Bigg Boss Telugu 7: ఆటగాళ్లు, పోటుగాళ్లకు మధ్య పోటీ - అమర్ అమాయకత్వం, తేజ కామెడీతో ఇల్లంతా నవ్వులు

Bubblegum Teaser: బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ అత్యధిక రేటింగ్ తో అదరగొడుతోంది. మొత్తం 13 మంది కంటెస్టెంట్లతో 7వ వారం చాలా ఆసక్తికరంగా మారింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన కంటెస్టెంట్లను పోటుగాళ్లు అంటున్న బిగ్ బాస్.. ఇప్పటికే ఇంట్లో వాళ్లను ఆటగాళ్లు అని ఫిక్స్ చేశాడు. అయితే నామినేషన్ ప్రక్రియలో వీరిద్దరి మధ్య మంట పుట్టిచ్చిన బిగ్ బాస్ మరోసారి టాస్కులు పెడుతూ వారి మధ్య వైరం పెడుతున్నాడు. అదేంటీ అనుకుంటున్నారా.. అదేం నిజమండి.. తాజాగా రిలీజ్ అయిన ప్రోమో చూస్తుంటే అలాగే అనిపిస్తోంది.

అయలు ఈ ప్రోమోలో ఏముందంటే..?:తాజాగా విడుదల అయిన ప్రోమోలో.. ఆటగాళ్లు, పోటుగాళ్లలో ఎవరు బెస్టో తెలుసుకోవాలనుకుంటున్నట్లు బిగ్ బాస్ వివరించారు. ఈక్రమంలోనే వీరిద్దరి కొన్ని టాస్కులు ఇచ్చారు. ఎవరు బాగా పర్ఫార్మ్ చేసి గెలిస్తే వారే బెస్ట్ టీమ్ గా ఎన్నికవుతారని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే కామెడీతో పాటు కొన్ని ఫన్నీ టాస్కులను బిగ్ బాస్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ముందుగా స్విమ్మింగ్ పూల్ కొన్ని టైర్లు ఉంచి.. వాటిని ఎవరైతే ముందుగా గార్డెన్ ఏరియాలో ఉన్న స్టాండ్ కు తగిలేస్తారో వారే విన్నర్ గా పెట్టారు. ఇందులో ఆటగాళ్లు టీం నుంచి సందీప్, యావర్ పాల్గొనగా.. పోటుగాళ్లు టీం నుంచి అంబటి అర్జున్, గౌతమ్ ను ఉంచారు. ఇది చాలా రసవత్తరంగా సాగినట్లు కనిపిస్తోంది.

Bigg Boss Telugu 7 Promo 2 Released by Bigg Boss And Special Tasks to Atagallu And Potugallu For Which Team is The Best

అలాగే కంటెస్టెంట్ల మెంటల్ స్కిల్స్ తెలుసుకునేందుకు హూ ఈజ్ ద జీనియస్ అనే రెండో టాస్కును ఇచ్చారు. అందులో ఆటగాళ్లు టీం నుంచి అమర్ దీప్ రాగా.. పోటుగాళ్లు టీం నుంచి గౌతమ్ వచ్చాడు. వారిద్దరికీ బిగ్ బాస్ కొట్టి ఫొటోలు చూపస్తూ.. సింపుల్, లాజిక్ ప్రశ్నలు అడిగాడు. ఈ టాస్క్ ఆద్యంతం ఆకట్టుకుంది. ముఖ్యంగా అమర్ దీప్ అమాయకంగా ఫేస్ పెట్టి చెప్పిన సమాధానాలు అయితే అందరికీ నవ్వు తెప్పించేలా ఉంది. ఇందులో భాగంగానే 5 తలుపులను చూపించి ఇందులో ఏది తెరవడం కష్టం అని బిగ్ బాస్ తేజను అడగా... ఆయను అన్నీ పరిశీలించాడు.

ప్రతీ డోర్ గురించి వివరిస్తూ.. విపరీతమైన కామెడీ చేశాడు. ఈ విషయం గుర్తించిన బిగ్ బాస్... తేజ మీకు తలుపుల మీద మంచి అవగాహన ఉందంటూ కితాబు ఇచ్చాడు. దీనికి ఇంట్లోని వారంతా నవ్వుతూ, క్లాప్స్ కొడుతూ గోల గోల చేశారు. అయితే ఆ తలుపుల్లో ఎవరిని పెడతారని మాత్రం అడగకండి బిగ్ బాస్ అంటూ టేస్టీ తేజ చెప్పే డైలాగ్ నవ్వులు పూయిస్తోంది. ఈ అద్భుతమైన ఎపిసోడ్ ను చూడాలంటే ఇంకాసేపు ఆగితే సరిపోతుంది.

నిన్నటి వరకు సీక్రెట్ రూంలో ఉన్న గౌతమ్ కృష్ణ ఇంట్లోకి రాగానే.. రాననుకున్నారా, రాలేననుకున్నారా.. అంటూ బిగ్ బాస్ హౌస్ లోకి గౌతమ్ అడుగు పెడతాడు. అశ్వత్థామ ఈజ్ బ్యాక్ అంటూ తనను తాను అశ్వత్థామతో పోల్చుకున్నాడు. తేనె పూసిన కత్తిని గొంతులోకి దింపారు కదా అంటూ గట్టిగా అన్నాడు అయినా ఈ అశ్వత్థామ చావడు అని అరుస్తూ.. రీ ఎంట్రీ ఇచ్చాడు. గౌతమ్ రావడం చూసి ఇంట్లోని కంటెస్టెంట్లు అందరూ షాకయ్యారు.

Bigg Boss Telugu 7 Promo 2 Released by Bigg Boss And Special Tasks to Atagallu And Potugallu For Which Team is The Best

ఈక్రమంలోనే గౌతమ్.. శివతో మాట్లాడుతూ.. గౌతమ్ ఎక్కువ ఎంటర్ టైన్ చేయలేడేమో అని అన్నారు కదా అంటూ ఫైర్ అవుతాడు. అలాగే ఎంటర్ టైన్ మెంట్ అంటే ప్యాంటు విప్పేసి తిరగడం కాదు కదా అంటూ శివాజీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ డిస్కషన్ చూస్తుంటే.. గత సీజన్ లో అఖిల్ చేసిన అతే గుర్తుకు వస్తుందని నెటిజన్లు అంటున్నారు. అయితే అఖిల్ గాలి అభిజీత్ తీసినట్లు.. ఈ సీజన్ లో గౌతమ్ గాలి శివాజీ తీస్తాడంటూ జోకులు వేసుకుంటున్నారు. మరి ఏం జరగనుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X