Bigg Boss Telugu 7 : మీరెవ్వరూ ఊహించనిది రేపే అంటూ నాగ్ హింట్... ఆ ముగ్గురు ఔట్!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రసవస్తరంగా సాగుతోంది. ఇక ఐదో వారం ఎంటర్ అయింది. ఇక ఈ సారి ముగ్గురు ఎలిమినేషన్ అంటూ ప్రచారంసాగుతోంది. అయితే ఒక్కరే ఎలిమినేట్ కానున్నట్లు తెలుస్తోంది. ఆ విషయం పక్కన పెడితే.. తాజాగా బిగ్ బాస్ ప్రోమో రిలీజ్ అయింది. ఇక ఈ ప్రోమోలో అన్ డిజర్వ్ ముగ్గురు ఎవరు అంటూ నాగార్జున కంటెస్టెంట్స్ కు షాక్ ఇచ్చాడు. ఇక దానితో పాటు.. మరో ఊహించని ట్విస్టు అంటూ హింట్ ఇచ్చాడు. అదేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఈసారి ఉల్టా పుల్టాగా సాగుతోంది. ఇప్పటికే 14మంది కంటెస్టెంట్స్ ఎంటర్ అవ్వగా.. అందులో నలుగురు ఎలిమినేట్ అయ్యారు. అయితే మిగిలింది మాత్రం 10 మంది. మరి ఆ పది మందిలో ఈసారి ఒకరు ఎలిమినేట్ అవ్వగా.. ఉండేది 9 మంది. మరి 9 మందితో మరో పది వారాలు ఎపిసోడ్ లాగడం అసాధ్యం. సో ఈసారి బిగ్ బాస్ సీజన్ 7 లో మిని లాంచ్ ఉంటుందని వార్తలు వస్తునే ఉన్నాయి.

తాజాగా బిగ్ బాస్ వీకెండ్ ప్రోమో ఒకటి రిలీజ్ అయింది. ఆ ప్రోమోలో నాగార్జున బిగ్ బాస్ సీజన్ 7 గురించి మరో హింట్ ఇచ్చాడు. ఇంతకీ ఆ ప్రోమోలో ఏముందంటే... ప్రోమో ప్రారంభంలో నాగార్జున మాట్లాడతూ... హౌజ్ లోకి 14 మంది వచ్చారు. అందులో నలుగురు ఎలిమినేట్ అయ్యారు. ఇక మిగిలింది 10 మంది.. మరి ఇందులో ముగ్గురు అన్ డిజర్వ్ అని ఎవరు.. అని నాగార్జున చెప్పారు. ఇక ఇందులో ప్రియాంక.. గౌతమ్, శివాజీ, శుభ శ్రీ ను అన్ డిజర్వ్ గా సెలెక్ట్ చేసింది.
శుభశ్రీ.. ప్రియాంక, తేజా, అమర్ దీప్ ల గా అన్ డిజర్వ్ గా సెలెక్ట్ చేసింది. శోభాశెట్టి.. తేజా, సందీప్, శివాజీ లను అన్ డిజర్వ్ గా ఎంపిక చేసింది. ఇక పల్లవి ప్రశాంత్.. అమర్ దీప్, యావర్, సందీప్ లను అన్ డిజర్వ్ గా ఎంపిక చేశాడు. సందీప్.. యావర్, శివాజీ, గౌతమ్ లను సెలెక్ట్ చేశాడు. తేజా.. అమర్ దీప్, శుభశ్రీ, గౌతమ్ లను చేయగా.. అమర్ దీప్.. యావర్, శుభశ్రీ, గౌతమ్లను చేశాడు. శివాజీ.. అమర్ దీప్, ప్రియాంక, గౌతమ్ లను అన్ డిజర్వ్ గా ఎంపిక చేశాడు.
ఇలా ఎవరికి వాళ్లు తమకి ఇష్టం లేని కంటెస్టెంట్స్‌ని అన్ డిజర్వ్ అంటూ ఒక్కొక్కరు ముగ్గురు ముగ్గురు చొప్పున కంటెస్టెంట్స్‌ని ఎంపిక చేశారు .అయితే చివర్లో నాగార్జున ఓ ట్విస్ట్ ఇచ్చారు. హౌసులో ఉన్న అభిప్రాయం ప్రకారం.. కింది స్థానంలో ఉన్న ముగ్గురు కంటెస్టెంట్స్ గురించి రేపటి ఎపిసోడ్‌లో చెప్తానంటూ షాక్ ఇచ్చాడు. ఇక మీరు ఎవరూ ఊహించని విషయం రేపు జరగబోతుంది. దానికి ప్రిపేర్ అయ్యి ఉండండి అని చెప్పుకువచ్చాడు. ఇక్కడితో ప్రోమో ముగుస్తుంది.
ఇక నాగార్జున ఇలా చెప్పడం వెనుక కారణం ఏంటంటే.. రేపు బిగ్ బాస్ 2.ఓ లాంఛింగ్ ఉంది. దాని గురించే ఇలా చెప్పుకు వచ్చాడని తెలుస్తోంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా కొత్తగా కంటెస్టెంట్స్‌ను హౌస్‌లోకి పంపబోతున్నారని తెలుస్తోంది. అయితే ఆటను మరింత రంజుగా మార్చడం కోసం.. హౌస్‌లో ఉన్న 10 మందికి ముందే హింట్స్ ఇచ్చాడు నాగార్జున.


Click it and Unblock the Notifications











