Bigg Boss Telugu 7 Live 15 కంటెస్టెంట్లతో బిగ్‌బాస్ 7.. టాప్ హీరోను ఇంట్లో బంధించిన నాగ్.. షోలో ఎవరెవరంటే?
తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రేక్షకాదరణ ఉన్న రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు 7. అక్కినేని నాగార్జున హోస్ట్‌గా బిగ్‌బాస్ తెలుగు 7 షో అట్టహాసంగా ప్రారంభం కానున్నది. ఈ షోకు సంబంధించిన ప్రోమోలు స్టార్ మా వదలడంతో సోషల్ మీడియా, యూట్యూబ్‌లో హల్‌చల్ మొదలైంది. బిగ్‌బాస్ షో ఆదివారం అంటే.. సెప్టెంబర్ 3వ తేదీ 7 గంటలకు ప్రారంభమైంది. ఈ ప్రారంభ వేడుకకు సంబంధించిన అప్‌డేట్స్ వివరాల్లోకి వెళితే...

మొదటి కంటెస్టెంట్‌గా ప్రియాంక జైన్
బిగ్‌బాస్ ఇంటిలోకి ఫస్ట్ కంటెస్టెంట్‌గా జానకి కలగనలేదు సీరియల్ యాక్టర్ ప్రియాంక జైన్ అడుగుపెట్టింది. నాగార్జున ఆమెను సాదరంగా ఆహ్వానించారు. ఆమెతో కుశల ప్రశ్నలు వేసి ఆమెను ఇంటిలోకి సాగనంపారు. వేదికపై నాగార్జునతో ఫన్నీగా మాట్లాడింది. ప్రియుడు శివ కుమార్ ముద్దుగా వరి అని పిలుస్తారని ఆమె చెప్పింది. ఇంటిలోకి వెళ్లిన తర్వాత నా కల నెరవేరింది. బయట వేడిగా ఉంది. స్విమ్మింగ్ ఫూల్‌లో దూకేయాలని ఉంది. ఇళ్లంతా కలియ దిరుగుతూ సంతోషాన్ని వ్యక్తం చేసింది.
ఆరంభంలోనే సూట్‌కేస్‌తో గేమ్:బిగ్‌బాస్ తెలుగు 7 అంతా కొత్తగా ఉంటుందని చెప్పినట్టే.. డిఫరెంట్‌గా షోను ప్రారంభించారు. ఇంటిలోకి హోలో గ్రామ్ ద్వారా నాగార్జున ఇంటిలోకి అడుగుపెట్టాడు. ప్రియాంక జైన్‌ను కలిసేందుకు ఇంటిలోకి వెళ్లాడు. ప్రియాంక ముందు సూట్ కేస్ పెట్టి.. సాధారణంగా లాస్ట్‌లో ఇస్తారు. కానీ ఈ షోలో మొదటి రోజే వచ్చింది. ఈ సూట్‌కేస్‌ను దాచి పెట్టాలి. అది వేరే వాళ్లకు దక్కకుండా చూస్తే కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి అని నాగ్ చెప్పగానే ప్రియాంక జైన్ సూట్ కేసు దాచి పెట్టింది.

రెండో కంటెస్టెంట్‌గా యాక్టర్ శివాజీ:బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ షోలో రెండో కంటెస్టెంట్‌గా యాక్టర్ శివాజీ అడుగుపెట్టాడు. సినీ పరిశ్రమలో ఎన్నో కష్టాలు, సమస్యలను ఎదురిస్తూ అతి తక్కువ కాలంలో ఎంతో ఎత్తుకు ఎదిగిన హీరో శివాజీ. శివాజీ ఆడియో విజువల్‌ను చాలా ఎమోషనల్‌గా చూపించారు. శివాజీ ప్రోమో ప్లే తర్వాత.. నాగార్జున ఆయననకు వేదికపైకి పిలిచాడు. ఎలా ఉన్నావు అంటే.. నిన్ను ఇక్కడ చూస్తానని అనుకోలేదు అని నాగ్ అన్నాడు. అయితే నాకు మొదటి చెక్ ఇచ్చింది మీరే.. సీతారాముల కల్యాణం సినిమా కోసం మీరు ఇచ్చారు. నా ఫస్ట్ ఇన్నింగ్స్ మొదలైంది అన్నపూర్ణ స్టూడియోలోనే.. రెండో ఇన్సింగ్స్ కూడా అన్నపూర్ణ స్టూడియోలోనే మొదలవుతున్నది అని శివాజీ ఎమోషనల్ అయ్యాడు.

