Priyanka Jain: "మా అమ్మ పరిస్థితి మరీ దిగజారిపోయింది, అందుకే ఆమెకు ఇష్టం లేకున్నా అలా చేస్తున్నాం"

మొనగారం సీరియల్ తో తెలుగు బుల్లితెర ప్రేక్షకుల మనసు దోచిన ముద్దుగుమ్మ ప్రియాంక్ జైన్ గురంచి అందరికీ తెలిసిందే. అలా వచ్చిన ఫేమ్ తోనే బిగ్ బాస్ తెలుగు 7 కంటెస్టెంట్ గా వెళ్లి మరింత గుర్తింపు తెచ్చుకుంది. అయితే బిగా బాస్ నుంచి వచ్చాకా తన తల్లి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని షాక్ అయింది. ఆమెకు క్యాన్సర్ వచ్చిందని తెలిసి కన్నీటిపర్యంతం అయింది. అయితే తాజాగా ఈమె మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. తన తల్లి ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారిందని పేర్కొంది. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మౌనరాగం సీరియల్ మాత్రమే కాకుండా జానకి కలగనలేదు వంటి మరో అద్భుతమైన సీరియల్ లో నటించి ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఈమె ఇటీవల బిగ్ బాస్ తెలుగు 7 షోకి వెళ్లి చక్కగా గేమ్ ఆడింది. టాస్క్ లతో పాటు మెంటల్ గా చక్కగా గేమ్ ఆడి టాప్ 5కి చేరుకుంది. అలాగే అక్కడ ఉండగానే తన ప్రేమ గురించి లివింగ్ రిలేషన్ గురించి వెల్లడించింది. తన ప్రియుడిని అందిరకీ పరిచయం చేసింది. బయటకు వచ్చాకా పెళ్లి కూడా చేసుకుంటామంటూ ప్రకటించింది. అయితే బయటకు వచ్చాకా మాత్రం పెళ్లి గురించి ఊసెత్తట్లేదు.

Bigg Boss Telugu 7 Priyanka Jain Released A Video About Her Mother Health Condition Serious Check Details

అందుకు కారణాలు కూడా చాలనే ఉన్నాయి. నిజ జీవితంలో ఎన్నో కష్టాలు పడిన ప్రియాంక జైన్.. తన తల్లిదండ్రుల కోసం ఓ ఇల్లు కొనివ్వాలనుకుంటున్నానని.. ఆ తర్వాతే పెళ్లి చేసుకుంటానని ఇటీవలే క్లారిటీ ఇచ్చింది. అయితే తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా మరో షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. తన తల్లి ఆరోగ్య పరిస్థితి గురించి స్పష్టం చేసింది. ఇటీవలే తన తల్లికి క్యాన్సర్ వచ్చిందని చెప్పిన ఈమె.. ఇప్పుడు ఆమె ట్రీట్ మెంట్ గురించి అప్ డేట్ ఇచ్చింది.

ఇటీవలే ఓసారి ప్రియాంక జైన్ తల్లికి ఆపరేషన్ చేయించగా.. మరోసారి ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని.. ఇప్పుడు ఆమెకు మరోసారి ఆస్పత్రికి తీసుకు రావాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. ఈక్రమంలోనే ఆమెకు తాజాగా కీమో థెరఫీ చేయిస్తున్నామని.. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదంటూ కన్నీటి పర్యంతం అయింది. పక్కనే ఉన్న ఆమె ప్రియుడు శివ్ కుమార్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రియాంక జైన్ ను ఓదార్చాడు.

Bigg Boss Telugu 7 Priyanka Jain Released A Video About Her Mother Health Condition Serious Check Details

తన తల్లికి చిన్నప్పటి నుంచి జుట్టు అంటే చాలా ఇష్టం అని.. కానీ ఇప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా కీమో థెరఫీ చేయించాల్సి వస్తోందని.. దీని వల్ల ఆమె జుట్టు అంతా ఊడిపోతుందని ఆవేదన వ్యక్తం చేసింది. ఆమెకు ఇష్టం లేకపోయినా.. ఆమె ఆరోగ్యం కోసం ఇలా చేయాల్సి వస్తుందని.. తల్లిని అలా చూసి తట్టుకోలేకపోతున్నానని బాధ పడింది. అయితే ఇవన్నీ వీడియోలో చెప్పడానికి కారణం.. అదే తమ పని అని.. తన తల్లికి ట్రీట్ మెంట్ చేయించాలంటే డబ్బులు కావాలని.. అందుకే వీడియోలు చేస్తున్నానని వివరించింది. చాలా మంది తప్పుగా మాట్లాడుతున్నారని.. కాస్త అర్థం చేసుకుని మెలగమంటూ అర్థించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X