Bigg Boss7 Elimination: వీణ స్టెప్పుతో టేస్టీ తేజ డ్యాన్స్.. యూ ఆర్ ఎలిమినేటెడ్ అంటూ షాకిచ్చిన నాగార్జున
బిగ్ బాస్ హౌస్‌లో ఆదివారం ప్రసారం కానున్న 15వ ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున.. హౌస్ నుంచి ఎలిమినేట్ కానున్న కంటెస్టెంట్ ఎవరనేది ఆదివారం రాత్రి ప్రకటించనున్నారు. అయితే, షకీలా హౌస్ నుంచి బయటకు వెళ్లిపోనుందని సోషల్ మీడియాలో ఊహగానాలు వెలుపడుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ ఆదివారం తాజా ప్రోమోను రిలీజ్ చేయగా... కంటెస్టెంట్లకు సరదా టాస్కులు ఇచ్చి ఎంటర్ టైన్ చేశారు. ఇక యూ ఆర్ ఎలిమినేటెట్ అంటూ చివర్లో నాగార్జున షాకిచ్చాడు. ఆ వివరాల్లోకి వెళితే...
ప్రోమో మొదట్లో కంటెస్టెంట్స్ అందరికీ నాగార్జున ఓ టాస్క్ ఇస్తాడు. టెలివిజన్ స్క్రీన్ మీద ఓ కాస్ట్యూమ్ కనబడుతుంది. ఆ కాస్ట్యూమ్ బట్టి సినిమా పేరు గేస్ చేయాలని చెప్తాడు. ఇక మొదట పుష్ప పోస్టర్ కు ప్రశాంత్ కరెక్ట్ చెప్తాడు. ఇక చిరంజీవి పోస్టర్ కు కూడా పల్లవి ప్రశాంత్ టీం కరెక్ట్ సమాధానం చెబుతుంది. ఇక రెచ్చిపోయి డ్యాన్స్ లు చేస్తారు.

ఇక మూడో పోస్టర్ బాలయ్య పోస్టర్ కు కూడా ప్రశాంత్ టీం సమాధాం చెబుతుంది. ఈ సరదా సరదా గేముల్లో టేస్టీ తేజతో వీణ స్టేప్పు వేయిస్తాడు. దీనితో అక్కడి ఉన్నవాళ్లల్లో నవ్వులు పూయిస్తాయి. ఇక నాగార్జున నామినేషన్స్ లో ఉన్న వాళ్లంతా నిలబడండి అంటాడు. దీనితో వారంత నిలబడుతారు. చివర్లో నాగార్జున యూ ఆర్ ఎలిమినేటెట్ అంటూ షాక్ ఇస్తాడు. దీంతో ప్రోమో ముగుస్తుంది.
ఇక ఈ బిగ్ బాస్ రెండో వారంలో హౌస్ నుంచి షకీలా బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో తక్కువ ఓట్లు రావచ్చని భావిస్తున్న ప్రిన్స్ యావర్ సేవ్ అయ్యారు. ఈ వారం అనుదీప్, ప్రశాంత్, షకిలా, టేస్టీ తేజ, గౌతమ్, ప్రిన్స్ యావర్, శోభాశెట్టి, రతికలు నామినేషన్స్‌లో ఉన్న సంగతి తెలిసిందే. వారిలో అమర్ దీప్ సేవ్ అయ్యాడు.

ఇదిలా ఉంటే... ఈ వారం మరో ఇద్దరు కంటెస్టెంట్లు హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అర్జున్ అంబటి, నటి సురేఖా వాణి కూతురు సుప్రిత హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. సీరియల్స్ చూసే ప్రేక్షకులకు అర్జున్ సుపరిచితుడే. దేవత లాంటి సీరియల్లో ఆయన నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇక సోషల్ మీడియాను ఎక్కువగా ఫాలో అయ్యేవారికి సుప్రిత గురించి పరిచయం అక్కర్లేదు. యూత్‌లో ఆమెకు ప్రత్యేక ఫాలోయింగ్ ఉంది. సురేఖా వాణి కూతురులాగా కంటే ముందు తను ఒక ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా నెటిజన్లకు పరిచయం అయ్యింది. డబ్‌స్మాష్, రీల్స్ చేస్తూ ఫేమస్ అయినవారిలో సుప్రిత కూడా ఒకరు. తను మాత్రమే కాకుండా తన తల్లి సురేఖా వాణితో కూడా వీడియోలు చేయిస్తూ ఫాలోవర్స్‌ను పెంచుకుంది సుప్రిత. మరి వీరి ఎంట్రీతో బిగ్ బాస్ హౌజ్ లో ఫుల్ మసాలా అంటున్నారు. చూడాలి ఇక ఏం జరగనుందో.


Click it and Unblock the Notifications