మూడో కంటెస్టెంట్‌గా సింగర్ ధామిని:బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్‌లో మూడో కంటెస్టెంట్‌గా సింగర్ ధామిని ఇంట్లోకి అడుగుపెట్టారు. వేదిక మీద ఉన్న దామినిని నాగార్జున పలకరించారు. కొండపొలెం సినిమాలో పాట పాడినందుకు జాతీయ అవార్డు రావడంపై దామినికి కంగ్రాట్స్ చెప్పించారు. ఆ తర్వాత దామిని చేత పాట పాడించారు. దేవుడు అంటే.. నాకు చాలా ఇష్టం. మానవ సేవే మాధవ సేవ అని మీరు షిర్డి సాయిబాబు సినిమాలో చెప్పారని గుర్తు చేశారు. తాను రెండు సార్లు గుండు కొట్టించుకొన్నాను అని దామిని చెప్పారు. దామినికి గుండుతో ఉన్న ఫోటోను చూపించారు. అయితే నాగార్జున కోసం చిన్న బహుమతిని తీసుకొచ్చి అందజేశారు.

నాలుగో కంటెస్టెంట్‌గా ప్రిన్స్ యావర్:నాలుగో కంటెస్టెంట్‌గా ప్రిన్స్ యావర్ బిగ్‌బాస్ ఇంటిలోకి అడుగుపెట్టారు. మోడల్, ఫ్యాషన్ పర్సనాలిటీగా ఆయనకు పేరుంది. మంచి యూత్‌ఫుల్‌గా.. సిక్స్ ప్యాక్‌తో కండలు చూపిస్తూ సాహో సినిమాలోని పాటకు అమ్మాయిలతో డ్యాన్సులు చేస్తూ గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు. డ్యాన్స్ ఫెర్ఫార్మెన్స్ ముగిసిన తర్వాత వేదికపైన నాగార్జునను కలిశాడు. నాగార్జున వేదికపైకి వచ్చి.. ప్రిన్స్ యావర్‌ను పలికరించాడు. నేను మీకు పెద్ద ఫ్యాన్‌ను అంటూ చెప్పాడు. నాకు తెలుగు రాదు. ఇంగ్లీష్, హిందీ మిక్స్ చేసి మాట్లాడుతాను.. తప్పులుంటే క్షమించమని అడిగాడు. కంటెస్టెంట్‌గా వచ్చావు కానీ.. హౌస్‌మేట్‌గా కన్ఫర్మ్ కాలేదు అని యావర్‌కు షాకిచ్చాడు.

5వ కంటెస్టెంట్‌గా శుభ శ్రీ రాయగురు:బిగ్‌బాస్ తెలుగు 7 షోలోకి ఐదో కంటెస్టెంట్‌గా శుభ శ్రీ రాయగురు హౌస్‌లోకి అడుగుపెట్టారు. రూల్స్ రంజన్ సినిమాలో సమ్మోహనుడా అనే పాటతో ఎంట్రీ ఇచ్చారు. వేదికపై ఉన్న శుభశ్రీ రాయగురును నాగార్జున ప్రేక్షకులకు పరిచయం చేశారు. శుభ శ్రీ లాయర్.. కానీ యాక్టింగ్ కూడా చేస్తుంది అని చెప్పారు. చిన్నప్పుడు బాగా చదువుకునే దానిని. చదువు పూర్తయిన తర్వాత యాక్టింగ్, డ్యాన్సింగ్ నేర్చుకొన్నాను. మాస్ సినిమా సమయంలో అమ్మాయిలు మీరంటే పడిపోయేవారు అని చెప్పింది. నీకు బెడ్ లేదు.. నీవు కంటెస్టెంట్ మాత్రమే. హౌస్ మేట్ కాదు. పవర్ సూత్ర గెలుచుకొంటేనే నీకు బెడ్ దొరుకుతుందని చెప్పారు. అలా ఆమె ఇంటిలోకి అడుగుపెట్టింది.

