Bigg Boss Telugu 7: పాపం పల్లవి ప్రశాంత్.. సీరియల్ గ్రూప్ గేమ్ తో మరోసారి అయిపోయాడుగా!

Bigg Boss Telugu 7: బిగ్ బాస్ తెలుగు 7 2.0 రోజురోజుకూ అత్యధిక టీఆర్పీని సొంతం చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. నిన్న మొన్నటి వరకు గ్రహాంతర వాసుల టాస్క్ ఇచ్చిన బిగ్ బాస్ ఇప్పుడు మరో కిటుకు పెట్టాడు. దీని వల్ల ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఎవరెవరు గ్రూపుగా గేమ్ ఆడుతున్నారో తెలిసిపోయింది. ముఖ్యంగా సీరియల్ బ్యాచ్ వల్ల శివాజీ, ప్రిన్స్, పల్లవి ప్రశాంత్ లు తీవ్రంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి సీరియల్ నటుల అటాక్ అతడిపై స్టార్ట్ అయిపోయింది.

ముందుగా అమర్ దీప్ ఫస్ట్ వీక్ ఎలిమినేష్ లో పల్లవి ప్రశాంత్ ను పాయింట్ అవుట్ చేయగా.. ఆ తర్వాత శోభా శెట్టి, ప్రియాంక జైన్ లు కూడా అతగాడినే నామినేట్ చేశారు. వీరి బ్యాచ్ లోనే ఆట సందీప్ కూడా కలిసిపోయాడు. వీరు నలుగురూ చాలా వరకు కలిసే అన్ని గేములు ఆడారు. ఈమధ్యే వీరు కాస్త వేరుగా ఆడుతున్నారని అనుకునేలోపే మళ్లీ తమ గ్రూప్ గేమ్ గురించి అందరికీ తెలిసేలా చేసుకున్నారు. ఇటీవల స్విమ్మింగ్ పూల్ టాస్కులో వారిని గెలిపించేందుకు అమర్ దీప్ చాలానే కష్ట పడ్డాడు. కావాలనే ఓడిపోయాడు.

 Bigg Boss Telugu 7 Pallavi Prashanth Lost his Contendor Ship Due to Serial Actors Group Game

తాజాగా మరోసారి పల్లవి ప్రశాంత్ పై సీరియల్ గ్రూపు నటులు అటాక్ చేశారు. తాజాగా వచ్చిన ప్రోమే చూస్తుంటే ఈ విషయం అర్థం అయిపోతుంది. ఎవర్ని కంటెండర్ షిప్ నుంచి తొలగించాలనుకుంటున్నారో కారణాలు చెబుతూ... వారి ఫొటోలను స్విమ్మింగ్ పూల్ లో వేయాల్సిందిగా చెప్పారు. దీంతో అందరూ వారికి నచ్చని వారి ఫొటోలను స్విమ్మింగ్ పూల్ లో వేశారు. ముందుగా వచ్చిన పూజా మూర్తి.. పల్లవి ప్రశాంత్ ఫొటోను తీసి స్విమ్మింగ్ పూల్ లో వేసింది. అయితే ఇప్పటికే పల్లవి ప్రశాంత్ చాలా సార్లు కంటెండర్ షిప్ పొందడం వల్లే... ఒక్కసారి కూడా ఛాన్స్ రాని వారికి అవకాశం కోసం ఇలా చేస్తున్నట్లు చెప్పింది.

ఇందుకు ప్రశాంత్... ఒక్కసారి గెలిస్తే మళ్లీ గెలవొద్దా, మళ్లీ కంటెండర్ షిప్ వద్దా అంటూ ఫైర్ అయ్యాడు. ఈసారి కాప్టెన్సీ టాస్కులో పార్టిసిపేట్ చేయలేకపోతున్నందుకు తెగ ఫీల్ అయిపోతున్నారు. ఈ ప్రోమో చూస్తుంటే సీరియల్ గ్రూప్ అంతా రైతుబిడ్డపై కక్ష కట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు ఎప్పటిలాగే ప్రిన్స్ యావర్ ప్రియాంక్ జైన్ ఫొటోను స్విమ్మింగ్ పూల్ లో వేశాడు. నీవు అమర్ కలిసి ఆడుతున్నావన్న విషయాన్ని ముక్కుసూటిగా చెప్పాడు. ఆయన చెప్పిన దాంట్లో వంద శాతం నిజం ఉందని అంతా అనుకుంటున్నారు.

 Bigg Boss Telugu 7 Pallavi Prashanth Lost his Contendor Ship Due to Serial Actors Group Game

మరోవైపు శోభా శెట్టి అశ్వినీ శ్రీ ఫొటో చాలా కోపంగా స్విమ్మింగ్ పూల్లో వేసింది. అది చూసిన అశ్విని.. ఇది చూస్తుంటేనే నీకు నాపై ఎంత కోపం ఉందో తెలుస్తుందంటూ చెప్పుకొచ్చింది. మరోవైపు అమర్ దీప్ కూడా ఎప్పటిలాగే శివాజీ ఫొటోను తీసుకెళ్లి పూల్ లో వేశాడు. ఇలా సీరియల్ బ్యాచ్ అంతా కలిసి ఇతర కంటెస్టెంట్లపై తమ ప్రతాపాన్న చూపిస్తున్నారు. మరి ముందు ముందు ఏం జరగనుందో తెలియాలంటే కచ్చితంగా రాబోయే అన్ని ఎపిసోడ్లు చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X