Bigg Boss Telugu 7: టీమ్ మెంబర్స్‌ను బఫూన్స్ అంటూ రెచ్చిపోయిన రతికా... అది నోరా తాటిమట్టనా?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఉల్టా పుల్టా అంటూ ప్రారంభం అయింది. ఇక మొదటి వారం అంతగా ఆకట్టుకోకపోయినా.. రెండో వారం కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఇక ఇప్పుడిప్పుడే కంటెస్టెంట్స్ మధ్య గొడవలు మొదలయ్యాయి. మొన్న నామినేషన్స్ లో ప్రశాంత్ పై కంటెస్టెంట్స్.. అందరూ రైతు బిడ్డ పేరుతో టార్గెట్ చేసినట్లు అనిపించింది. ఇక తాజాగా విడుదల అయిన ప్రొమోలో రతిక రెచ్చిపోయి మాట్లాడింది. అంతే కాదు.. టీమ్ మెంబర్స్ అందరినీ బఫూన్స్ అంటూ మాట్లాడింది. ఆ వివరాల్లోకి వెళితే...
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రోజురోజుకు ఆసక్తిని కలిగిస్తోంది. ముందు ఉన్న ఆరు సీజన్లు ఒక ఎత్తు అయితే.. ఈ ఒక్క సీజన్ మరో ఎత్తు అన్నట్లుగా సాగుతోంది. నాగార్జున ముందు నుంచి చెప్పినట్లుగానే ఈ సీజన్ అంతా ఉల్టా ఫుల్టాగా ప్రసారం అవుతోంది. రెండో వారం నుంచి కంటెస్టెంట్స్ మధ్య గొడవలు ఎక్కువయ్యాయి.

ఇక టాస్కుల విషయంలో కూడా ఒక్క్కొక్కరు ఒక్కో స్ట్రాటజీని ప్లే చేస్తూ.. అందరినీ ఎంటర్ టైన్ చేస్తున్నారు. ఇక నిన్నటికి నిన్న మాయ అస్త్రాన్ని సంపాదించడానికి పెట్టిన గేమ్ లో రణధీర టీమ్ ఫిజికల్ గా ఫైట్ చేసి గెలిచింది. ఇక మహాబలి టీమ్ ఆడలేక... గెలవలేక .. అస్త్రాలను దొంగతనం చేసి అదొక స్ట్రాటజీ అంటూ వెల్లడించారు.
అక్కడితో ఆగకుండా పర్మిషన్ లేని సంచాలకుడు అయిన సందీప్ రూమ్ లోకి వెళ్లి పవర్ అస్త్రను దొంగతనం చేశారు. తమకేమి తెలియదు అన్నట్లు మహాబలి టీమ్ నటించిన నటన మహానటులనే మించిపోయేలా చేసింది. ఇక మహాబలి టీములో ఉన్న రతిక తన ఈగోతో హౌస్ లో లేనిపోని గొడవలను సృష్టించింది.

పవర్ అస్త్ర కోసం జరిగిన ఆటలో మహాబలి టీములో ప్రతి ఒక్కరు.. రణధీర్ టీములో ఉన్న వారికి మాయ అస్త్ర మరొకరికి ఇవ్వాలంటూ బిగ్ బాస్ చెప్పుకువచ్చారు. అంతే కాదు దానికి కారణాలు చెప్పాలని బిగ్ బాస్ చెప్పారు. దానికి రతిక చివర్లో వెళతాను అని చెప్పడం.. దానికి టీమ్ వద్దు అనడంతో ఆమె ఈగో హార్ట్ అయ్యిందని తెలుస్తోంది. దీంతో ఫైర్ అయిన రతికా రోజ్... సొంత టీమ్ నే బపూన్స్ అంటూ రెచ్చిపోయింది. సైలెంటుగా ఉన్నానని అరవద్దు అంటూ... ఈ టీమ్ చెండాలం గా ఉందని మాట్లాడింది.

ఇక రతికా రోజ్ అన్న మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. అసలు అది నోరా తాటిమట్టా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆటను ఆటగా చూడాలంటూ.. ఇలా సొంత టీమ్ పైనే అరవడం ఏంటని అంటున్నారు. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరగనుందో వేచి చూడాల్సిందిే.


Click it and Unblock the Notifications











