Bigg Boss Telugu 7: బిగ్‌బాస్‌లో నయని పావని షాకింగ్ కామెంట్స్ !
బిగ్ బాస్ తెలుగు 7 ఉల్టా పుల్టా చాలా రసవత్తరంగా సాగుతోంది. వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్ లోకి కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇది తొలి ఎలిమినేషన్. ప్రతీ వారంలాగే ఈ వారం కూడా అమ్మాయే ఎలిమినేట్ అయింది. నయని పావని ఎలిమినేట్ అవుతుందని తనతో పాటు ఇంట్లోని ఏ ఒక్క కంటెస్టెంట్ కూడా ఊహించలేదు. కానీ అందరినీ ఆశ్చర్యపరిచేలా ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన ఈ క్యూట్ బ్యూటీ బిగ్ బాస్ బజ్ లో షాకింగ్ కామెంట్లు చేసింది. కంటెస్టెంట్ల గురించి చాలానే విషయాలు తెలిపింది.
నయని పావని ఇంట్రడక్షన్ ఇస్తూ... గీతూ రాయల్ హాట్ హాట్ కామెంట్లు చేసింది. మెరుపు తీగలాగా హౌజ్ లోకి వెళ్లొచ్చింది అంటూ చెప్పుకొచ్చింది. ముందుగా బిగ్ బాస్ హౌజ్ లో ఉన్న కంటెస్టెంట్లలో తను అశ్విని శ్రీ, భోళె షావలి అంటే నచ్చలేదంటూ నయని పావని వారి ఫొటోలపై రెడ్ మార్క్ వేసింది. అలాగే అశ్విని బ్రెయిన్ లెస్ అంటూ కామెంట్ కూడా చేసింది. పది వారాల తర్వాత మీ ఎలమినేషన్ ఊహించాం, మీరు ఇప్పుడు ఎలా ఫీలవుతున్నారని అని అడగ్గా... ఏం లేదు, నేనేం ఫీల్ అవ్వట్లేదు నయని పావని చేసిన కామెంట్లు కాస్త ఆశ్చర్యకరంగా అనిపించాయి.

అలాగే తేజతో యాంటీగా ఉండాలనే హౌజ్ లోకి వెళ్లారా, కావాలనే అతడితో గొడవ క్రియేట్ చేసుకోవడానికి వెళ్లారేమే అనిపించింది అంటూ గీతూ రాయల్ అనగా.. ఇందుకు స్పందిస్తూ నయని పావని లేదు, ఒకవేళ మీకు అలా అని అనిపించి ఉండవచ్చు అని చెప్పింది. నువ్వు గట్టిగా నామినేట్ చేశానని అనుకుంటున్నావా అని అడగ్గా... ఏమో నేను అయితే అనుకుంటున్నాను అంటూ తెలిపింది నయని పావని. నువ్వు కాకుండా ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరని అనుకున్నావని గీతూ ప్రశ్నించగా.. ఐశ్వర్య అని సమాధానం చెప్పింది.
అది ఐశ్వర్య కాదక్కా అశ్విని:అది ఐశ్వర్య కాదక్క అశ్విని అని గీతూ నవ్వుతూ చెప్పడం అందరిలోనూ నవ్వులు పూయించింది. అవును అశ్విని, నాకు పేర్లలో చాలా కన్ ఫ్యూజన్ ఉంటుందంటూ నయని పావని వెల్లడించింది. ఆ వెంటనే గీతూ రాయల్ అందుకొని.. అవును చాలా కన్ ఫ్యూజన్ లో ఉన్నావు, అందుకే నీ ఆట కూడా అలాగే ఉందని తెలిపింది. అందుకే రోజు ఇక్కడ ఉన్నావంటూ నయని పావనికి క్లారిటీ ఇచ్చింది. దీనికి లేదు నేను చాలా కన్ ఫ్యూజన్ లో లేనని నయని పావని చెప్పుకొచ్చింది.

అసలు బిగ్ బాస్ కు ఎందుకు వచ్చావు అని గీతూ ప్రశ్నించగా.. నా గేమ్ నేను ఆడాను అంటూ నయని పావని క్లారిటీ ఇచ్చింది. ఏం గేమ్ ఆడావు అని గీతూ అడిగితే.. ఏం గేమ్ ఆడలేదంటూ నయని ఎదురు ప్రశ్న వేసింది. ఒక్కటైనా గెలిచావా అని గీతూ గట్టిగా అడగ్గా... నాకు తెలియదంటూ తప్పించుకుంది నయని పావని. నయని హౌజ్ లో ఏం చేయలేదని ఈ మౌనమే చెబుతుందంటూ గీతూ కామెంట్ చేయగా.. నా మౌనం అలా అర్థం అయితే నేనేం చేయలేను అంటూ సైలెంట్ అయిపోయిందని నయని పావని. ఇలా రసవత్తరంగా సాగిన బిగ్ బాస్ బజ్ ను మీరూ ఓసారి చూసేయండి.


Click it and Unblock the Notifications











