Bigg Boss Telugu 7: ఆటగాళ్లను ముంచేసిన అమర్ దీప్, సందీప్.. ఇలా చేసారేంట్రా!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7కి అసలైన ఉల్టా పుల్టా మొన్నటి వైల్డ్ కార్ట్ ఎంట్రీస్ అని చెప్పవచ్చు. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఐదు మంది కొత్తగా హౌజ్ లో అడుగుపెట్టారు. ఇక గౌతమ్ కూడా ఎలిమినేట్ అయిపోయి.. కొత్తగా హౌజ్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక హౌజ్ లో పాత కంటెస్టెంట్స్ 8 మంది ఉన్నారు. ఇక వారిని ఆటగాళ్లు అని.. కొత్తగా వచ్చిన కంటెస్టెంట్స్ ను పోటుగాళ్లు అని బిగ్ బాస్ డిసైడ్ చేశాడు. ఇక వీరి మధ్య ఫిజికల్, మెంటల్ టాస్కులు మొదలు అయ్యాయి. ఈ ఆటల్లో ఆటగాళ్లను ఇద్దరు దీప్ లు ముంచేశారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రసవత్తరంగా సాగుతోంది. ఇక బిగ్ బాస్ 2.ఓ లాంచ్ తర్వాత ఆట తీరే మారిపోయింది. కొత్తగా వచ్చిన కంటెస్టెంట్స్ అంతా పోటుగాళ్లు కాగా... హౌజ్ లో ఉన్న కంటెస్టెంట్స్ అంతా ఆటగాళ్లు. ఇక గౌతమ్ ఫేక్ ఎలిమినేషన్.. సీక్రెట్ రూమ్ ఎంట్రీ తర్వాత ఆయన పోటుగాళ్లు టీమ్ లో చేర్చారు. ఇక బిగ్ బాస్ ఆటగాళ్లు వర్సెస్ పోటుగాళ్లు గేమ్ పెడుతూ.. ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసే పనిలో పడ్డారు.

Bigg Boss Telugu 7 October 10 Episode Arjun Gautham Potugallu vs Atagallu Amardeep Sandeep

నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ మెంటల్ , ఫిజికల్ టాస్కులు నిర్వహించాడు. ఇక ఇందులో పోటుగాళ్లు వర్సెస్ ఆటగాళ్లు పాల్గొనగా.. ఇక ఆటగాళ్లను ఇద్దరు సందీప్, అమర్ దీప్ ముంచేశారు. మొదట టాస్క్ టైర్ల టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. అందులో సందీప్ ఆటగాళ్లను ముంచేశాడు. ఇక మెంటల్ టాస్కులో అమర్ దీప్ ఆటగాళ్లను ముంచేశాడు. ఇలా ఇద్దరూ కలిసి... ఆటగాళ్లను రెండు టాస్కులో ఓడిపోయేలా చేశారు.

ఫిజికల్ టాస్క్ టైర్ల టాస్కులో స్విమ్మింగ్ పూల్‌ లో ఉన్న టోకెన్‌ ను తీసి బయటున్న తన పార్టనర్‌కి ఇవ్వాలి. అప్పుడు అతను వెళ్లి గార్డెన్ ఏరియాలో ఉన్న ఆ నంబర్ టైరును తీసుకొచ్చి పూల్‌ లో ఉన్న ప్లేయర్‌కి ఇస్తాడు. ఇలా సందీప్, యావర్ ఓ జట్టుగా దిగగా.. పోటుగాళ్ల టీం నుంచి గౌతమ్ అర్జున్ పాల్గొన్నారు. అయితే ఈ టాస్కులో యావర్ బాగానే కష్టపడినా... సందీప్ మాత్రం టైం వెస్టూ చేస్తూ గేమ్ లో ఓడిపోయాడు. దీనితో పోటుగాళ్లు గెలిచారు. ఆటగాళ్లను సందీప్ ముంచేశాడని తెలుస్తోంది.

Bigg Boss Telugu 7 October 10 Episode Arjun Gautham Potugallu vs Atagallu Amardeep Sandeep

జీనియస్ టాస్క్ కు... ఆటగాళ్ల టీం నుంచి అమర్ దీప్, పోటుగాళ్ల టీం నుంచి గౌతమ్ ఎంట్రీ ఇచ్చారు. ఇక మొదటి ప్రశ్నకే అమర్ దీప్ బజర్ అయితే కొట్టేశాడు. గన్ పేల్చాక చెట్టుపై ఎన్ని పిట్టలుంటాయ్ అనే ప్రశ్న అడగ్గా... దానికి ఓ ఆలోచించి... ఆలోచించి... శివాజీ హింట్ ఇచ్చాక సమాధానం చెప్పాడు. ఇక ఇలాంటివే కొన్ని ప్రశ్నలు బిగ్ బాస్ వేయగా.. సమాధానం చెప్పలేక అమర్ దీప్ బిక్క మోహం వేయాల్సి వచ్చింది. ఇక బిగ్‌బాస్‌ కి కూడా చిరాకొచ్చి.. ఆటగాళ్లు మీరు మీ ప్లేయర్‌ని మార్చాలనుకుంటున్నారా? అంటూ డైరెక్ట్‌గా అమర్ దీప్ పరువు తీసేశాడు.

Bigg Boss Telugu 7 October 10 Episode Arjun Gautham Potugallu vs Atagallu Amardeep Sandeep

దీంతో ఆ ప్లేస్‌ లోకి తేజ వచ్చాడు. తర్వాత తేజ ప్రతి ప్రశ్నకి చకచకా ఆన్సర్ చేసుకుంటూ పోయాడు. నిజానికి అమర్ ప్లేస్‌ లో ముందే తేజ వచ్చి ఉంటే ఈ టాస్క్‌లో ఆటగాళ్ల టీమ్ గెలిచేది. కానీ నేను ఆల్తా అంటూ అమర్ రావడంతో ఈ టాస్క్ కూడా ఓడిపోయారు. ఇలా ఒక టాస్క్ సందీప్.. మరో టాస్క్ అమర్‌ దీప్ ఆడి... ఇద్దరూ కలిసి ఆటగాళ్లను నిలువునా ముంచేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X