స్టాపబుల్ షో ద్వారా ఆహా కు ఇప్పుడు మంచి ఆదాయం వస్తోంది. అన్ స్టాపబుల్ 2 రెమ్యునరేషన్ కూడా టోటల్ గా 15 కోట్ల వరకు అందుకోబోయే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

టెంప్టింగ్ ఆఫర్
అయితే ఆహా షోకు అలాగే బిగ్ బాస్ షోకు చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి బాలయ్య బాబుకు ఎక్కువ స్థాయిలో రెమ్యునరేషన్ ఇస్తేనే వస్తారు అని చెప్పవచ్చు. బాలయ్య అన్ స్టాపబుల్ లో ప్రతీ సీజన్ 10 ఎపిసోడ్స్ చేస్తూ ఆ రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. ఇక దాదాపు 100 రోజులకు పైగా కొనసాగే బిగ్ బాస్ షో అంటే ఆయనకు ఏ రేంజ్ లో ఇవ్వాల్సి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
కానీ బిగ్ బాస్ నిర్వాహకులు మాత్రం హోస్ట్ విషయంలో ఫిక్స్ అయితే అంతకంటే ఎక్కువ స్థాయిలో ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. మరి ఆ టెంప్టింగ్ ఆఫర్ జూ బాలయ్య బాబు ఒప్పుకుంటారో లేదో చూడాలి.