Bigg Boss Telugu 7: టాప్ 5 ఫైనలిస్ట్ కంటెస్టెంట్స్ వీళ్లే... విన్నర్, రన్నర్ ఎవరు కానున్నారంటే?

ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ ఎప్పటి కప్పుడు దేశ వ్యాప్తంగా సినీ తారలపై సర్వేలు నిర్వహిస్తూ.. ఆ జాబితాను రిలీజ్ చేస్తూ ఉంటుంది. తాజాగా అయితే బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు అనే వివరాలను వెల్లడించింది. డిసెంబర్ 2వ తేదీ నుంచి డిసెంబర్ 8వ తేదీ వరకు నిర్వహించిన మోస్ట్ పాపులర్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ టాప్ 5 లిస్టును రిలీజ్ చేసింది. ఇండియా వైడ్ గా నిర్వహించిన ఈ సర్వేలో టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు.. మొదటి స్థానం కైవసం చేసుకున్నారు.. రన్నరప్ ఎవరు అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఉల్టా పుల్టా అంటూ సెప్టెంబర్ 3న ప్రారంభం అయి ఆసక్తిగా సాగుతుంది. ఇప్పటికే ఈ సీజన్ 14వారాలు పూర్తి చేసుకుంది. మరో వారం రోజుల్లో ఎవరు విన్నర్ అనేది స్పష్టత వచ్చేస్తుంది. ఇప్పటికే విన్నర్ ఓటింగ్ లైన్స్ మొదలయ్యాయి. అభిమానులు, ప్రేక్షకులు తమకు నచ్చిన కంటెస్టెంట్స్ కు ఓట్లు వేస్తున్నారు. ఇక ఈ షో సెప్టెంబర్ 3న అట్టహాసంగా ప్రారంభం అయి వారం వారం ట్విస్టులు, షాకులు ఇస్తూ ప్రేక్షుకలకు థ్రిల్ కలిగిస్తుంది.

 Bigg Boss Telugu 7 Ormax Survey: Top 5 Contestants Sivaji, Prashanth, Amardeep, Priyanka, Arjun Full Details Here

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో మొదటి విడుతలో 14మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టగా... ఇక ఐదో వారంలో వైల్డ్ కార్డు ఎంట్రీస్ ద్వారా మరో ఐదుగురు ఎంటర్ అయ్యారు. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టగా.. ప్రస్తుతం హౌస్ లో 7 మంది ఉన్నారు. ఇప్పటి వరకు హౌస్ నుంచి కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతికా రోజ్, శుభ శ్రీ, నయని పవని, పూజా మూర్తి, ఆట సందీప్, టేస్టీ తేజ, రతికా రోజ్, అశ్విని శ్రీ, గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ అయ్యారు.

ఇక 14వ వారంలో శోభాశెట్టి ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హౌస్ లో 6 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ప్రశాంత్, శివాజీ, అమర్ దీప్, యావర్, ప్రియాంక జైన్, అర్జున్ అంబటి ఉన్నారు. వీరిలో ఇప్పటికే అర్జున్ అంబటి ఫస్టు ఫైనాలిస్టు అయ్యాడు. సెకండ్ ఫైనాలిస్టుగా ఈ ఆదివారం ఎపిసోడ్ లో ప్రియాంక జైన్ కానుందని తెలుస్తోంది. ఇక ఈ టాప్ 6లో ఎవరు టాప్ 5 కంటెస్టెంట్స్ అవుతారు అనేది ఆసక్తిగా మారింది.

ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ బిగ్ బాస్ టాప్ కంటెస్టెంట్స్ పై సర్వే నిర్వహించింది. దేశ వ్యాప్తంగా సినీ తారలపై సర్వేలు నిర్వహించే ఈ సంస్థ.. ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పై సర్వే చేసి... జాబితాను రిలీజ్ చేసింది. ఇక ఆర్మాక్స్ డిసెంబర్ 2వ తేదీ నుంచి డిసెంబర్ 8 వరకు నిర్వహించిన మోస్ట్ పాపులర్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లిస్టులో టాప్ 5 కంటెస్టెంట్ లిస్టును రిలీజ్ చేసింది.

టాప్ 1లో శివాజీ ఉండగా.. టాప్ 2లో పల్లవి ప్రశాంత్ ఉన్నాడు. ఇక టాప్ 3లో అమర్ దీప్ నిలవగా.. టాప్ 4లో ప్రియాంక జైన్, టాప్ 5లో అర్జున్ అంబటి ఉన్నాడు. ఇక ఈ సారి సీజన్ విన్నర్ శివాజీ లేదా ప్రశాంత్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X