bigg boss telugu7 పవర్ అస్త్ర కోసం అమర్ దీప్‌కి గుండు...ప్రియాంకకు హెయిర్ కట్..జుట్టును ఎవరు త్యాగం చేశారంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రోజు రోజుకు ఆసక్తిగా సాగుతోంది. గత సీజన్స్ కంటే ఈ సారి డిఫరెంటుగా ప్లాన్ చేసిన బిగ్ బాస్... అందుకు తగ్గట్లుగానే టాస్కులు ఇస్తూ ఎంటర్ టైన్ చేస్తున్నాడు. తాజాగా పవర్ అస్త్ర కోసం పోటీకి దిగిన శోభా, అమర్ దీప్, ప్రిన్స్ యావర్ లకు తనదైన శైలిలో పవర్ అస్త్ర గెలవడానికి తాను యోగ్యులు అని నిరూపించడానికి టాస్కులు ఇస్తున్నాడు. తాజాగా అమర్ దీప్ కు బిగ్ బాస్ ఓ టాస్క్ ఇవ్వగా ఏం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభం అయిన మొదటి రోజు నుంచి ఆసక్తిగా సాగుతోంది. రెండు వారాలు పూర్తి చేసుకుని మూడో వారంలోకి అడుగుపెట్టనున్న ఈ షో... సరదా సరదాగా సాగిపోతుంది. బిగ్ బాస్ హౌజ్ లోకి 14 మంది ఎంటర్ అవ్వగా... ఇద్దరు (కిరణ్ రాథోడ్, షకీలా) ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌజ్ లో 12 మంది ఉన్నారు.

Bigg boss telugu 7 Promo Day 18 Promo

ఇక బిగ్ బాస్ హౌజ్ లో ఇప్పటికే సందీప్, శివాజీ పవర్ అస్త్రను సాధించుకొని పర్మినెంట్ హౌస్ మేట్స్ గా మారారు. ఇక మిగతా పది మంది కంటెస్టెంట్స్ మధ్య బిగ్ బాస్ చిచ్చు పెడుతూనే ఉన్నాడు. ముఖ్యంగా శోభా శెట్టి, రతిక, పల్లవి ప్రశాంత్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు అన్నట్లుగా సాగుతోంది. పవర్ అస్త్ర కోసం పోటీకి దిగిన ప్రతిసారి వీరు ఒక పెద్ద యుద్ధాన్నే సృష్టిస్తున్నారు.

బిగ్ బాస్ హౌజ్ లో కంటెండర్ గా మారడానికి.. బిగ్ బాస్.. శోభా, అమర్ దీప్, ప్రిన్స్ యావర్ ను సెలెక్ట్ చేయగా... వారు పవర్ అస్త్రకు పనికిరారు అని చెప్పిన సభ్యులతో ఒక పోటీని పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ప్రిన్స్ గంటసేపు ఓ స్టాండ్ కు గంటసేపు చిన్ పెట్టి నిల్చొన్నాడు. ఆ టైంలో రతిక, దామిని ఎన్నో రకాలుగా టార్చర్ చేశారు. ఇక ఈ టాస్కులో యవర్ గెలిచి.. తను యోగ్యుడు అని నిరూపించుకున్నాడు.

o Amardeep Headshave And Priyanka Hair cut

ఇక శోభాను.. అనర్హురాలు అని చెప్పిన వారికి బిగ్ బాస్ మరో పోటీ నిర్వహించాడు. ఇందులో స్పైసీ చికెన్ ను శోభా కన్నా ఎక్కువ తినగలిగితే.. ఆమె ప్లేస్ లో మరొకరిని కంటెండర్ గా నిలబెడతానని చెప్పడంతో శుభ, పల్లవి ప్రశాంత్, గౌతమ్.. ఆ టాస్క్ కోసం పోటీపడ్డారు. ఈ పోటీలో శోభా.. ఆ కారం తినలేక ఏడుస్తూ.. తనవల్ల కాదని కన్నీళ్లుపెట్టుకుంది. అయితే చివరకు ఈ టాస్కులో శోభానే గెలుస్తుందని సమాచారం.

ఇక ఇంకోపక్క అమర్ దీప్ ను అనర్హుడు అని చెప్పిన ప్రియాంకకు కూడా బిగ్ బాస్ పోటీ చేయమని చెప్పుకొచ్చాడు. వారిద్దరిలో ఎవరైతే జుట్టును త్యాగం చేస్తారో.. వారే పవర్ అస్త్ర కోసం పోటీపడతారని తెలిపాడు. దీంతో ప్రియాంక, అమర్ ఇద్దరు.. తాము ఈ పని చేయలేమని చెప్పారు. అమర్ దీప్ అయితే గుండు కొట్టించుకోవాలని, ప్రియాంక అయితే భుజంపై వరకు హెయిర్ కట్ చేయాలని బిగ్ బాస్ చెప్పాడు.

Bigg boss telugu 7 Promo Day 18 Promo Amardeep Headshave

అమర్ దీప్ కు తన హెయిర్ అంటే ఇష్టమని... తనకు రవితేజ ఫేవరేట్ అని ఆయన తన జుట్టుపై చెయ్యి వేసి.. నాలానే ఉంది అని మెచ్చుకున్నారని గుర్తు చేసుకున్నాడు.. ఇప్పుడు దీనికోసం నా హెయిర్ ను ఇవ్వలేను అని చెప్పాడు. అయితే ఈ టాస్కులో ప్రియాంక తన జుట్టు త్యాగం చేయనున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X