Bigg Boss Telugu 7: బిగ్‌బాస్ తెలుగు 7 టాప్ 5 కంటెస్టెంట్స్ వీళ్లే... టైటిల్ విన్నర్ ఎవరంటే?

ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ ఎప్పటి కప్పుడు దేశ వ్యాప్తంగా సినీ తారలపై సర్వేలు నిర్వహిస్తుందనే విషయం తెలిసిందే. తాజాగా అయితే బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 టాప్ కంటెస్టెంట్స్ ఎవరు అనేది నిర్వహించింది. నవంబర్ 3వ తేదీ నుంచి నవంబర్ 10 వరకు నిర్వహించిన మోస్ట్ పాపులర్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లిస్టును రిలీజ్ చేసింది. ఇండియా వైడ్ గా నిర్వహించిన ఈ సర్వేలో టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు నిలిచారు.. మొదటి స్థానం కైవసం చేసుకుంది ఎవరు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఉల్టా పుల్టా అంటూ సాగుతూనే ఉంది. ఇప్పటికే ఈ సీజన్ చివరి దశకు చేరుకుంది. సెప్టెంబర్ 3న అట్టహాసంగా ప్రారంభం అయిన ఈ సీజన్... మొదటి విడుతలో 14మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు. ఇక ఐదో వారంలో వైల్డ్ కార్డు ఎంట్రీస్ ద్వారా మరో ఐదుగురు ఎంటర్ అయ్యారు. మరో ఒకరు రీ ఎంట్రీ ఇచ్చారు. ఇక మొత్తానికి ప్రస్తుతం హౌస్ లో 11 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు.

Bigg Boss Telugu 7 Ormax Survey: Top 5 Contestants Sivaji, Prashanth, Amardeep, Gautham, Shobha Full Details Here

మొదటి ఐదు వారాలు కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతికా రోజ్, శుభ శ్రీ ఎలిమినేట్ అయ్యారు. ఇక ఐదో వారంలో అర్జున్ అంబటి, నయని పవని, పూజా మూర్తి, అశ్విని శ్రీ, బోలే షవాలి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అడుగుపెట్టారు. ఇక వీరిలో పూజా మూర్తి, నయిని పవని ఎలిమినేట్ అయ్యారు. ఇక ఆ తర్వాత ఆట సందీప్, టేస్టీ తేజ ఎలిమినేట్ అయిపోయారు. ఇక ఈ వారం బోలే షవాలి ఎలిమినేట్ అయ్యారని తెలుస్తోంది.

బోలే ఎలిమినేట్ అయితే హౌస్ లో 10 మంది మాత్రమే ఉంటారు. శివాజీ, ప్రశాంత్, యావర్, గౌతమ్, శోభాశెట్టి, అశ్విని, ప్రియాంక, అమర్ దీప్, అర్జున్ అంబటి ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ పది మందిలో టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు అనేది ఆసక్తిగా మారింది. దీనిపై ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ సర్వే నిర్వహించింది. దేశ వ్యాప్తంగా సినీ తారలపై సర్వేలు నిర్వహించే ఈ సంస్థ.. ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పై సర్వే నిర్వహించింది.

Bigg Boss Telugu 7 Ormax Survey: Top 5 Contestants Sivaji, Prashanth, Amardeep, Gautham, Shobha Full Details Here

ఇక ఆర్మాక్స్ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. నవంబర్ 3వ తేదీ నుంచి నవంబర్ 10 వరకు నిర్వహించిన మోస్ట్ పాపులర్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లిస్టును రిలీజ్ చేసింది. అందులో ఐదవ స్థానంలో శోభా శెట్టి పేరు ఉండగా.. నాలుగవ స్థానంలో గౌతమ్ కృష్ణ పేరు ఉంది. ఇక మూడో స్థానంలో అమర్ దీప్ ఉండగా.. రెండో స్థానంలో పల్లవి ప్రశాంత్ పేరును చేర్చింది. ఇక మొదటి స్థానంలో శివాజీ నిలిచారు.

ఇక ఈ 11వ వారానికి శివాజీ కెప్టెన్ అయిన సంగతి తెలిసిందే. ఆయన ఇప్పటికే మైండ్ గేమ్ ఆడుతూ రాగా.. ఇప్పుడు ఫిజికల్ టాస్కులు కూడా ఆడుతున్నాడు. ఇక ఈ సారి సీజన్ విన్నర్ శివాజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయనకు నామినేషన్స్ లో అయినా.. ఏ సర్వేలో అయినా టాప్ ఓటింగ్ వస్తుంది. ఇక ఈ సారి సీజన్ విన్నర్ శివాజీ అనడంలో సందేహం లేదని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరగనుందో. మరో ఐదు వారాల్లో ఈ ఆటకు ముగింపు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X