బిగ్‌బాస్‌ నుంచి బయటకు రాగానే పెళ్లన్నాడు.. ఇప్పుడేమో నీళ్లు నములుతున్నాడు.. రొమాంటిక్ కపుల్‌కు బ్రేకప్ తప్పదా

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షోలో కంటెస్టెంట్ గా వచ్చిన సీరియల్ హీరోయిన్ ప్రియాంక జైన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. షో ప్రారంభం అయిన మొదటి రోజే హౌస్ లో అడుగు పెట్టిన ఈమె అద్భుతమైన ఆట తీరుతో టాప్ 6 కంటెస్టెంట్ గా మారిపోయింది. మరో వారం రోజుల్లోనే ఈ షో ముగుస్తుండగా.. ఎవరు విన్నర్, ఎవరు రన్నరప్ అవుతారని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే ప్రియాంక జైన్ లవర్ శివ్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని షాకింగ్ కామెంట్లు చేశారు. ముఖ్యంగా ప్రియాంకతో పెళ్లి గురించి ఎవరూ ఊహించని సమాధానాలు చెప్పారు. అయితే ఆయన ఏం చెప్పారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

బిగ్ బాస్ తెలుగు 7షో 10వ వారంలో భాగంగా జరిగిన ఫ్యామిలీ వీక్ లో శివ్ కుమార్.. ప్రియాంక కోసం ఇంట్లో అడుగు పెట్టాడు. తన ప్రియుడిగా, పెళ్లి చేసుకోబోయేవాడిగా వచ్చి అందరికీ షాకిచ్చాడు. అప్పటి వరకూ రివీల్ కాని వీరి ప్రేమాయణం బిగ్ బాస్ వేధికగా వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా ఆయన వచ్చినప్పటి నుంచి ప్రియాంక జైన్ ను పట్టుకునే ఉన్నాడు. ఆమెపై విపరీతమైన ప్రేమను కురిపించాడు. ముఖ్యంగా ముద్దుల మీద ముద్దులు పెడుతూ.. ఫుల్ రొమాంటిక్ గా కనిపించాడు. అయితే బిగ్ బాస్ షోలేనే ప్రియాంక జైన్.. శివ్ ను పెళ్లెప్పుడు చేసుకుందాం అని అడిగింది. దానికి అతడు బయటకు రాగానే చేస్కుందాం అని చెప్పాడు.

Bigg Boss Telugu 7 Priyanka Jain Lover Shiv Kumar Shocking Comments About Thier Marriage Check Details

అయితే తాజాగా ప్రియంక జైన్ ప్రేమికుడు ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వూ ఇచ్చాడు. ఇందులో పాల్గొని షాకింగ్ కామెంట్లు చేశాడు. ముందుగా యాంకర్.. ప్రియాంక ప్రేమికుడు అని చెప్పాలా, కాబోయే వాడు అనాలా అంటే.. ఫ్రెండ్ అని చెప్పండంటూ చెప్పి అందరికీ షాకిచ్చాడు. ఏంటి మీరు లవర్స్ కదా.. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు, డైరెక్ట్ గా షోలోనే ప్రియాంక పెళ్లెప్పుడు చేస్కుందాం అంటే బయటకు రాగానే అన్నారు కదా అంటూ యాంకర్ అడిగాడు. దానికి శివ్ కుమార్.. అవును కానీ పెళ్లెప్పుడు ఉంటుందో నాకు తెలియదు అన్నాడు.

అంటే ప్రియాంక జైన్ ను మీకు పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదా అని యాంకర్ అడగ్గా... అలా ఏం లేదు కానీ నేను ప్రస్తుతం బిజీగా ఉన్నాను.. అలాగే ప్రియాంక కూడా బిగ్ బాస్ షోలో ఉండి చాలా చక్కగా ఆడుతుంది.. టాప్ 5 కి కూడా వచ్చింది... ఆమె బయటకు వచ్చాకే మా పెళ్లి జరుగుతుందా లేదా అనేది తెలుస్తుందంటూ చెప్పిన విధానం చూస్తుంటే ఆనయకు ప్రియాంక జైన్ ను పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదేమో అనిపించింది. ఇంటర్వ్యూ మొదట్లో ఇలా షాకింగ్ కామెంట్లు చేసిన అతడు.. తీరా చివర్లో ఎవరూ ఊహించని సమాధానాలు చెప్పాడు.

Bigg Boss Telugu 7 Priyanka Jain Lover Shiv Kumar Shocking Comments About Thier Marriage Check Details

నా జీవతంలో ప్రేమ అయినా పెళ్లి అయినా ఒకే అమ్మాయితో కావాలని అనుకున్నాను.. నాకు ప్రియాంక అంటే చాలా ఇష్టం అంటూ చెప్పుకొచ్చాడు. ఆమె బయటకు వచ్చాకా పెళ్లి చేసుకుందామని అంటే చేసుకుంటాం.. లేదంటే లేదు అంటూ వివరించాడు. అంటే ప్రియాంక ఏం చెబితే అదే ఆయన ఫాలో అవుతారని అర్థం అవుతోంది. చూడాలి మరి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రాగానే ఈ జంట పెళ్లి చేసుకుంటుందా... లేక మరింత కాలం ఆగుతారా అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X