Bigg Boss Telugu7: రాధికలా మారిన రతిక... అప్పుడు ప్రశాంత్, ఇప్పుడు ప్రిన్స్... ఏందమ్మా ఈ పులిహోర?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ప్రారంభం అయి రెండు వారాలకు దగ్గరవుతుంది. ఇక రోజు రోజుకు బిగ్ బాస్ షో ఆసక్తికరంగా సాగుతోంది. ఇక బిగ్ బాస్ హౌజ్ లో కపూల్స్ ఉండటం, ప్రేమ ట్రాక్ లు నడవడం సహజం. ప్రతి సీజన్ లో ఏదో ఒక జంట లవ్ ట్రాక్ నడుపుతుంది. ఈ సారి అంతా పల్లవి ప్రశాంత్, రతిక కాస్త లవ్ ట్రాక్ లా అనిపించింది. ఇక రెండో నామినేషన్స్ లో కథ రివర్స్ అయింది. ఇప్పుడు మరో ట్రాక్ నడుస్తోందని అనిపిస్తుంది. రతిక డీజే టిల్లు హీరోయిన్ రాధికాలా ప్లేటు ఫిరాయించింది. పూర్తి వివరాల్లోకి వెళితే....
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఉల్టా పుల్టా అంటూ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఇక అందుకు తగ్గట్లే ప్రేక్షకుల ఊహకు అందకుండా టాస్కులు, గేమ్స్ జరుగుతున్నాయి. ఇక పవర్ అస్త్ర, మాయ అస్త్ర అంటూ గేమ్స్ పెడుతూ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మధ్య చిచ్చు పెడుతూనే ఉన్నాడు. ఇక 14 మంది కంటెస్టెంట్స్ లోపలికి వెళ్లగా.. ఒక వికెట్ కిరణ్ రాథోడో ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక 13మందితో బిగ్ బాస్ ఎంటర్ టైన్ చేయిస్తున్నాడు.

ఇక ప్రతీ బిగ్ బాస్ సీజన్లో ఇద్దరు కంటెస్టెంట్స్ తో లవ్ ట్రాక్ ను నడిపించే ప్రయత్నం చేస్తాడు బిగ్ బాస్. ఇక బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభమయ్యి దాదాపు రెండు వారాలు అవుతుంది. అయితే మొదట్లో రతిక, పల్లవి ప్రశాంత్ ఒక పెయిర్ అనిపించేలా చూపించారు. ఇక వీరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని అనుకునే లోపు ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. రెండోవారం నామినేషన్స్‌లో వీరిద్దరి మధ్య జరిగిన గొడవ వల్ల పూర్తిగా వీరిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మానేశారు.
ఇక తాజాగా విడుదలయిన బిగ్ బాస్ ప్రోమో గమనిస్తే... ప్రిన్స్ యావర్.. రతికతో కనెక్ట్ అయినట్టుగా చూపిస్తున్నారు. దీంతో మరో లవ్ ట్రాక్ సిద్ధమవుతుందా? లేదా డ్రామానా అని ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే రతిక.. డీజే టిల్లు హీరోయిన్ రాధికలా మారిందని కొంత మంది కామెంట్ చేస్తున్నారు. అప్పుడేమో పల్లవి ప్రశాంత్ తో పులిహోర కలిపి... ఇప్పుడు ఈ ప్రిన్స్ తో పులిహోర కలుపుతుందని అంటున్నారు.

ఇక తాజాగా విడుదల అయిన ప్రోమో చూస్తే... రతిక, ప్రిన్స్ యావర్ మధ్య ప్రేమ సంభాషణతో మొదలయ్యింది. బిగ్ బాస్ తో మాట్లాడిన తర్వాత కూల్ అయ్యాడని రతిక యావర్ ను ఉద్దేశించి చెప్తుంది. ఆ మాటకు ఐ లైక్ యూ రతిక అంటాడు ప్రిన్స్. రతిక కూడా ఐ లైక్ యూ టూ అంటూ ప్రేమగా చెప్తుంది. యావర్ ను అన్వర్ అని పిలుస్తూ ఏమవుతుంది అని అడిగింది రతిక. దానికి సమాధానంగా 'ప్రేమ బయటికొస్తుంది' అంటాడు ప్రిన్స్.

ఇక ఈ సీన్స్ అంతా శివాజీ, పల్లవి ప్రశాంత్ ముందే జరుగుతుంది. మరోవైపు పల్లవి ప్రశాంత్ దీనంగా చూస్తూ ఉండిపోతాడు. ఈ ప్రోమోకు ఒక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వేసి.. మామూలుగా ఉన్న ప్రోమోను లవ్ ఫీల్ వచ్చేలా రిలీజ్ చేశారు. ఆ తర్వాత ప్రోమో అంతా మళ్లీ గొడవలతో నిండిపోతుంది.


Click it and Unblock the Notifications











