Bigg Boss Telugu 7: బిగ్ బాస్ స్టేజీపై పాయల్ పరువాలు.. నాగినీ డ్యాన్స్ తో కిక్కెక్కిస్తున్న కంటెస్టెంట్లు

Bigg Boss Telugu 7: బిగ్ బాస్ బాస్ తెలుగు 7 రిటాల్టీ షో ఏడో వారం కూడా అద్భుతంగా సాగుతోంది. అద్భుతమైన టాస్కులు, అంతకు మించిన ఎమోషన్స్ తో కంటెస్టెంట్లు ఇంట్లో కొనసాగేందుకు చాలా కష్టపడుతున్నారు. ముఖ్యంగా వీకెండ్స్ లో నాగార్జున చెప్పే పాయింట్లను మనసులో ఉంచుకొని తదుపరి వారం తమ ఆటన తీరును మెరుగు పరుచుకుంటున్నారు. అయితే శనివారం రోజు ఎపిసోడ్ లో అందరిపై ఫైర్ అయిన నాగార్జున.. సండే ఫన్ డేలో ఫన్నీ టాస్కులను ఇచ్చారు. అలాగే విజయదశమి కానుకగా ఓ అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు.

తాజాగా విడుదల అయిన ప్రోమో చూస్తుంటేనే ఆ విషయం అర్థం అయిపోతుంది. అలాగే ఈరోజుటి ఎపిసోడ్ లోనే రతిక రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈరోజు నాగార్జున స్టేజీపై చాలా సందడి చేశారు. అదిరిపోయే డ్యాన్సుతో ఎంట్రీ ఇచ్చిన ఆయన.. షోలో ఈరోజు ఎన్నెన్నో స్పెషల్స్ పర్ఫార్మెన్స్ లను చేయించబోతున్నారు. దసరా సందర్భంగా పలువురితో డ్యాన్సులు చేయించి, పాటలు పాడించబోతున్నారు. ముఖ్యంగా బిగ్ బాస్ ఇంట్లోని వారంతా బతుకమ్మ సంబురాలు చేశారు. అంతా కలిసి బతుకమ్మ ఆట ఆడారు. ఆ తర్వాత వాటిని నిమజ్జనం కూడా చేశారు.

Bigg Boss Telugu 7 Payal Rajput Special Dance on Bigg Boss Stage in Sunday Episode

ఈక్రమంలోనే నాగార్జున హౌస్ లోని కంటెస్టెంట్లతో డ్యాన్సులు చేయించారు. ప్రియాంక, శోభా శెట్టిలతో చేయించిన నాగినీ డ్యాన్స్ అయితే అదిరిపోయింది. అలాగే అర్జున్ అంబటి, అశ్వినీ శ్రీ వెయ్ రా చెయ్ వెయ్ రా పాటకు చేసిన పోల్ డ్యాన్స్ అయితే అందరినీ ఆకట్టుకుంటోంది. ఆ తర్వాత ఇంట్లోని వాళ్లందరితో వివిధ టాస్కులు ఆడించిన తర్వాత... టేస్టీ తేజ ఏ డిజైన్ టాటూ వేసుకుంటాడో అడిగాడు నాగ్. అలాగే శోభ పేరుకు బదులుగా బుజ్జమ్మ అని వేసుకోవాలని సూచించాడు. కానీ తేజ మాత్రం బుజ్జి + అమ్మలో ఓన్లీ అమ్మ వేయించుకుంటానంటూ కామెడీ చేశాడు.

ఆ తర్వాత స్టేజీపై ఓ స్పెషల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తో పాయల్ రాజ్ పుత్ ఎంట్రీ ఇచ్చింది. బ్లాక్ డ్రెస్సులో ఓ అదిరిపోయే పాటకు స్టెప్పులు వేసింది. తన అందం, డ్యాన్సుతో అందరినీ అలరించింది. అయితే పాయల్ రాజ్ పుత్ బిగ్ బాస్ స్టేజీపైకి వచ్చి డ్యాన్స్ చేయడం చూస్తుంటే.. ఆమె సినిమా ప్రమోషన్ లో భాగంగానే వచ్చినట్లు తెలుస్తోంది. ఆమె తాజాగా చేసిన చిత్రం మంగళవారం. ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ అదిరిపోయే క్యారెక్టర్ లో నటించింది.

పాయల్ రాజ్ పుత్ డ్యాన్స్ తర్వాత బిగ్ బాస్ ఇంట్లోని కంటెస్టెంట్లకు... వారి ఇంటి నుంచి వచ్చిన లెటర్స్ ను అందజేశాడు నాగార్జున. ముఖ్యంగా శోభాశెట్టి, టేస్టీ తేజ, అమర్ దీప్ లు లెటర్లు చదువుతూ చాలా ఎమోషనల్ అయ్యారు. యావర్ కు అయితే వారి కుటుబ సభ్యులు దాదాపు 6 పేజీల వరుకూ రాసిన లేఖ చూసి తేజ కామెడీ చేశాడు. కానీ ఆ లెటర్ చదివిన యావర్ కన్నీటి పర్యంతం అయ్యాడు. దసరా కానుకగా.. ఇంట్లోకి మరో కంటెస్టెంట్ రీఎంట్రీతో ప్రోమో పూర్తి అవుతుంది. ఈరోజు ఎపిసోడ్ చూస్తే తప్ప ఏం జరిగిందో తెలియదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X