6వ కంటెస్టెంట్‌గా షకీలా:బిగ్‌బాస్ ఇంటిలోకి యాక్టర్ షకీలా 6వ కంటెస్టెంట్‌గా ఇంటిలోకి అడుగుపెట్టారు. ఆమె ఆడియో విజువల్ ప్లే చేశారు. ఆమె ఏవీలో ఎమోషనల్‌గా మాట్లాడారు. షకీలాతో నాగార్జున మాట్లాడుతూ.. ఎందుకు బిగ్‌బాస్‌లోకి వచ్చావంటే.. ఈ షోకు రాక ముందు నా జీవితం వేరు. ఇప్పుడు నా జీవితం వేరు. నేనేంటో బిగ్‌బాస్ ద్వారా నిరూపించుకోవాలని అనుకొంటున్నాను అని షకీలా చెప్పారు. మిమ్మల్ని చూస్తుంటే.. అన్నమయ్యను చూసినట్టు ఉన్నారు అని అంటే.. నాగ్ ఎమోషనల్ అయ్యారు. ఈ వేదికపైన షకీలా పెంచే ఇద్దరు ట్రాన్స్‌జెండర్స్‌తో మాట్లాడించారు. దాంతో షకీలా ఆనందంలోను, కన్నీటి పర్యంతం అయ్యారు.

7వ కంటెస్టెంట్‌గా ఆట సందీప్:బిగ్‌బాస్ ఇంటిలోకి 7వ కంటెస్టెంట్‌గా ఆట సందీప్ ఇంటిలోకి అడుగుపెట్టాడు. మంచి జోష్‌తో పాటకు డ్యాన్స్ చేసిన వేదికపైకి వచ్చిన సందీప్‌ను నాగార్జున పలకరించాడు. కొరియోగ్రాఫర్, యాక్టర్, భర్త, తండ్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నావు. నీకు ఎలాంటి రోల్ అంటే ఇష్టం అంటే.. ఫస్ట్ కొరియోగ్రాఫర్, యాక్టర్ అని చెప్పాడు. తండ్రి, భర్తలో ఏ పాత్ర ఇష్టమంటే.. తండ్రిగానే ఇష్టపడుతాను అని చెప్పాడు. ఇప్పటికే ఒక రియాలిటీ షో గెలుచుకొన్నావు.. మళ్లీ మరో రియాలిటీ షోలోకి వచ్చావు అంటే.. అది కష్టపడి గెలిచాను. ఇప్పుడు కూడా మరింత కష్టపడుతాను అని ఆట సందీప్ చెప్పి ఇంటిలోకి అడుగుపెట్టాడు.

8వ కంటెస్టెంట్‌గా కార్తీకదీపం మోనిత:8వ కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్ 7 లోకి కార్తీక దీపం ఫేమ్ మోనిత పాత్రధారి శోభా శెట్టి ఇంట్లోకి అడుగుపెట్టింది. మంచి ఘాటైన సాంగ్‌కు స్టెప్పులేస్తూ స్టేజ్ మీద గ్లామర్‌తో ఆకట్టుకొన్నది. అనంతరం వేదికపైన నాగార్జునతో రొమాంటిక్‌గా ముచ్చటించింది. మోనిత ఎలా ఉన్నావు.. అంటే.. ఫైన్ అని చెప్పి.. ఐ లవ్ యూ అని చెప్పగానే.. ఐ లవ్ యూ టూ అని చెప్పాడు. మోనితగా వచ్చావా? శోభగా వచ్చావా అంటే..కార్తీకదీపంలో మోనిత నెగెటివ్ క్యారెక్టర్‌గా కనిపించాను. శోభగానే అడుగుపెడుతాను అని శోభా శెట్టి చెప్పింది.

