Bigg Boss Telugu 7: ఒక మొక్కను చూసుకోలేనోడివి నువ్వేం రైతు బిడ్డా... నిజమే కదా బాసూ?

బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభం అయి రెండు వారాలు దాటింది. ఇక ఈ సీజన్లో ట్విస్టులు, టాస్కులతో సాగిపోతుంది. ఇక వీకెండ్ వచ్చేసరికి అంతా కలర్ ఫుల్ గా మారిపోతుంది. శని, ఆదివారాలు మాత్రం ప్రేక్షకులను అలరించేందుకు ఫుల్ గా రెడి అయి... కంటెస్టెంట్స్ మధ్య ఎన్ని గొడవలు ఉన్నా.. కూర్చొని నాగార్జున కోసం ఎదురు చూస్తారు. ఇక తాజాగా విడుదలఅయిన ప్రోమోలో నాగార్జున అమర్ దీప్ కు క్లాస్ ఇవ్వడం... మరోవైపు రైతు బిడ్డకు షాకింగ్ పంచ్ ఇవ్వడం హైలెట్ గా నిలిచింది. ఆ వివరాల్లోకి వెళితే...

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 తాజా ప్రోమో రిలీజ్ అయింది. ఇక ఈ ప్రోమోలో నాగార్జున కంటెస్టెంట్స్ ను అల్లాడించాడు. ఈ సారి కూడా చాలా మందికి క్లాస్ ఇచ్చినట్లు ప్రోమో చూస్తే అర్థం అవుతుంది. ఇక ప్రోమోలో ముఖ్యంగా అమర్ దీప్, శివాజీ, పల్లవి ప్రశాంత్‌ ను వాయించేశారు నాగార్జున. ఇక ప్రోమోలో మొదట శివాజీ పెర్ఫామెన్స్ గురించి ఆరా తీశాడు.

 Bigg Boss Telugu 7:

శివాజీ... మాటిమాటికి తలుపు తీయరా సామీ వెళ్లిపోతాను అంటూ అనడంపై గట్టిగానే సీరియస్ అయ్యారు నాగార్జున. ఎంతసేపు తలుపు తీయడం ఒకసారి పులిని రైడ్ చేసినప్పుడు చేస్తూనే ఉండాలి.. మధ్యలో దూకేయకూడదంటూ శివాజీకి సలహా ఇచ్చారు. ఇక ఆ తర్వాత షకీలా పెర్ఫామెన్స్ గురించి మాట్లాడారు నాగార్జున. ఎక్కువగా నా వయసుకి తగ్గట్లు ఆడుతున్నాను అంటున్నావ్.. కానీ వయసు అనేది మైండ్‌ కి ఉంటుంది బాడీకి కాదంటూ బూస్ట్ ఇచ్చారు నాగార్జున.

ఇక ప్రియాంక జైన్‌కి అయితే నాగార్జున కింగ్స్ మీటర్‌ లో మరీ ఘోరంగా ముల్లు కిందకి దించేశారు. ఇక ఈరోజు రిలీజ్ చేసిన ప్రోమోలో బాగా హైలెట్ అయిన విషయం అమర్ దీప్ గురించి నాగార్జున మాట్లాడటం. అమర్ దీప్. లాస్ట్ వీక్ ఆడియన్స్ డిజప్పాయింట్ చేశావ్.. ఈసారి ఏంటి మరి అని నాగార్జున అడగ్గా... బానే ఆడాను సార్.. ఇంకా ఆడాలి అంటూ అమర్ కవర్ చేశాడు.

 Bigg Boss Telugu 7:

ఇక ప్రశాంత్ నామినేషన్ చేసినప్పుడు అమర్ చెప్పిన థియరీ గురించి మాట్లాడారు. ఒక రైతు బిడ్డ వెళ్లి రైతు బిడ్డకే ఇవ్వాలని ఏముంది సార్ అని అమర్ అనగా... దీంతో నాగార్జున ఫైర్ అయ్యారు. అది అతని ఇష్టం.. అతని సంపాదన.. మధ్యలో నీకేంటి అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇక ప్రోమో చివరిలో పల్లవి ప్రశాంత్‌ కు సైతం గట్టిగానే క్లాస్ ఇచ్చారు. నీ పెర్ఫామెన్స్ మీద నీ అంచనా ఏంటి అని నాగార్జున అడిగితే మనోడు గ్రీన్ దగ్గర పెట్టాలి సార్ ముళ్లు అన్నాడు.

 Bigg Boss Telugu 7:

నాగార్జున దాన్ని రెడ్‌ లో పెట్టి దిమ్మ తిరిగే సమాధానం చూపించారు. ప్రశాంత్.. ఓ రైతు బిడ్డ అని నేను గర్వంగా చెప్పుకున్నాను.. కానీ నువ్వు చేసిందేంటి అంటూ ఇచ్చిపడేశారు. ప్రశాంత్‌ కు హౌస్‌లోకి వెళ్లేటప్పుడు ఇచ్చిన మొక్కను తెప్పించి దీన్ని జాగ్రత్తగా చూసుకోమంటే నువ్వు చేసింది ఇదా.. అంటూ ఫైర్ అయ్యారు. ఒక మొక్కని చూసుకోలేనివాడు రైతు బిడ్డా అంటూ చెప్పుకొచ్చాడు.ఇక ఈ ప్రోమో చూసిన నెటిజన్స్ సైతం... నిజమే కదా అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X