9వ కంటెస్టెంట్‌గా టేస్టీ తేజ:బిగ్‌బాస్ తెలుగు 7 హౌస్‌లోకి యూట్యూబర్ టేస్టీ తేజ ఎంట్రీ ఇచ్చాడు. సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్‌ని బిల్డప్ ఇచ్చిన యూట్యూబర్.. మొరగని కుక్క లేదు.. తిట్టని నోరు లేదు.. మన పని మనం చేసుకొంటూ పోవాలి. అర్ధమైందా రాజా అంటూ వేదికపైకి వచ్చాడు. కన్నడ,తమిళ్, తెలుగు భాషల్లో షోలు చేసిన యూట్యూబర్ అని చెప్పుకొన్నాడు. మాది తెనాలి అంటూ ఏఎన్నాఆర్ గురించి ఏదో చెప్పబోతే నాగార్జున షాకిచ్చాడు.

10వ కంటెస్టెంట్‌గా రతిక: సోషల్ మీడియా ఇన్ల్పూయెన్సర్ రతిక బిగ్‌బాస్ తెలుగు 7లోకి అడుగుపెట్టింది. దసరా సినిమాలోని చమ్కీల అంగీలేసి పాటతో మంచి జోష్‌తో స్టెప్పులేసింది. వేదికపైకి రాగానే.. నాగార్జున పలకరిస్తూ.. బ్రేకప్ నుంచి బయటపడ్డావా? అంటూ ప్రశ్నిస్తే.. బయట పడ్డాను.. అందుకు మీరే కారణం..చేసిందంతా చేసి.. మీరే అడుగుతున్నారా? అంటూ రతిక షాకిచ్చింది. దాంతో నేనేమీ చేశానో చెప్పమంటే.. ఇంట్లోకి వెళ్లిన తర్వాత తెలుస్తుందని హౌస్‌లోకి అడుగుపెట్టింది.

11వ కంటెస్టెంట్‌గా డాక్టర్ గౌతమ్ కృష్ణ:బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ షోలో 11వ కంటెస్టెంట్‌గా డాక్టర్ గౌతమ్ కృష్ణ ఎంట్రీ ఇచ్చాడు. వృత్తిరీత్యా డాక్టర్ అయిన గౌతమ్.. ఆకాశ వీధుల్లో సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. చిన్నప్పటి నుంచి యాక్టర్ కావాలని ఉండేది. ఇంట్లో వాళ్లకు చెబితే.. చదువు పూర్తయితే గానీ..యాక్టర్ అవ్వడానికి సపోర్ట్ చేయమని అన్నారు. దాంతో నేను చదువు పూర్తి చేసి.. యాక్టర్‌ను అయ్యాను. నా మొదటి సినిమా మీ నటించిన మూవీ టైటిల్‌తోనే వచ్చింది.అప్పుడు కదుర్లేదు. ఇ్ప్పుడు కుదిరింది అంటూ గౌతమ్ కృష్ణ అన్నాడు.

12వ కంటెస్టెంట్‌గా కిరణ్ రాథోడ్:తెలుగు, తమిళ, హిందీ, మలయాళం సినిమాల్లో రాణించిన సీనియర్ హీరోయిన్‌గా ఆకట్టుకొన్న కిరణ్ రాథోడ్ బిగ్‌బాస్ తెలుగు 7 షోలోకి అడుగుపెట్టింది. తెలుగు రాదు కానీ.. తప్పకుండా నేర్చుకొంటాను అని అంటే.. శివాజీ మంచి తెలుగు టీచర్.. అతడితో కలిసి నేర్చుకో అని చెప్పింది. నాకు ఫోన్ లేకుండా, ఫ్యామిలీ లేకుండా ఉండటం కష్టం అని చెప్పి.. ఇంట్లోకి అడుగుపెట్టింది.

13వ కంటెస్టెంట్‌గా పల్లవి ప్రశాంత్:రౌతు బిడ్డ, యూట్యూబర్ పల్లవి ప్రశాంత్ బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ షోలోకి అడుగుపెట్టాడు. పేదరికంలో బతికి చచ్చిపోదామని అనుకొన్నాను. కానీ మా నాన్న నేను కూడా చనిపోతానంటే.. ఆ ప్రయత్నం విరమించుకొన్నాను అని ఏవీలో చెప్పాడు. అలాగే బిగ్‌బాస్ కోసం చాలా వీడియోలు చేశాను. దాంతోనే ఈ అవకాశం లభించింది అని చెప్పాడు. నాగార్జున కోసం తన పొలంలో పండిన వడ్లు, తన జన్మించిన నేల మట్టిని బహుమతిగా ఇచ్చాడు. అందుకు బదులుగా మిర్చి మొక్కను ఇచ్చాడు. మిర్చి వస్తే బెనిఫిట్ ఉంటుంది. మొక్క వాడితే.. జరిమానా ఉంటుంది అని నాగార్జున హెచ్చరించాడు.

14వ కంటెస్టెంట్‌గా అమర్‌దీప్:వాల్తేరు వీరయ్య.. పూనకాలు లోడింగ్ పాటతో వేదికపై జోష్ ప్రదర్శించాడు. బిగ్‌బాస్ ఇంటిలోకి 14వ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టాడు. వేదికపైకి రాగానే.. నీ ఫెర్ఫార్మెన్స్ బాగుంది అని నాగార్జున అన్నాడు. నీవు హై ఇన్‌ఫ్లేమబుల్ అంటా కదా అంటే.. అవును.. ఒక మాట అనడం వల్ల అలాంటి పేరు వచ్చింది. మీ సినిమా రక్షకుడు వల్లే అలాంటి పేరు వచ్చింది అని అమర్ దీప్ చెప్పాడు.

15వ కంటెస్టెంట్‌గా నవీన్ పొలిశెట్టి:బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్ అంతా ఉల్టాపుల్టా ఉంటుందని హోస్ట్ నాగార్జున చెబుతూనే ఉన్నాడు. ఆయన అన్నట్టుగానే రకరకాలుగా ట్విస్టులు ఇచ్చారు. అయితే 15వ కంటెస్టెంట్‌గా నవీన్ పొలిశెట్టిని ఇంట్లోకి పంపాడు. తాను బిగ్‌బాస్‌లోకి వెళ్లేందుకు రెడీ అని చెప్పాడు. అంతేకాకుండా బిగ్‌బాస్ గౌరవం తెచ్చిన షో.. బిగ్‌బాస్‌లోకి వెళ్లానని తెలుస్తే.. నాకు మా ఇంట్లో వేడి వేడి కాఫీ ఇస్తారు. మా వాచ్‌మెన్ కూడా హ్యాపీగా ఫీలవుతాడు అని నవీన్ చెప్పాడు. నవీన్ ఇంట్లోకి వెళ్లగానే నాగార్జున తాళం వేశాడు. 15 కంటెస్టెంట్ ఓ రూమ్‌లో ఉన్నాడని చెప్పి నాగార్జున గుడ్‌బై చెప్పాడు.బిగ్‌బాస్ తెలుగు 7 ప్రారంభ వేడుకలో నాగార్జున హిట్ సినిమాల పాటలతో కింగ్ అంటూ నాగార్జున హుందాగా వేదిక మీదకు వచ్చి.. తనదైన శైలిలో ఇంటిని చూపించడం జరిగింది. అనంతరం కంటెస్టెంట్లను ఒక్కొక్కరిని పరిచయం చేస్తూ కార్యక్రమాన్ని రక్తి కట్టించారు.

బిగ్‌బాస్ తెలుగు 7 ప్రారంభ వేదికపైకి ఖుషి సినిమా ప్రమోషన్స్ కోసం విజయ్ దేవరకొండ వేదికపైకి వచ్చాడు. విజయ్ దేవరకొండను పలకరిస్తూ.. మీ హీరోయిన్ సమంత రాలేదేంటి? అంటూ నాగార్జున ట్విస్ట్ ఇచ్చాడు. ఆ తర్వాత నవీన్ పోలిశెట్టి రిలీజ్ కాబోయే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ కోసం ప్రమోషన్ చేశాడు.


Click it and Unblock the Notifications











